కిడ్నీల్లో రాళ్లు... నివారణ ఇలా..!
మహాభాగ్యం
సమ్మర్‌లో మనం నీళ్లు ఎక్కువగా తాగినా సరే... చెమట వల్ల ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. దీనివల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జిస్తారు. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, ఆ మోతాదులో మూత్ర విసర్జన చేయడానికి గాను రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి. ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ఇవి రాళ్లు ఏర్పడే కారకాలు.
క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది.ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ.కూల్‌డ్రింకులు కూడా అలాంటి ప్రమాదాలనే కలిగిస్తాయి. కాబట్టి వాటిని మానేయాలి.