National Institute of Design
-
మోడీ సర్కార్ తొలి చట్టం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్లు ఆమోదం న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) సంస్థ జాతీయ ప్రాముఖ్యం గల సంస్థగా రూపుదాల్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు బుధవారం పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీనితో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తొలి చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినట్టయింది. గత సోమవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. బిల్లు ఆమోదంతో, వివిధ కోర్సులలో విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసేందుకు ఎన్‌ఐడీకి అధికారం లభించింది. దీంతో ఎన్ఐడీ జాతీయ స్థాయి సంస్థగా రూపుదాల్చుతుందని, విద్యార్థులకు పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలను అందిస్తుందని కేంద్రవాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎన్ఐడి: నర్సయ్య గౌడ్ అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొంటూ, ఎన్ఐడీని హైదరాబాద్‌లో కూడా నెలకొల్పాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. హైదరాబాద్‌కు మంజూరైన ఎన్ఐడీని విజయవాడకు తరలిస్తున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిందన్నారు. విజయవాడకు ఎన్ఐడీని తరలించినప్పటికీ.. హైదరాబాద్‌లో కూడా మరో ఎన్ఐడీని ఏర్పాటుచేయాలని కోరారు. -
ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా!
ఎడ్యూ న్యూస్: అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)కు అరుదైన హోదా దక్కనుంది. ఈ సంస్థకు జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ప్రభుత్వం గతేడాది సభలో ప్రవేశపెట్టింది. తాజాగా దీనికి ఆమోదముద్ర లభించింది. దీనిప్రకారం.. ఎన్ఐడీ డిజైనింగ్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో శిక్షణ, పరిశోధనలు నిర్వహించవచ్చు. ఈ రంగంలో డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లను, అవార్డులను ప్రదానం చేయొచ్చు. అంతేకాకుండా స్పాన్సర్డ్, ఫండెడ్ రీసెర్చ్‌ను, కన్సల్టెన్సీ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం-1860, బాంబే పబ్లిక్ ట్రస్టు చట్టం-1950 ప్రకారం ఎన్ఐడీ 1961లో ఏర్పాటైంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ. ఎన్ఐడీ.. డిజైన్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్, పోస్టు-గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. తాజాగా లభించే హోదా ద్వారా ఎన్ఐడీ ఇకపై నాణ్యమైన డిజైనింగ్ విద్యను అందించే అవకాశం ఉంటుందని, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీజీతోపాటు ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలను కూడా ప్రదానం చేస్తుందని వెల్లడించారు. ఎన్ఐడీ కోర్సులు: ప్రస్తుతం ఎన్ఐడీ మూడు క్యాంపస్‌లు (అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు) ద్వారా బ్యాచిలర్ స్థాయిలో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో కోర్సులు అందిస్తోంది. అవి.. యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; ఎగ్జిబిషన్ డిజైన్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్. కోర్సుల వ్యవధి: నాలుగేళ్లు అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో.. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో పలు స్పెషలైజేషన్లలో డిజైన్ కోర్సులను అందిస్తోంది. అవి.. యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; అపరెల్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్స్పీరియన్స్; డిజైన్ ఫర్ రిటైల్ ఎక్స్పీరియన్స్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ఫేజ్ డిజైన్; లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్; న్యూ మీడియా డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్మెంట్; టెక్స్టైల్ డిజైన్; టాయ్ అండ్ గేమ్ డిజైన్; ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటోమొబైల్ డిజైన్. ఈ కోర్సుల కాల వ్యవధి : రెండున్నర సంవత్సరాలు. అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ స్థాయి కోర్సులో ఉత్తీర్ణత ఎన్ఐడీలో ప్రవేశ ప్రక్రియ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఎంట్రెన్స్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పీజీ కోర్సు చేయాలనుకునే ఔత్సాహికులు ఎన్ఐడీ నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిర్వహించే ప్రవేశ పరీక్ష (నిఫ్ట్ పీజీ ఎంట్రెన్స్) ద్వారా కూడా ఎన్ఐడీలో ప్రవేశం పొందొచ్చు. ఎన్ఐడీ వెబ్సైట్: http://www.nid.edu/ -
శరవేగంగా.. డిజైన్ రంగం
