జంటగా వెళ్లి.. ఒంటరిగా..?
జంటగా వెళ్లి.. ఒంటరిగా..?
Published Wed, Jan 8 2014 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సల్మాన్‌ఖాన్‌ని ఓ స్థాయిలో ప్రేమించి, ఆ తర్వాత ఆ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు కత్రినా కైఫ్. అనంతరం కొన్నాళ్లు సోలోగానే జీవితాన్ని కానిచ్చేశారు. కానీ, త్వరగానే ఆ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పేసి, రణబీర్‌కపూర్‌తో ప్రేమలో పడ్డారామె. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారట. ఇద్దరూ జంటగా నటించినప్పుడు ఫర్వాలేదు కానీ, విడివిడిగా సినిమాలు చేసినప్పుడు మాత్రం వీళ్లు మాట్లాడే ఫోన్‌కాల్స్‌కి బారెడు బిల్లు అవుతోందని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఇద్దరూ యూఎస్ వెళ్లారు. రణబీర్‌తో జంటగా వెళ్లిన కత్రినా ఈ హాలిడేని ఎంజాయ్ చేసిన తర్వాత ఒంటరిగా లండన్‌లో ఉండిపోయారు.
కాబట్టి, విహార యాత్రలో ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందనే కథలు అల్లుతున్నారు గాసిప్పురాయుళ్లు. కానీ, అసలు విషయం అది కాదు. యూఎస్‌లో వాతావరణం చాలా చల్లగా ఉన్నందున కత్రినా తట్టుకోలేకపోయారట. దాంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ఈ కారణంగానే ఆమె లండన్‌లో ఉండిపోయారు. అక్కడ కత్రినా తల్లి, ఆమె ఆరుగురు సోదరీమణులు ఉంటారు. వాళ్ల సమక్షంలో తగినంత విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో ముంబయ్ వచ్చేస్తారట ఈ బ్యూటీ. వచ్చీ రాగానే ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. అలాగే తన ప్రియుడు రణబీర్‌కపూర్ సరసన కత్రినా నటించనున్న ‘జగ్గా జాసూస్’ చిత్రం కూడా త్వరలో ఆరంభం కానుంది.
Advertisement
Advertisement