ఆయనతో అలా అలా... అలలతో సరదాగా! | Sonakshi Sinha with her Ex-Boyfriend Bunty | Sakshi
Sakshi News home page

ఆయనతో అలా అలా... అలలతో సరదాగా!

Published Mon, Sep 12 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

ఆయనతో అలా అలా... అలలతో సరదాగా!

ఆయనతో అలా అలా... అలలతో సరదాగా!

గాసిప్
సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అదే పక్కన లవర్ ఉంటే ఇక ప్రపంచం మొత్తం పసందుగా అనిపిస్తుంది. ప్రస్తుతం సోనాక్షీ సిన్హాకు అలానే అనిపిస్తోందట. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ మూవీ ‘అఖీరా’కి సోనాక్షి చాలానే కష్టపడ్డారు. పవర్‌ఫుల్ ఫైట్స్ చేసి అలసిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు. నెక్ట్స్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. సోనాక్షీకి బీచ్‌లంటే చాలా ఇష్టం.

స్వదేశీ బీచ్‌లకు వెళితే జనాలు చుట్టుముట్టేస్తారు కదా. అందుకే విదేశీ బీచ్‌కి వెళ్లాలనుకున్నారు. వెళ్లిపోయారు కూడా. సోలోగా కాదు.. ప్రియుడు బంటీ సజ్‌దేతో కలసి వెళ్లారని సమాచారం. ఈ బంటీ ఎవరో కాదు.. సోనాక్షీతో పాటు మరికొంతమంది ప్రముఖ తారలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కి బంధువు కూడా. గత కొంత కాలంగా సోనాక్షీ, బంటీ ప్రేమాయణం సాగిస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. అదేం లేదని సోనాక్షీ కొట్టి పారేస్తున్నప్పటికీ ‘అదేం కాదు.. ఏదో ఉంది’ అని కొంతమంది అంటున్నారు. నిజమే కదా.. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుందబ్బా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement