దాంపత్యం ఓకే... బంగారం! | Sources okay ... gold | Sakshi
Sakshi News home page

దాంపత్యం ఓకే... బంగారం!

Published Tue, Apr 7 2015 10:49 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

దాంపత్యం  ఓకే... బంగారం! - Sakshi

దాంపత్యం ఓకే... బంగారం!

దాంపత్యం గురించి చెప్పుకోవాలంటే అజయ్ దేవగణ్, కాజోల్ జంట గురించే చెప్పుకోవాలి అంటుంటారు చాలామంది. వాళ్లిద్దర్ని చిలకాగోరింకలు అని కూడా పొగుడుతుంటారు. బయటి వాళ్ల పొగడ్తల సంగతి సరే, అజయ్‌ను కాజల్ గురించి అడిగి చూడండి... నాన్‌స్టాప్ పొగడ్తలు... కాజల్‌ను అజయ్ గురించి అడిగి చూడండి... సేమ్ టు సేమ్. అప్పుడెప్పుడో మానసిక విశ్లేషకులు ఒక మాట చెప్పారు -

‘కలహాల కాపురానికి చెక్ పెట్టడానికి... పొగడ్తలను మించిన గొప్ప ప్రత్యామ్నాయం ఏదీ లేదు’ అని. ఈ సూత్రం అజయ్-కాజల్ దాంపత్యానికి బానే వర్క్‌వుట్ అయింది. ఇది మాత్రమే కాదు... ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకోవడంలో ఇద్దరూ ముందుంటారు. ఒకరి అభిరుచిని మరొకరి మీద బలవంతంగా రుద్దుకోరు. పిల్లల కంపెనీని ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తారు.
 ‘నేను భర్తను కాబట్టి నా మాట వినాలి’ ‘నేను భార్యను కాబట్టి నా మాట వినాలి’ అనే వైఖరి వారిలో ఎప్పుడూ కనిపించదు. ఒకరి ఇష్టాలను మరొకరు... ‘ఓకే... బంగారం’ అంటూ గౌరవించుకోవడమే వారి ఆదర్శ దాంపత్యానికి సక్సెస్ మంత్ర కావచ్చు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement