ఆధునిక వైద్యంతో అదుపులో ఆస్తమా! | sakshi health councling | Sakshi
Sakshi News home page

ఆధునిక వైద్యంతో అదుపులో ఆస్తమా!

Published Mon, Jan 16 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

sakshi    health councling

ఆస్తమా కౌన్సెలింగ్‌

మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. డాక్టర్లు వాడికి ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ చేసి మందులు ఇస్తున్నారు. ఆస్తమా అటాక్‌ అంటే ఏమిటి? ఎలాంటి చికిత్స అవసరం? – సుభాష్, రామగుండం
చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే మీలాంటి ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉండే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్‌ లేదా ఆస్తమా ఎపిసోడ్‌ అంటున్నారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్‌ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు.

►వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది n శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది n వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది

►వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్‌ జరుగుతుంది. ఈ అటాక్‌ ప్రారంభంలో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్‌ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్‌ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్‌ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

అత్యవసర ఆధునిక వైద్యసేవలే ప్రాణాలు కాపాడతాయి
ఆస్తమా చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో నష్టపోవాల్సి వస్తుంది. పిల్లలు తరచూ స్కూలుకు వెళ్లలేరు. తగినంతగా పనిచేయలేక, శ్రద్ధ చూపలేక, పెద్దవాళ్లు వృత్తి ఉద్యోగాలలో వెనకబడిపోవాల్సి వస్తుంది. శరీరం బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తిగత అభిరుచులు, ఆనందాలకు దూరం కావాల్సి వస్తోంది. ఆస్తమా అటాక్‌ వచ్చి పరిస్థితి విషమించిన సమయంలో అత్యవసర వైద్యసేవలు, నిపుణులైన డాక్టర్‌ సహాయం అత్యవసరం. మొదట కృత్రిమంగా శ్వాస అందించే ఏర్పాటు చేసి, మందుల ద్వారా వాయునాళాలు తెరిచి సహజంగా ఊపిరి తీసుకునేట్లు చేస్తారు. ఆపైన ఆస్తమా మరీ తీవ్రంగా రావడానికి కారణమైన అంశాలను గుర్తించి వాటి నుంచి కాపాడుకునేందుకు, మరోసారి ఆస్టమా అటాక్‌ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. అలవాట్లలో మార్పులు సూచిస్తారు. ఇలా ఆస్తమాను అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది.

డాక్టర్‌ పి.నవనీత్‌ సాగర్‌ రెడ్డి  సీనియర్‌ పల్మునాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

అర్టికేరియాతో చర్మంపై దద్దుర్లు...!
హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 24 ఏళ్లు. నాకు అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా? – చంద్రశేఖర్, కర్నూల్‌
అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి...
అక్యూట్‌ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్‌ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది.

క్రానిక్‌ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్‌ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్‌ వంటి వాటి వల్ల అర్టికేరియా కనిపించవచ్చు.

కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్‌ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది.
అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: n నొప్పి నివారణకు ఉపయోగించే మందులు n కీటకాలు, పరాన్నజీవులు n ఇన్ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు, n అధిక ఒత్తిడి, సూర్యకాంతి n మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు n అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు n జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు: n చర్మంపై ఎరుపు లేదా డార్క్‌ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం n విపరీతమైన దురదగా అనిపించడం n దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం n కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు n గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు n దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు.

చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌ సీఎండ్‌డి
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement