అప్పట్లో భారతి పత్రికలో రచనలు అచ్చవడం కవులకు రచయితలకు గీటురాయిగా వుండేది. అటువంటిదే తెలికచర్ల వెంకటరత్నం సంపాదకత్వంలో వెలువడిన ప్రతిభ మాసపత్రిక కూడా. పొందికగా వస్తున్న ప్రతిభలో తన పేరు చూసుకోవాలని మధునాపంతులకు కోరికగా వుండేది. అయితే ముందు చందాదారునిగా చేరదాం, తరవాత రచనలు పంపిద్దాం అనుకున్నారో ఏమో, పత్రికకు చందా కట్టారు. మరుసటి నెల సంచికలో చందాదారుల జాబితాలో ‘మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి’ పేరు ముద్రించారు. అది చూసిన ఆంధ్రి సహ సంపాదకుడు, విద్వాన్ పాలెపు వెంకటరత్నం ఆయనతో వున్న చనువుతో ‘‘మొత్తానికి ప్రతిభా’వంతుడవయ్యావు’’ అని చమత్కరించారు. అందరినీ చమత్కరించే మధునాపంతుల తన మీది చమత్కారానికి ముసిముసిగా నవ్వుకున్నారు.
సేకరణ: శిఖామణి
Comments
Please login to add a commentAdd a comment