గెస్ట్ కాలమ్ నేషనల్ ఇన్గెస్ట్ కాలమ్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ , అహ్మదాబాద్ , డిజైన్ కోర్సులు , ప్రద్యుమ్న వ్యాస్ , ఇంటర్వ్యూ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ).. డిజైన్ రంగంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా మరో రెండు క్యాంపస్‌లు (గాంధీనగర్, బెంగళూరు) ద్వారా డిజైన్ కోర్సులను అందిస్తూ అంతర్జాతీయంగా.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకున్న ఇన్స్టిట్యూట్. నేషనల్ డిజైన్ పాలసీ-2007 ద్వారా ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో మరో నాలుగు క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డెరైక్టర్ ప్రద్యుమ్న వ్యాస్‌తో ఇంటర్వ్యూ.. ఎన్ఐడీ విశిష్టత? ప్రపంచంలో ప్రముఖ డిజైన్ ఇన్స్టిట్యూట్లలో ఎన్ఐడీ ఒకటి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొంది, డీమ్డ్ యూనివర్సిటీ హోదా సొంతం చేసుకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ. కోర్సులు పూర్తిచేసుకున్నవారందరికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాం. ఎన్ఐడీ క్యాంపస్‌లు.. కోర్సులు? ప్రస్తుతం ఎన్ఐడీ మూడు క్యాంపస్‌లు (అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు) ద్వారా 18 విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్, దాదాపు 15 స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాం. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మరో నాలుగు సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపడుతున్నాం. ఎన్ఐడీ.. విజయవాడ ఎప్పటిలోగా? వాస్తవానికి 2016 అకడెమిక్ సంవత్సరంలో క్లాసులు ప్రారంభించడమే లక్ష్యంగా గత ఏడాది హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశాం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సెంటర్‌ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చింది. నిర్దేశిత గడువు కంటే కొంచెం జాప్యం జరగొచ్చు. డిజైన్ రంగం భవిష్యత్తు ఎలా ఉండనుంది? ఇతర రంగాలతో సమానంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం డిజైనింగ్. ప్రస్తుత అవసరాలు, అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్లను పరిగణనలోకి తీసుకుంటే మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వచ్చే ఐదారేళ్లలో 15 వేల నుంచి 20 వేల వరకు డిజైన్ నిపుణుల అవసరం ఉంది. దీని కారణంగానే మరో నాలుగు క్యాంపస్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్ఐడీ బోధన ప్రత్యేకతలు? ఎన్ఐడీలో మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో శిక్షణ ఉంటుంది. ఫలితంగా ఒక విద్యార్థికి తాను ఎంచుకున్న మేజర్ సబ్జెక్ట్‌తోపాటు ఇతర విభాగాల్లోనూ అవగాహన లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవడంలో ముందుంటారు. అంతేకాకుండా పరిశోధనకు పెద్దపీట వేస్తున్నాం. ఇందుకుగాను బెంగళూరు సెంటర్లో ఆర్ అండ్ డీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం? విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడేలా ప్రాక్టికల్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే కరిక్యులమ్‌లో భాగంగా ఆరు నుంచి ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మూడో సంవత్సరంలో, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు రెండో సంవత్సరంలో ఈ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలి. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్థాయి నుంచే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికోసం యూకే, అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని 50కి పైగా యూనివర్సిటీలతో ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల అర్హులైన విద్యార్థులు తమ కోర్సు వ్యవధిలో ఆరు నెలలపాటు నిర్దేశిత విదేశీ యూనివర్సిటీలో చదివేందుకు అవకాశం లభిస్తుంది. ప్లేస్మెంట్ రికార్డ్? ప్లేస్మెంట్ విషయంలో ఎన్ఐడీ వంద శాతం రికార్డ్ సాధిస్తోంది. భారత్‌లోని సంస్థలతోపాటు విదేశీ సంస్థలు కూడా ఎన్ఐడీలో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. అత్యధికంగా ఏడాదికి రూ. 30 లక్షల వేతనం లభించింది. ఎన్ఐడీ ప్రవేశ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎన్ఐడీలో ప్రవేశం పొందాలంటే నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. డిజైన్ ఔత్సాహికులకు మీ సలహా? ముందుగా డిజైనింగ్ అంటే కేవలం ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైనింగ్ అనే అపోహ వీడాలి. డిజైన్ రంగం ఇప్పుడు సామాజిక అభివృద్ధికి దోహదం చేసే అన్ని విభాగాలకు విస్తరించింది. దీన్ని గుర్తిస్తే అనేక అవకాశాలు సొంతం చేసుకునే దిశగా తొలి అడుగు వేసినట్లే. ఇక.. ఔత్సాహిక అభ్యర్థులకు అకడెమిక్ అర్హతలతోపాటు.. ఆశావహ దృక్పథం, నిజాయతీ, నిబద్ధత ఉంటే భవిష్యత్తు మరింత సమున్నతంగా ఉంటుంది. -
విజయవాడకు ఎన్ఐడీ
జిల్లాకు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మంజూరు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ దేశంలో కేటాయించిన నాలుగు ప్రాంతాల్లో బెజవాడ ఒకటి సాక్షి, విజయవాడ : విజయవాడ నగరానికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది. విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో దేశంలో నాలుగుచోట్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైన్ (ఎన్ఐడీ)లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. విజయవాడతో పాటు భోపాల్, అస్సాంలోని జోర్హాట్, హర్యానాలోని కురుక్షేత్రలో రూ.434 కోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థలలో గ్రాడ్యుయేషన్‌తో పాటు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉంటాయి. సేవా రంగంతో పాటు ప్రపంచ స్థాయి డిజైన్లను తయారు చేసేందుకు ఈ ఎన్ఐడీలు ఉపయోగపడతాయి. డిజైన్ ఎడ్యుకేషన్, రీసెర్చి విభాగాల్లో ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ అమెరికాకు చెందిన బిజినెస్ వీక్ పత్రిక ఎన్ఐడీని యూరోప్‌తో పాటు ఆసియాలోని టాప్ 25 స్థానాల్లో ఒకటిగా ప్రకటించింది. కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందిన పారిశ్రామిక విధానం, పురోగతి విభాగం ఆధ్వరంలో ఆటానమస్ బాడీగా ఈ సంస్థ నడుస్తుంది