టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌ | Special Story About Tiktok Stars Of India In Family | Sakshi
Sakshi News home page

టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌

Published Wed, Jul 1 2020 5:32 AM | Last Updated on Wed, Jul 1 2020 5:32 AM

Special Story About Tiktok Stars Of India In Family - Sakshi

ఇండో–చైనా టాక్స్‌ నడుస్తూనే ఉన్నాయి. చైనా టిక్‌ టాక్‌ ఇండియాలో బ్యాన్‌ అయింది! ఆ టాక్స్‌ ఫలవంతం అయినా.. ఈ టాక్‌ మళ్లీ మొదలౌతుందని చెప్పలేం. దేవుడా.. ఎలా జీవించడం? ఎవరి కోసం దయాన్నే లేవడం? ఏ ఆశతో ఫోన్‌ని చేతిలో ఉంచుకోవడం? అంత డీప్‌ వైరాగ్యం అక్కర్లేదు. మన టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌.. వేరే నెంబరు ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చేస్తారు. ఎప్పట్లా బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదించేస్తారు. ఫన్నీగా.. స్టన్నింగ్‌గా.. తీన్‌ తిగాడాగా..!
టీవీలున్నాయి. సినిమాలున్నాయి. వెబ్‌ సీరీస్‌ ఉన్నాయి. ఎన్నున్నా టిక్‌ టాక్‌ తీరే వేరు. ‘ఒరిజినల్‌’ కంటెంట్‌ ఉంటుంది అందులో. టిక్‌ టాకర్‌ల స్వీయ దర్శకత్వంలోని సహజమైన ప్రతిభా ప్రావీణ్యాలు ఒకసారి చూసినంతనే చాలనిపించవు. మళ్లీ మళ్లీ చూస్తాం. నవ్వుకుంటాం. ఆశ్చర్యపోతాం. ఆలోచిస్తాం. అనుకరిస్తాం. ఆహ్లాదపడతాం. పాటలు ఉంటాయి. పాఠాలు ఉంటాయి. డ్యాన్స్‌లు ఉంటాయి. కళ్లు తెరిపించే ప్రసంగాలు ఉంటాయి. అందం చందం ఉంటుంది. అనుకరణ ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు పనికొచ్చే ప్రతి ఒక్కటీ ఉంటుంది. టిక్‌ టాకర్‌లలో కనిపించే  కాన్ఫిడెన్స్‌ మన లోపలికి ప్రవహిస్తుంది. యూత్‌ జీవితేచ్ఛకు, విసుగుల్లో ఉండి, విరామాల కోసం చూస్తుండే పెద్దలకు రెండు నిముషాల ఆయుషు టిక్‌ టాక్‌. వినోదం ఒక్కటే కాదు, విజ్ఞానం కూడా. ఆ విజ్ఞానం కూడా వినోదం రూపంలోనే లభ్యమౌతుంది. ఇంత తేలిగ్గా నవ్వించి, కవ్వించి, చెప్పాలనుకున్న దాన్ని ఒంట పట్టించే టీచర్‌లు ఏ లోకానా ఉండరు. ఇప్పుడీ టిక్‌ టాక్‌.. స్టాప్‌ కాబోతోంది! ఇప్పటికే డౌన్‌లోడ్‌కి అందుబాటులో లేకుండా పోయింది!

సినిమాహాళ్లు మూత పడితే ఏం కాలేదు. షాపింగ్‌ మాల్స్‌ మూత పడితే ఏం కాలేదు. టిక్‌ టాక్‌ మూత పడింది! వేరే ప్లాట్‌ఫామ్‌ ఉండొచ్చు. కానీ టిక్‌ టాక్‌కు అలవాటు పడిన ప్రాణం.. టిక్‌ టాక్‌‘లాంటి’ వాటి వైపు అసలు చూడనైనా చూస్తుందా? చూడాలనిపిస్తుందా? టిక్‌ టాక్‌ యాప్‌ చైనా వాళ్లది. సోమవారం ఇండియా బ్యాన్‌ చేసిన 59 చైనా యాప్‌లలో టిక్‌ టాక్‌ కూడా ఒకటి. నోటిఫికేషన్‌ రాగానే ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు వీటిని బ్లాక్‌ చేస్తారు. అప్పుడిక.. ‘మీరు ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న యాప్‌ను ప్రభుత్వ అభ్యర్థన మేరకు నియంత్రించడమైనది’ అనే మెసేజ్‌ ప్రత్యక్షమౌతుంది. గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ ఆప్‌ స్టోర్‌ అయితే నిన్న మంగళవారమే టిక్‌ టాక్‌ యాప్‌ను తొలగించేశాయి. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనకున్నవి చింగారీ, మిత్రోన్, రొపోసో, ఇన్‌స్టాగ్రామ్, డబ్‌స్మాష్‌.. వగైరా వగైరా. మన ఫ్యావరెట్‌ టిక్‌ టాకర్‌లు వీటిల్లో దేన్ని ఎంచుకుంటే దాన్ని ఫాలో అయిపోతాం. కొన్నాళ్లకు టిక్‌ టాక్‌ను మర్చిపోయినా పోతాం. 

టిక్‌ టాక్‌ ‘కంటెంట్‌ క్రియేటర్‌’లు ఎంతమంది ఉంటారో, ‘కంటెంట్‌ యూజర్‌’లు అంతమంది ఉంటారు. ప్రదర్శకులదీ, వీక్షకులదీ అటూఇటుగా సమాన నిష్పత్తి. టిక్‌ టాక్‌తో ఎవరైనా హీరో అయిపోవచ్చు. అయితే టిక్‌ టాక్‌ స్టార్‌లుగా వెలిగిపోయేది ఏ కొద్దిమందో. వాళ్లిచ్చే కంటెంట్‌ని బట్టి ఆ స్టార్‌డమ్‌ ఉంటుంది. ఇండియాలో (బహుశా ఏ దేశంలోనైనా) యూత్‌లో టిక్‌ టాక్‌ స్టార్‌లు ఎక్కువగా ఉన్నారు. అది కూడా అమ్మాయిల్లో ఎక్కువమంది ఉన్నారు. అందుకు కారణం వాళ్లిచ్చే ‘రిలేటబుల్‌’ కంటెంట్‌. ‘అరె! మన గురించేనే!’ అనిపించేలా టిక్‌ టాక్‌ చేస్తారు. అలాంటి వాళ్లలో ఫ్రంట్‌ లైన్‌లో ఉన్నవాళ్లు.. జన్నత్‌ జుబెయిర్, రాధికా బాంజియా, అవనీత్‌ కౌర్, సమీక్షా సూద్, ఆషికా భాటియా, నగ్మా మిరాజ్‌కర్, శ్రియా జైన్, భావికా మోత్వానీ, సనా ఇస్లామ్‌ ఖాన్, ఫేబీ.. మరికొందరు.వీళ్లలో ఎవరైనా మీ ఫేవరెట్‌ టిక్‌ టాకర్‌లు ఉంటే బ్యాన్‌తో వాళ్లను మిస్‌ అవుతామేమోనన్న బెంగ అక్కర్లేదు. ఈసరికే మీకోసం వాళ్లే ఓ దేశవాళీ ప్లాట్‌ఫామ్‌ను ఎంపిక చేసిపెట్టుకునే పనిలో బిజీగా ఉండి ఉంటారు.

రాధికా బాంజియా
ఎవరికి ఏం కావాలో అది ఇస్తారు. ఏం అవసరమో అది కూడా. ‘మోస్ట్‌ రిలేటబుల్‌ కంటెంట్‌’. Ðð రీ ఫన్నీ. అదే సమయంలో విరుద్ధ దేవత అయిపోతారు!

భావికా మోత్వానీ
క్యూట్‌. ఫన్‌. ఎంటర్‌టైనింగ్‌. లిప్‌ సింక్‌ నిపుణురాలు. రోజుల తరబడి అలా చూస్తూనే ఉండాలనిపించే పెర్ఫార్మెన్స్‌.

సనా ఇస్లామ్‌ ఖాన్‌
కాన్సెప్ట్‌ వీడియోలు ఈమె స్పెషాలిటీ. ఫన్నీగా ఉంటాయి. ఎంటర్‌టైనింగ్‌గా కూడా. అదిరిపోయే అధరానుకరణ.

ఫేబీ
మేకప్‌ ఆర్టిస్ట్‌. అనంతమైన క్రియేటివిటీ. ఎవరైనా కొత్తగా కనిపించాలనుకుంటే ముందుగా ఫేబీ టిక్‌టాక్‌లు వెదకుతారు.

జన్నత్‌ జుబెయిర్‌
టీవీ బాలనటి. టీన్స్‌లోకి వచ్చి ఆరేళ్లయింది. టిక్‌టాక్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇండియాలో నంబర్‌ వన్‌ ఫిమేల్‌ టిక్‌ టాకర్‌. ఆమె ఏం చేసినా అందరికీ నచ్చుతుంది.

అవనీత్‌ కౌర్‌
ఒకప్పటి బాలనటి. ‘అలావుద్దీన్‌’ టీవీ షోతో పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు టిక్‌ టాకర్‌. ఈమె సామ్రాజ్యంలో ఫాలోవర్స్‌ దాదాపుగా 2 కోట్లు.

సమీక్షా సూద్‌
విశాల్‌ పాండే, భవీన్‌ భునశాలితో కలిసి ‘తీన్‌ తిగాడా’గా సాక్షాత్కరిస్తుంటారు. ఆల్మోస్ట్‌ కోటీ 80 లక్షల ఫాలోవర్లు! బృంద సభ్యులతో కలసి హృదయాలకు గేలాలు వేస్తుంటారు.

ఆషికా భాటియా
స్ట్రెంగ్దీ పిల్ల. మహాశక్తి. ఆత్మవిశ్వాసాన్ని తన బాడీలోంచి ప్రమోట్‌ చేస్తుంటారు. ఎవరి స్కిన్‌లో వాళ్లు సౌకర్యంగా ఉండేందుకు ఈమె నుంచి ప్రోత్సాహం లభిస్తుంటుంది.

నగ్మా మిరాజ్‌కర్‌
ఫ్యాషనిస్టు. ఇన్నొవేటివ్‌. లాక్కెళ్లిపోయే డాన్సర్‌. ఫ్లోర్‌ కాలిపోతుంది.. ఆమె డాన్స్‌ చేస్తుంటే.

శ్రియా జైన్‌
కూలెస్ట్‌. పాటల స్పెషలిస్ట్‌. ప్రతి పాట చుట్టూ సీతాకోక చిలుకల్లా కథలు ఎగురుతూ ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement