బ్రిటన్‌లో సగటున ఒక జంట తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్న వ్యవధి... రెండు సంవత్సరాలా తొమ్మిది నెలలు అని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఈ సమయం పూర్తయ్యే సరికల్లా వారు కొత్త వ్యక్తి వేటలో పడుతున్నారట. అయితే ఇది భార్యాభర్తల గురించి కాదు. సహజీవనం లేదా డేటింగ్ సంస్కృతిలో ఉన్నవారి గురించి మాత్రమే. ఈ పరిస్థితికి కారణం సోషల్ మీడియానే అంటున్నారు పరిశోధకులు.
సోషల్ నెట్‌వర్కింగ్‌సైట్లలో అయ్యే పరిచయాలు యువతీ యువకులను కొత్తవారి పట్ల త్వరగా ఆకర్షితుల్ని చేస్తున్నాయని, దాంతో వారు అప్పటివరకూ ఉన్న బంధాలను తెంచేసుకుని మరీ కొత్త బంధాల కోసం పాకులాడుతున్నారని అధ్యయనకర్తలు చెబుతున్నారు. విడాకుల అవసరం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణమంటున్నారు. అసలే సహజీవనం సగం సమాజాన్ని నాశనం చేస్తోందనుకుంటుంటే, చివరికి ఆ బంధాల్ని కూడా సోషల్ మీడియా సర్వనాశనం చేస్తోందంటూ సంప్రదాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!
సోషల్ మీడియాతో బంధాలకు ముప్పే!
Published Fri, Feb 7 2014 12:14 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement