ఇప్పటి యువతను చూస్తే ముచ్చటేస్తుంది. అద్భుతమైన శక్తిసామర్థ్యాలు వారి సొంతం. కొద్దిమంది అంటుంటారు-‘‘ఆయన చెబితేగానీ నాలోని శక్తి ఏమిటో నాకు తెలియలేదు’’
ఇప్పటి యువతను చూస్తే ముచ్చటేస్తుంది. అద్భుతమైన శక్తిసామర్థ్యాలు వారి సొంతం. కొద్దిమంది అంటుంటారు-‘‘ఆయన చెబితేగానీ నాలోని శక్తి ఏమిటో నాకు తెలియలేదు’’ అని. ఎవరో వచ్చి మన శక్తి గుర్తించి, చెప్పే వరకు ఎందుకు నిరీక్షించాలి? ప్రతి మనిషిలో ఒక విమర్శకుడు ఉంటాడు. అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీలో శక్తి ఏమిటో, లోపాలు ఏమిటో చెబుతాడు.
కలను నిజం చేసుకోవడమంత గొప్ప పని ఈ జీవితంలో మరొకటి లేదు. ఏ లక్ష్యం లేకుండా రోజులు దొర్లించడమనేది మనకు మనమే హాని చేసుకోవడం లాంటిది. మీ కంటూ ఒక లక్ష్యం లేనట్లయితే ఏర్పరుచుకోండి. ఉంటే కృషి చేయండి.
లక్ష్యాన్ని చేరుకున్న రోజు ఒక్కసారి కళ్లు మూసుకొని మౌనంగా ఉండండి. తెరలు తెరలుగా ఆనందం మీ హృదయాన్ని తాకుతుంది. నిజానికి అది మాటల్లో చెప్పే అనుభూతి కాదు. అది మీ సొంతం కావాలంటే...ప్రయత్నించండి, గెలవండి!
- షారుక్‌ఖాన్