కత్రినా కైఫ్‌కు అవకాశం ఇవ్వని సల్మాన్‌ | Salman not intrested to act with katrina kaif | Sakshi
Sakshi News home page

కత్రినా కైఫ్‌కు అవకాశం ఇవ్వని సల్మాన్‌

Published Sun, Jul 3 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

కత్రినా కైఫ్‌కు అవకాశం ఇవ్వని సల్మాన్‌

కత్రినా కైఫ్‌కు అవకాశం ఇవ్వని సల్మాన్‌

అయ్యో పాపం...!
గాసిప్


మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్ తాజా సినిమాలో కత్రినా కైఫ్‌కు అవకాశం ఇవ్వలేదని ముంబై మీడియా వర్గాల సమాచారం. సల్మాన్‌తో ‘ఏక్ థా టైగర్’, ‘భజరంగీ భాయ్‌జాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు కబీర్ ఖాన్. ఇప్పటివరకూ ఈ దర్శకుడు తీసిన ఐదు సినిమాల్లో కత్రినా మూడింటిలో కథానాయికగా నటించారు. మూడూ హిట్టే. అందులో సల్మాన్ ‘ఏక్ థా టైగర్’ ఒకటి. ఇప్పుడు ‘ట్యూబ్‌లైట్’ అనే సినిమాతో సల్మాన్, కబీర్ ఖాన్‌లు హ్యాట్రిక్ మీద గురిపెట్టారు.


ఈ సినిమాలో నటించాలని కత్రినా చాలా ఆశపడ్డారట. దర్శకుడితో మంచి స్నేహం ఉండటంతో ఆ దిశగా కత్రినా ప్రయత్నాలు చేశారట. కానీ, సల్మాన్ మాజీ ప్రేయసితో నటించడానికి సుముఖత వ్యక్తం చేయలేదని భోగట్టా. స్వయంగా సల్మాన్ వద్దని చెప్పడంతో కత్రినాకు నిరాశ తప్పలేదని బాలీవుడ్ గుసగుసల సారాంశం. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడిన తర్వాత కూడా సల్మాన్, కత్రినాల మధ్య స్నేహం కొనసాగింది. ప్రస్తుతం ఏమైందో ఏమో అటు రణ్‌బీర్‌తో బ్రేకప్ అయ్యింది.. ఇటు స్నేహితుడు, మాజీ ప్రియుడు సల్మాన్ దూరం పెడు తున్నాడు. పాపం.. కత్రినా!!
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement