రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో కొంతకాలం ఉండి చదువుకున్నారు. ఆ సంస్థను ఆయన హైదరాబాద్ మధ్యలో లండన్ అనేవారు.
ఆయనకు అక్కడి తిండి తీరు నచ్చలేదు. ఒకనాడు వంటవాళ్లను అడిగి మిరప్పొడి, ఉప్పు తెప్పించుకుని అందులో నూనె కలుపుకుని దానితో అన్నం తింటున్నారు. ఒక మహిళ అది గమనించి, ఏమిటి తింటున్నావు అని అడిగింది. ఈయన గర్వంగా గన్ పౌడర్ అన్నారట. అది తిని ఎట్లా బతుకుతావు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అది లేకుంటే నేను బతకలేను అని ఈయన జవాబు!
అక్కడి వాతావరణం నుంచి బయటపడాలని ఆయన పక్కనే ఉన్న మా ఉస్మానియా బి హాస్టల్‌కు వచ్చేవారు. ఒక సారి భోజనానికి కూడా ఉండిపోయారు. ఆ సంగతి విన్న ఆ మహిళ ఈజ్ ఇట్ నాట్ నాయిసీ దేర్ (అక్కడంతా గోలగా లేదా) అని అడిగింది. నో, ఇట్ ఈజ్ వెరీ లైవ్ లీ (లేదు, అక్కడ చాలా జీవవంతంగా అంది) అని జవాబిచ్చారు.
ఈ సంగతులు ఆయనే మాతో చెప్పారు.
గోపాలం కె. బి.
గన్‌పౌడర్ భోజనం
Published Mon, May 4 2020 12:06 AM | Last Updated on Mon, May 4 2020 12:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment