
కంగనా రనౌత్‌కి ఈ ఏడాది అసలేం బాగోలేదు. రంగూ , సిమ్రాన్.. రెండూ పెద్దగా ఆడలేదు. పోతే పొయినయ్. కానీ ఆ పిల్ల యాటిట్యూడ్ వల్లే ఆ రెండు సినిమాల డైరెక్టర్లు సరిగా తియ్యలేకపోయారని బాలీవుడ్ టాబ్లాయిడ్స్ దుమ్మెత్తిపోశాయి. హృతిక్ రోషన్, కరణ్ జోహార్ ఇద్దరూ దగ్గరుండి తనపై ఇలా బురద చల్లించారని కంగనా అంటోంది. రెండు రోజుల క్రితమే ఆమె ‘ముంబై మిర్రర్’తో ఈ విషయాల్ని షేర్ చేసుకుంది. తనకు పొగరని వస్తున్న రూమర్స్ వల్ల సినిమా అవకాశాలేమీ తగ్గలేదు కానీ, కమర్షియల్‌గా తీసేవాళ్లు ధైర్యం చెయ్యలేకపోతున్నారట. ప్రధానంగా మూడు వివాదాల్లో ఈ సంవత్సరం కంగన పేరు వినిపించింది. ‘కంగనా చెబుతున్నట్లుగా ఆమెకు, నాకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. ఆమె ఓ బ్యాడ్ గర్ల్’ అని హృతిక్ రోషన్ టముకు వేసుకుంటూ అడిగినవాళ్లకు, అడగనివాళ్లకు చెప్పుకుంటూ తిరిగాడు.
ఇక రెండో వివాదం కంగనా తనకై తను మెడలో వేసుకున్నది. కరణ్ జోహార్ స్టార్‌ల కిడ్‌లకు మాత్రమే అవకాశాలిస్తున్నాడని, టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కిపడేస్తున్నాడని ఆమె బాహాటంగానే విమర్శించారు. దాంతో ఇండస్ట్రీలో ఆమె శత్రువుల సంఖ్య మరింత పెరిగింది. మూడో వివాదం.. ‘సిమ్రాన్’ సినిమా స్క్రీన్ రైటింగ్ వేరే ఎవరిదో అయితే ఆమె క్రెడిట్ తీసుకున్నారన్న విమర్శ. అయితే ఎన్ని కాంట్రావర్సీలు ఉన్నా కంగనా ధైర్యం చెక్కుచెదర్లేదు. ‘‘సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదే నాకు పెద్ద రెమ్యూనరేషన్’’ అంటోంది కంగనా. హృతిక్ అన్నట్లు బ్యాడ్ గర్ల్ అయితే అయింది కానీ, బ్రేవ్ గర్ల్ బాస్.
Comments
Please login to add a commentAdd a comment