నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హలో.. రామ్ గారూ. ఐ నీడ్ యువర్ హెల్ప్. నా ప్రాబ్లమ్ చాలా కాంప్లికేటెడ్. నా ప్రాబ్లమ్ విన్న తరువాత మీరు నన్ను హేట్ చేస్తారేమో! మేము 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఇద్దరం జాబ్ చేస్తున్నాం. మా పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి చాలా ట్రై చేశాం. కానీ చనిపోతామని బెదిరించారు. బైటకి వెళ్లి పెళ్లి చేసుకునే శక్తి మాకుంది. కానీ మేము ఆ పని చేయలేదు. పేరెంట్స్ కావాలనుకున్నాం. అదే మా తప్పయింది. నాకు ఇష్టం లేకపోయినా వేరే వ్యక్తితో నా పెళ్లి కుదిర్చారు. చస్తామని బెదిరించి పెళ్లి చేసేశారు. మా పేరెంట్స్ మీద ఉన్న కోపం ఈ అబ్బాయి మీద చూపిస్తున్నా. మనసులో ఒకరిని పెట్టుకుని వేరే వారితో కాపురం చేయడం నా వల్ల కాదు. అందుకే అతను కొంచెం టచ్ చేసినా కోపం వస్తోంది. ఇప్పుడు మా పేరెంట్స్ కాపురం చేయకపోతే చస్తామని బెదిరిస్తున్నారు. అలా వేరేవాడు నా మీద చెయ్యి వేస్తే ముందు నేనే చచ్చిపోతా.
నా వల్ల నేను ప్రేమించిన అబ్బాయి పిచ్చివాడైపోయాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టడంలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అంటున్నాడు. ముందు నో చెప్పిన అతని అమ్మానాన్న ఆ అబ్బాయి బాధను చూసి మారిపోయారు. విడాకులు తీసుకుని వస్తే మాకు పెళ్లి చేయడానికి ఏం ప్రాబ్లమ్ లేదంటున్నారు. అటు అతను ఇటు ఇతను. చావే బెటర్ అనిపిస్తుంది. ఏ టెన్షన్స్ ఉండవు కదా! ఒకప్పుడు మా లవ్ రిలేషన్ చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇప్పుడు వాళ్లే మమ్మల్ని చీప్‌గా చూస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాను. ఫ్లీజ్.. డోంట్ హేట్ మి సార్. – నీత, ఈ–మెయిల్
‘నీలాంబరీ.. ఇవాళ నరసింహ కనబడ్డాడు. ఏమీ మారలేదు. అప్పుడు ఎంత స్మార్ట్‌గా ఉన్నాడో ఇప్పుడూ అంతే స్మార్ట్‌గా ఉన్నాడు. ఎన్నాంగో.. లిఫ్ట్ వాంట్ మా అని నాకు లిఫ్ట్ ఇస్తానన్నాడు. 10 ఇయర్స్ బ్యాక్ నీకు ప్రపోజ్ చేసాడు కదా. ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉందో కెలికి చూద్దామని హౌ ఆర్ యూ అని అడిగా. నల్లగా ఉన్నానని నీలూ నాకు అప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు. శివాజీని అడిగి ఫుల్ క్రీములు రాసి నీలూ హార్ట్ మార్చేద్దామని ట్రై చేస్తున్నా. ఇంకా ఈవెన్ నౌ... ఐ యామ్ స్టిల్ ట్రైయింగ్.. మైండిట్ అన్నాడు. ఓరి నాయనో వీడి అరవ పిచ్చి నాకెందుకులే అని తప్పించుకొచ్చేశా’ అన్నాను నీలాంబరితో.
‘నరసింహ లవ్ చాలా ప్యూర్ సర్. చాలా ప్రేమిస్తాడు నన్ను. లైఫ్ ఇచ్చేస్తానంటాడు. కావాలంటే నా అరటి తోటలో లైఫ్ లాంగ్ కూలీగా ఉండిపోతానంటాడు’ అని సిన్సియర్‌గా చెప్పింది నీలు. ‘మరి ఎందుకు లవ్ చేయవు.. ఎం.. దు.. కు నీలూ.. ఐ మీన్ నీలాంబరీ’ అని అడిగా.‘ఎ ఉమెన్ షుడ్ హేవ్ గోల్ డాక్టర్. ఎవడో గొప్పగా ప్రేమించాడనో.. తల్లిదండ్రులు అన్నం పెట్టి... చదువు చెప్పి పెంచారనో.. ఇంకెవరో దయ తలచి చేసుకున్నాడనో... లైఫ్‌ని పారేసుకోకూడదు సర్. యు హేవ్ టు లివ్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ టెర్మ్స్. నేను మొండి సార్. అవసరమైతే లైఫ్‌ని కూడా నా దారికి బెండ్ చేసుకుంటా. నరసింహది రహదారి అయితే నా దారి సూపర్ దారి సర్.
నరసింహ, బాషా, ముత్తు, శివాజీ, కబాలి.. ఎనీ బడీ.. వాళ్ల ప్రేమ ఎంత గొప్పదైనా.. నా లక్ష్యం రూట్ మార్చలేరు.. ఐ యామ్ గోయింగ్ టు బి బెటర్ దేన్ యూ లవ్ డాక్టర్..’ అని ఎమోషనల్‌గా అరుస్తూ నా హ్యాండ్‌ను ఊడేలా షేక్ చేస్తోంది ఆల్ మోస్ట్ నీలాంబరి క్యారెక్టర్‌లో రమ్యకృష్ణలా. బంగారు నీతా.. నువ్వేమి తక్కువ తిన్నావు. కమ్ ఆన్ స్టాప్ థింకింగ్ ఆఫ్ డెత్. స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఛేంజింగ్ లైఫ్. నువ్వు నా చెల్లెలివి. మనసు చంపుకుని, దీక్ష పెంచుకుని ఒక సూపర్ రూట్ పెట్టుకో. కెరీర్‌లో బర్నింగ్ పెర్‌ఫార్మెన్స్ చూపించు. నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను ప్రేమించే వాళ్లే. ఎవరినీ ద్వేషించొద్దు. అందరినీ గౌరవించు. కాన్సన్‌ట్రేట్ ఆన్ కెరీర్. పడకకు ఒక గది, మనసుకు ఒక గది అని కన్‌ఫ్యూజ్ కావద్దురా బంగారం.
ఎంతో మందిని సంతోషపెట్టడానికి పెళ్లి చేసుకున్నావు. దట్స్ వేర్ ద మేటర్ ఎండ్స్ బంగారం. బాధ ఉన్నా కష్టం అనిపించినా డోంట్ బ్రేక్ ద హోలీ బాండ్. నిన్ను నిజంగా ప్రేమించేవాడైతే వాడి కెరీర్ మీద మైండ్ పెట్టి, నీ కాపురాన్ని నిలబెట్టాలి. 6 మంత్స్‌లో నాకు ‘అన్నయ్య ఐ డిడ్ ఇట్. ఐ యామ్ హ్యాపీ’ అని మళ్లీ ఉత్తరం రాయాలి. ఐ డోంట్ హేట్ యూ. ఐ లవ్ యూ బంగారం. ఐ యామ్ విత్ యు నాన్నా. బి స్ట్రాంగ్. నువ్వు నవ్వుతూ అమ్మ, నాన్న, భర్త, బంధువులతో కలకాలం చల్లగా ఉండాలని సాక్షి ఫ్యామిలీ అంతా కోరుకుంటుంది. బ్లెస్ యూ తల్లీ.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com