మా మధ్య ఏమీ లేదు!
‘‘ఇలాంటి గాలి వార్తలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. పని గట్టుకుని మరీ మా గురించి ప్రచారం చేస్తున్నారు’’ అని సోనాక్షీ సిన్హా అంటున్నారు. ఆమె అలా అనడానికి కారణం లేకపోలేదు. హీరో సోనాక్షి, అర్జున్ కపూర్‌ల ప్రేమ ప్రయాణం కొంతకాలంగా జోరుగా సాగుతోందని గాసిప్‌రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. దీని గురించి సోనాక్షి మాట్లాడుతూ -‘‘అర్జున్‌కీ, నాకూ మధ్య ఏమీ లేదు.
మేమిద్దరం కలిసి సినిమా చేస్తే, ప్రేమలో ఉన్నట్లేనా? కలిసి సినిమా చూస్తే.. ప్రేమించుకుంటున్నట్టేనా? ఏం... సరదాగా ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లకూడదా? మా గురించి వస్తున్న వార్తలు వినీ వినీ విసిగిపోయా. ఇకనైనా మా గురించి మాట్లాడటం మానేస్తే మంచిది. ఒకవేళ మాట్లాడారనుకోండి... నేను లెక్క చేయను. అర్జున్ గురించీ, నా గురించీ వస్తున్న వార్తలకు ఇకపై స్పందించను కూడా’’ అన్నారు.