‘నారే’ నీరు పోస్తోంది! | Self-employement with Coconut fiber | Sakshi
Sakshi News home page

‘నారే’ నీరు పోస్తోంది!

Published Tue, May 27 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

‘నారే’ నీరు పోస్తోంది!

‘నారే’ నీరు పోస్తోంది!

 ఇక్కడ కొబ్బరినారతో తాళ్ళు నేస్తున్న అమ్మాయిపేరు షిజి. చిన్నతనంలో పెళ్లయిన షిజి భర్తకు సాయంగా ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించాలనుకుంది.  కొబ్బరిపీచుతో తాళ్లను నేయడం నేర్చుకుని ఇంటి దగ్గరే పని మొదలుపెట్టింది. రోజుకి 75 తాళ్లను నేస్తున్న షిజి సంపాదన రోజుకి 250 వరకూ ఉంటోంది. రోజుకూలీగా పనిచేస్తున్న భర్తకు సమానంగా డబ్బు సంపాదిస్తున్న షిజి లాంటివారు కేరళలో చాలామంది ఉన్నారు.
 
 అలప్పుళా  జిల్లాలోని నెడుమ్ పరక్కాడ్ గ్రామానికి చెందిన షిజి తనలాంటివారితో చేయి కలిపి ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో తాళ్లను తయారుచేసే యంత్రాన్ని కొన్నారు. వీరు నేసిన సన్నతాళ్లకు రంగులేసి ఆ యంత్రం సాయంతో పెద్దసైజు తాళ్లను తయారుచేసి మార్కెట్‌కి పంపుతున్నారు. స్వయం ఉపాధితో తమ కాళ్ళమీద తాము నిలబడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement