ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం | Natural Treatment For Skin Beauty | Sakshi
Sakshi News home page

ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం

Aug 2 2019 10:18 AM | Updated on Aug 2 2019 10:18 AM

Natural Treatment For Skin Beauty - Sakshi

ఆర్గానిక్, నేచురల్, వీగన్, గోగ్రీన్‌ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ ఈమధ్యకాలంలో సోషల్‌మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్‌ ప్రపంచంలో ఇవి ప్రముఖమైన పదాలుగా మారాయి. కారణం అవి పాకశాస్త్రంలోనే కాదు. శరీరసౌందర్యాన్ని పెంపొందించుకోవడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.  ప్రస్తుతకాలంలో ఆరోగ్యవంతంగా జీవించడం, స్థిరమైన జీవన విధానం అనేవి ప్రధానంగా అందర్నీ ప్రభావితం చేస్తున్నాయి. ఇవే శరీర సౌందర్యం విషయంలో కూడా కీలకంగా మారాయి. అందుకే ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా వినియోగదారులు ఇందుకు ఉపయోగపడే వస్తువుల్ని వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ అందరి మదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే – మనకు లభిస్తున్న సబ్బులు, సౌందర్య సాధనాలన్నీ స్వచ్ఛమైనవేనా?

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం ద్వారా ఎన్నో పోషకాలు మన శరీరం లోపలికి వస్తాయి. అయితే ఎన్నో మంచి పోషకాలతోపాటు, చర్మానికి చెడుచేసే ఎన్నో హానికారక రసాయనాలు కూడా చర్మం ద్వారా లోపలికి వచ్చేస్తుంటాయి. అందుకే అవి వాడేముందు మనం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఏ పదార్ధాలు కలిపారు, ఎలాంటివి ఉపయోగించారో తెలుసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో మన ఇళ్లలో పసుపు, చందనం, పాలతో స్నానం చేయించేవారు. వాటిని మనం పాతపద్ధతులంటున్నాం. కానీ అవి ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారాయి. సంపూర్ణ చర్మ సంరక్షణ కావాలంటే మనం ఉపయోగించే ఉత్పత్తుల్లో కొన్ని తప్పక ఉండాలి. అవి ఏంటంటే...
చందనం: క్రమం తప్పకుండా చందనం ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు. ముఖ్యంగా చందనం బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ట్యాన్‌ని అరికడుతుంది. అన్నిటికీ మించి మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. దీనివల్ల మీ చర్మంపై ఎలాంటి ముడతలు కన్పించవు.
పసుపు: చర్మంపై ఉండే మచ్చలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా కన్పించేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అన్నిటికీ మించి మొటిమల నివారణకు పసుపుని మించిన ఔషధం లేదు. పసుపు క్రమం తప్పకుండా వాడితే మొటిమలు రావు.
కుంకుమ పువ్వు: కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా స్వచ్ఛంగా, స్మూత్‌గా తయారవుతుంది.
కలబంద: కలబందను అలోవెరా అని కూడా  అంటారు. ఇది చర్మంపై ఒక పొరలాగా ఉపయోగపడుతుంది. ఈ లేయర్‌వల్ల చర్మంపై ఎప్పుడూ తేమ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
బాదం పాలు: ఎండ వేడి వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఈ సహజసిద్ధమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement