
మాస్క్‌లు మంచివి. ఢిల్లీవాళ్లందరూ ఇదే అనుకుంటున్నారు. ఢిల్లీ మున్సిపల్ బోర్డువాళ్లయితే ఓం మాస్కాయనమః, ఓం పొల్యూషనాయనమః, ఓం గుట్కా సంహరాయ నమః, ఓం థూ.. తిరస్కారాయనమః అని సంతోషంగా గంతులేస్తున్నారు. ‘ఏంటయ్యా ఈ గంతులూ’ అని అనడిగితే ‘కళ్లకు కట్టాల్సిన గంతలు నోటికి కట్టుకుంటే మరి గంతులు వెయ్యమా?’ అని సాంగ్ సింగారంట! అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీలో పొల్యూషన్ లాస్ట్ త్రీ డేస్‌గా రెచ్చిపోయేలా ఉందట. ముక్కు బయటపెడితే బ్లాస్టే.
అందుకే అందరూ బ్లాస్ట్ అవకముందే ప్లాస్టర్ వేస్కొని తిరుగుతున్నారు. ప్లాస్టర్ అంటే.. అదే స్వామీ.. మాస్క్ అన్నమాట. ఈ దెబ్బకి మాస్కేసుకున్నవాళ్లు రోడ్ల మీద ఊయడం మానేశారట. దాంతో డెబ్భై ఐదు శాతం థూ.. థూ..లు తగ్గిపోయాయట! అలవాటులో పొరపాటుగా కొంతమంది తెలియకుండా ఊస్తూనే ఉన్నారట. చెప్పాం కదా. మనుషులు మారకపోతే మాస్కులు మార్చుకోవాలి. ఎందుకంటే థూ అంతా మాస్క్‌లోనే ఉండిపోతుంది కదా. ఓం మాస్కాయనమః, ఓం పొల్యూషనాయనమః ఇదండీ.. ఢిల్లీ పొల్యూషన్ మీద లేటెస్టు సెటైర్.
Comments
Please login to add a commentAdd a comment