సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ఒంటినిఅలంకరించుకోవడంలో సిటిజన్లు మోడ్రన్ ట్రెండ్స్‌ను ఫాలోఅవుతున్నారు. బొట్టు దగ్గర్నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్ దాకా ఏదైనా సరే తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. సమస్యలు తప్పవు అంటున్నారు నగరానికి చెందిన పలువురు వైద్యులు.ఆ విశేషాలు ఏంటో ఓ లుక్ వేద్దాం.
నెత్తికెక్కితే...సమస్యలే..
హెయిర్‌డ్రెస్సింగ్, హెయిర్ కలరింగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. విభిన్న రకాల కలర్స్‌ను ఉపయోగించడం, కెరటిన్ ట్రీట్‌మెంట్స్ వంటి హెయిర్ స్రైటనింగ్ పద్ధతుల వంటివి విపరీతమైన హెయిర్‌లాస్‌కి, అలర్జీలు తదితర సమస్యలకు కారణం కావచ్చు. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది.
టా‘ట్రూ’త్ మరవొద్దు..
టాటూస్ ముద్రించుకోవాలనుకున్నప్పుడు... రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కాకుండా తప్పనిసరిగా స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే వెళ్లాలి. ఇది స్కిన్ అలర్జీల నుంచి స్కిన్ గ్రాన్యులోమాస్ దాకా కారణం అవుతుంది. అంతేకాదు అన్ స్టెరిలైజ్డ్ వాడితే... ఎయిడ్స్ నుంచి హెపటైటిస్ వంటి వ్యాధుల వరకూ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగా డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి. టాటూస్ వేసుకుకున్నాక కనీసం 2వారాల పాటు అబ్జర్వ్ చేయాలి.
మెహెందీ... కేర్ ఇదీ..
సహజమైన రీతిలో తయారైన మెహందీలు కావాల్సిన గాఢమైన రంగును ఇవ్వలేవు.. వీటి తయారీ దారులు కృత్రిమ దారులు వెతుకుతున్నారు. ఫలితంగా వీటిలోనూ రసాయనాల మేళవింపు బాగా జరుగుతోంది. నగరంలో పలువురు చేతులు, కాళ్ల వాపు, వేళ్ల మీద బొబ్బలు రావడం, దురదలు... చర్మం ఎర్రబారడం, మరింత తీవ్రమైతే చర్మం ఊడిపోవడం.. దాకా దారి తీయవచ్చు.
స్టాప్.. హెవీ మేకప్..
ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ సర్వసాధారణమైపోయింది. నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేయాలనే తాపత్రయంతో మార్కెట్లోకి వచ్చిన ప్రోడక్టŠస్ వచ్చినట్టు వాడేస్తున్నారు. వైద్యుల సలహా మేరకు పరిమితమైన మేకప్‌కు మాత్రమే ఓటేయాలి.
సమస్యలకు అ‘డ్రెస్’...
కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని రకాల చర్మాలకు సరిపడవు. ఉదాహరణకు నైలాన్ ఫ్యాబ్రిక్ చాలా మందికి సరిపడదు. ఇక ఎగ్జిమా సమస్య ఉన్నవారి తప్పనిసరిగా కాటన్ వంటి నప్పే ఫ్యాబ్రిక్ మాత్రమే వాడాలి. టైట్స్ పేరుతో విరివిగా వినియోగిస్తున్న బిగుతైన దుస్తులు సైతం చర్మవ్యాధులకు కారణం కావచ్చు.
ఎత్తు పెంచుతూనే చిత్తు చేస్తాయి...
విపరీతమైన హీల్ ఉన్న ఫుట్‌వేర్ వాడకం వల్ల హైట్ ఎక్కువగా, సై్టల్‌గా కనపడతారేమో గాని, రకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి పరిమితమైన హీల్ ఉన్నవీ అది కూడా కాస్తంత ప్రాక్టీస్ తర్వాతే వినియోగించడం మంచిది.
‘ఫి’యర్సింగ్..
కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు రింగుల్ని గుచ్చుకుంటున్నా రు. నాలుక వంటి సున్నితమైన భాగాల మీద జ్యువెలరీ యాడ్ చేయడం వంటి ఎక్స్‌ట్రీమ్ ఫ్యాషన్ ఫాలో అవకూడదు. ఇలాంటివి ముదిరితే తీవ్రమైన సైకలాజికల్ సమస్యగానూ మారవచ్చు.
స్టైల్స్ ఫాలో అవొచ్చు కానీ..
ప్రస్తుతం యూత్ చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా కనిపించాలని ఆశిస్తున్నారు. అది కొంత వరకూ అవసరమే అయినా... జాగ్రత్తలు తప్పనిసరి. మన శరీరం మీద ఏ ప్రయోగం చేయాలన్నా దానికి ముందస్తుగా కొంత శిక్షణ ఇవ్వాలి. తమ శరీరం తీరు తెన్నులపై అవగాహన తెచ్చుకోవడానికి నిపుణులను సంప్రదించి, ఆ తర్వాత ఎంత మేరకు ఆ స్టైల్స్ అనుసరించవచ్చో నిర్ణయించుకోవాలి.– డాక్టర్ వాణి, డెర్మటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment