వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే... | Silver objects | Sakshi
Sakshi News home page

వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే...

Published Wed, Nov 4 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే...

వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే...

 ఇంటిప్స్
 
లీటర్ నీటిలో బేకింగ్ సోడా కలిపి బాగా మరిగించాలి. మరొకపాత్ర అడుగున అల్యూమినియమ్ ఫాయిల్ (మార్కెట్లో దొరుకుతుంది) వేసి, పైన వేడి నీరు పోయాలి. అందులో వెండి వస్తువులను నెమ్మదిగా వేయాలి. కాసేపు అలాగే ఉంచి, బయటకు తీయాలి. మురికి అంతా పోతుంది.

పావుకప్పు బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వెండిసామానుకు రాసి, మెత్తని కాటన్ క్లాత్‌తో తుడవాలి.
మరిగించిన నీటిలో ఉప్పు, బేకింగ్ సొడా వేసి కలపాలి. అలాగే దీంట్లో కొద్దిగా వెనిగర్‌ను కలపకుండా నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత వెండి ఆభరణాలు ఆ నీటిలో మెల్లగా వేయాలి. కాసేపు ఉంచి, వాటిని బయటకు తీసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి.వెండి ఆభరణాలకు ఉన్న స్టోన్స్‌కి టొమాటో కెచప్‌ను అద్దుతూ, రుద్దితే అవి త్వరగా పాడవవు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement