నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్. నా చదువు పూర్తయ్యి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. నేను ఏడాది కిందట ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. మా కులాలు వేరు. నాకు అతనంటే ఇష్టమని అతనికి కూడా తెలుసు. అతను కూడా నాతో ఇష్టంగానే ఉండేవాడు. కానీ, నేను ఇష్టపడిన రెండు నెలలకే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను అతడిని మరిచిపోలేక వేరే పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నా ముందే వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉంటుంటే తట్టుకోలేకపోతున్నాను.
‘మీరంటే ఇష్టమని అతనితో నేను చెప్పినప్పుడు లవ్ మీద నమ్మకం లేదన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లి అయిన తరువాత నుంచి నాతో క్లోజ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు’. అతను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు సార్. అతను ఒక సెల్ఫిష్ అని తెలిసి కూడా అతడిని మరిచిపోలేకపోతున్నాను. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకు అరటి పండు అని కాకుండా కొంచెం అర్థమయ్యేలా డైరెక్ట్‌గా సమాధానం చెప్పండి. ఫ్లీజ్ సార్.
– సోనమ్
‘సర్.. ఇవాళ అరటి పండు ఉండదు. తొక్క తోలు కబుర్లు వద్దు. బనానా మిల్క్ షేక్‌లు, బనానా చిప్స్ గురించి మాట్లాడటమే కాదు ఆలోచించడం కూడా బంద్. అయినా నా ఫ్రెండ్స్ లవ్ అండ్ లైఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఉత్తరాలు రాస్తుంటే మీరేంటి సార్ ఫ్రూట్స్ గురించి.. డ్యూటీ మరిచి.. పాపం సర్! సో మచ్ ఎగొనీ వాళ్లకుంటే యూ ఆర్ ఆల్‌వేస్ జోకింగ్’...
‘హలో.. నీలాంబరీ.. మంచి ఫ్లోలో ఉన్నావు. నన్నేమి చెయ్యమంటావ్? అమ్మాయిలు ఇంత సెన్సిటివ్‌గా ఉంటే ఎలా? ప్రేమ గొప్పది. దేర్ ఈజ్ నథింగ్ గ్రేటర్ దేన్ లవ్. యాక్చువల్లీ ప్రేమను మించిన జీవితమే లేదు. బట్ ప్రాబ్లమ్ ప్రేమది కాదు. ప్రాబ్లమ్ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం. అంతకంటే పెద్ద ప్రాబ్లమ్ ప్రేమను గుర్తించకపోవడం. ది వరస్ట్ థింగ్ ఈజ్ దట్ ప్రేమలో పడ్డాము అంటారు. ప్రేమ ఈజ్ సూపర్ లవ్‌లీ. ఎక్స్‌ట్రార్డనరీ. దాంట్లోపడ్డం కాదు లేచి నిలబడాలి. అలా నిలబడే, కలబడే ప్రేమను ఎంచుకోవాలి. మిస్టర్ జింగిరి స్వార్థపరుడు. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు. అంటే వాడు ప్రేమిస్తున్నది డబ్బును.. సోనమ్‌ను కాదు అని తెలుసుకోవడానికి, గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఏంటి?
ప్రాబ్లమ్ అంతా మన ప్రేమతోనే, వాడితో కాదు. హీ ఈజ్ క్లియర్. హీ వాంట్స్ మనీ అండ్ ఎంజాయ్‌మెంట్. సోనమ్‌కి కమిట్ మెంట్ కావాలి. రెండు దారులు తూర్పు, పడమర. అయినా తప్పులు జరగవా?వాడు ఒక తప్పు. తప్పును తుడిచేసుకోవాలి. అక్కడ నుంచి సోనమ్ ఆగే బడ్‌నా.. ముందుకు దూసుకుపోవాలి. ప్రపంచమంతా ప్రేమించేంత గొప్పగా దూసుకుపోవాలి.నేను అమితంగా ప్రేమించే అరటిపండును నేను తినలేదని ఇవ్వాళ ఎంత బాధ పడినా నువ్వు ఎంత ఫోర్స్ చేసినా ఐ విల్ నాట్ టచ్ ఇట్. ఓకే నీలాంబరీ?’‘పండు.. గెల.. చెట్టూ కాదు సార్.. ఆఫ్టర్ దిస్ లవ్లీ ఆన్సర్.. మీకు నా తోట రాసిస్తాను సార్’.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com