శరవేగంగా.. డిజైన్ రంగం | Rapidly .. Design sector | Sakshi
Sakshi News home page

శరవేగంగా.. డిజైన్ రంగం

Published Sun, Apr 13 2014 11:24 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

శరవేగంగా.. డిజైన్ రంగం - Sakshi

శరవేగంగా.. డిజైన్ రంగం

గెస్ట్ కాలమ్
 
నేషనల్ ఇన్‌గెస్ట్ కాలమ్ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ , అహ్మదాబాద్ , డిజైన్ కోర్సులు , ప్రద్యుమ్న వ్యాస్‌ , ఇంటర్వ్యూ
స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ).. డిజైన్ రంగంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా మరో రెండు క్యాంపస్‌లు (గాంధీనగర్, బెంగళూరు) ద్వారా డిజైన్ కోర్సులను అందిస్తూ అంతర్జాతీయంగా.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకున్న ఇన్‌స్టిట్యూట్. నేషనల్ డిజైన్ పాలసీ-2007 ద్వారా ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో మరో నాలుగు క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డెరైక్టర్ ప్రద్యుమ్న వ్యాస్‌తో ఇంటర్వ్యూ..
 
 ఎన్‌ఐడీ విశిష్టత?


 ప్రపంచంలో ప్రముఖ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎన్‌ఐడీ ఒకటి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొంది, డీమ్డ్ యూనివర్సిటీ హోదా సొంతం చేసుకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ. కోర్సులు పూర్తిచేసుకున్నవారందరికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాం.
 
 ఎన్‌ఐడీ క్యాంపస్‌లు.. కోర్సులు?


 ప్రస్తుతం ఎన్‌ఐడీ మూడు క్యాంపస్‌లు (అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు) ద్వారా 18 విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్, దాదాపు 15 స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాం. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మరో నాలుగు సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపడుతున్నాం.
 
 ఎన్‌ఐడీ.. విజయవాడ ఎప్పటిలోగా?


 వాస్తవానికి 2016 అకడెమిక్ సంవత్సరంలో క్లాసులు ప్రారంభించడమే లక్ష్యంగా గత ఏడాది హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశాం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సెంటర్‌ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చింది. నిర్దేశిత గడువు కంటే కొంచెం జాప్యం జరగొచ్చు.
 
 డిజైన్ రంగం భవిష్యత్తు ఎలా ఉండనుంది?


 ఇతర రంగాలతో సమానంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం డిజైనింగ్. ప్రస్తుత అవసరాలు, అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను పరిగణనలోకి తీసుకుంటే మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వచ్చే ఐదారేళ్లలో 15 వేల నుంచి 20 వేల వరకు డిజైన్ నిపుణుల అవసరం ఉంది.  దీని కారణంగానే మరో నాలుగు క్యాంపస్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
 
 ఎన్‌ఐడీ బోధన ప్రత్యేకతలు?


  ఎన్‌ఐడీలో మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో శిక్షణ ఉంటుంది. ఫలితంగా ఒక విద్యార్థికి తాను ఎంచుకున్న మేజర్ సబ్జెక్ట్‌తోపాటు ఇతర విభాగాల్లోనూ అవగాహన లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవడంలో ముందుంటారు. అంతేకాకుండా పరిశోధనకు పెద్దపీట వేస్తున్నాం. ఇందుకుగాను బెంగళూరు సెంటర్‌లో ఆర్ అండ్ డీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం.
 
 ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం?


 విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడేలా ప్రాక్టికల్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే కరిక్యులమ్‌లో భాగంగా ఆరు నుంచి ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మూడో సంవత్సరంలో, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు రెండో సంవత్సరంలో ఈ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలి.
 
 
 ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా?


 అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్థాయి నుంచే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికోసం యూకే, అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని 50కి పైగా యూనివర్సిటీలతో ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల అర్హులైన విద్యార్థులు తమ కోర్సు వ్యవధిలో ఆరు నెలలపాటు నిర్దేశిత విదేశీ యూనివర్సిటీలో చదివేందుకు అవకాశం లభిస్తుంది.
 
 ప్లేస్‌మెంట్ రికార్డ్?


 ప్లేస్‌మెంట్ విషయంలో ఎన్‌ఐడీ వంద శాతం రికార్డ్ సాధిస్తోంది. భారత్‌లోని సంస్థలతోపాటు విదేశీ సంస్థలు కూడా ఎన్‌ఐడీలో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. అత్యధికంగా ఏడాదికి రూ. 30 లక్షల వేతనం లభించింది.
 
 ఎన్‌ఐడీ ప్రవేశ షెడ్యూల్ ఎలా ఉంటుంది?


 ఎన్‌ఐడీలో ప్రవేశం పొందాలంటే నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
 
 డిజైన్ ఔత్సాహికులకు మీ సలహా?


 ముందుగా డిజైనింగ్ అంటే కేవలం ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్ అనే అపోహ వీడాలి. డిజైన్ రంగం ఇప్పుడు సామాజిక అభివృద్ధికి దోహదం చేసే అన్ని విభాగాలకు విస్తరించింది. దీన్ని గుర్తిస్తే అనేక అవకాశాలు సొంతం చేసుకునే దిశగా తొలి అడుగు వేసినట్లే. ఇక.. ఔత్సాహిక అభ్యర్థులకు అకడెమిక్ అర్హతలతోపాటు.. ఆశావహ దృక్పథం, నిజాయతీ, నిబద్ధత ఉంటే భవిష్యత్తు మరింత సమున్నతంగా ఉంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement