
ఒకసారి ఒక సినిమాకు మాటలు రాయడానికి చెన్నై వెళ్లి తిరిగి విశాఖ వస్తున్నారు రావిశాస్త్రి. ‘‘గురువు గారూ, సినిమా ప్రపంచం ఎలా వుంది?’’ అని ఒకతను పలకరించాడు.
రావిశాస్త్రి నవ్వి ఇలా జవాబిచ్చారట: ‘‘సినిమా వాళ్లతో చాలా సుఖం. మన గదికి మనని అద్దె చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పనిలేదు, వాళ్లే కొనిస్తారు. మన మందు, మన తిండి మనం కొనక్కర్లేదు, వాళ్లే ఏర్పాటు చేస్తారు. మన డైలాగులు మనల్ని రాయనివ్వరు, వాళ్లే రాసుకుంటారు.’’