ఓషో శృంగారోపనిషత్ | Osho Sex panisat | Sakshi
Sakshi News home page

ఓషో శృంగారోపనిషత్

Published Fri, Feb 27 2015 11:24 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

ఓషో శృంగారోపనిషత్ - Sakshi

ఓషో శృంగారోపనిషత్

చింతన
 
 ఈ పుస్తకం వెనుక ఓషో మాటలు ఇలా ఉన్నాయి.  ‘‘లైంగిక శక్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి. దేవుడు కూడా దేన్నైనా సృష్టించాలంటే సెక్స్‌ను ఆశ్రయించాల్సిందే. సెక్స్ నుంచే జీవం పుడుతుంది. శిశువు జన్మిస్తుంది. పువ్వులు వికసించినా, కోయిల కుహూ కుహూ రాగాలు పాడినా, నెమలి పురి విప్పి నాట్యం చేసినా అవన్నీ లైంగిక శక్తి సంకేతాలే. ఈ ప్రపంచంలో ఎటు చూసినా మీకు లైంగిక శక్తి ప్రేరణలే కనిపిస్తాయి. కాబట్టి సెక్స్‌ను వ్యతిరేకించకండి. సెక్స్‌ను అందరూ అధిగమించగలరు. దాన్ని దాటి ముందుకెళ్లే దారి ఉంది. తమాషా ఏమిటంటే సెక్స్‌ను సెక్స్ ద్వారానే అతి సులభంగా అధిగమించవచ్చు. సెక్స్‌కు దగ్గరగా ఉండటమంటే దివ్య చైతన్యానికి దగ్గరగా ఉన్నట్టే. మీ ఆధ్యాత్మిక జీవితంలో సెక్స్ ఒక పవిత్రమైన భాగమైపోవాలి. కాబట్టి మీరు పరమానందభరితులై, ఎంతో ఉత్సాహంతో, ప్రార్థనాపూర్వకమైన ప్రేమానుభూతితో ఉన్నప్పుడు మాత్రమే సంభోగించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ హృదయం ఆనందం, శాంతి, కృతజ్ఞతలతో నిండిపోయిందని మీరు భావించినప్పుడు మాత్రమే లైంగికానందాన్ని పొందండని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలా మీరు సెక్స్‌లో పాల్గొన్నప్పుడే ‘దివ్య చైతన్యానుభూతి’ని పొందగలరు’’...

ఓషో (ఆచార్య రజనీష్) వివాదాస్పద పుస్తకం ‘సెక్స్ మేటర్స్- ఫ్రమ్ సెక్స్ టు సూపర్‌కాన్షియస్‌నెస్’ తెలుగులో అనువాదమై వెలువడింది. ఈ వెనుకమాటను బట్టి చదవాలా వద్దా అనేది మీ ఇష్టం.  శృంగారోపనిషత్- ఓషో (అనువాదం: భరత్)
 వెల: రూ.250
 ప్రతులకు: 09440716716
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement