
రీనా నుంచి స్టైలిష్ దాకా!
ఆధునిక వనితల మనసెరిగిన డిజైనర్ ఎవరున్నారని వెతికితే ముందువరసలోఉంటారు
ఆధునిక వనితల మనసెరిగిన డిజైనర్ ఎవరున్నారని వెతికితే ముందువరసలోఉంటారు రీనా దాకా! సౌకర్యంతో పాటు స్టైల్‌గా కనిపించే ఆమె డిజైనరీ డ్రెస్సులను చూస్తే ఆ మెరుపులను రీనా నుంచి మన ఇంటి దాకా తెచ్చుకోకుండా ఉండగలమా!
శాఖలుగా విస్తరించిన చెట్టు కొమ్మల ప్రింట్లు గల బూడిదరంగు ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ఆధునిక యువతులను ఆకర్షించేలా వీటికి కొంత ఫన్‌ని కూడా జత కలపడం రీనా ప్రత్యేకత.
క్రీమ్ కలర్ నెటెడ్
శారీ గౌన్‌కు చాకొలెట్ కలర్ పువ్వులు అమరితే పార్టీకి ఓ కొత్త కళ వచ్చేసినట్టే. చీరకట్టుకోవడంలో ఇబ్బందిపడే నేటి అమ్మాయిలకు శారీ గౌన్‌లలో ఎన్నో ఆధునిక మోడళ్లను ఫ్యాషన్‌కు ప్రపంచానికి పరిచయం చేశారు రీనా!
ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్లు ఎంచుకోవడంలో రీనా ఓ ప్రత్యేకత చూపిస్తారు. ఈ మ్యాక్సీ డ్రెస్సులు సౌకర్యవంతంగానే కాదు, మీదైన స్టైల్‌ని నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తాయి. పార్టీ లుక్ అనిపిస్తూనే క్యాజువల్‌గా ఉండే డ్రెస్సులను రూపొందించడంలో రీనా దాకాకు ప్రత్యేకమైన ఆసక్తి. ప్రింటెడ్ మిడ్ స్కర్ట్, లాంగ్ ఎంబ్రాయిడరీ జాకెట్ ఆకర్షణీయమైన కాంబినేషన్‌తో ఆకట్టుకుంటుంది.సిల్వర్ కలర్ నీ లెంగ్త్ వన్ షోల్డర్ డ్రెస్ ఇది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో కాంతిమంతమైన సిల్వర్ స్వీక్వెన్స్‌తో దీనిని రూపొందించారు.