పొట్లతో హెల్త్‌కు మెట్లు | Stairs to health with petals | Sakshi
Sakshi News home page

పొట్లతో హెల్త్‌కు మెట్లు

Published Thu, Aug 3 2017 10:54 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

పొట్లతో హెల్త్‌కు మెట్లు

పొట్లతో హెల్త్‌కు మెట్లు

గుడ్‌ ఫుడ్‌

జ్వరం తగ్గాక ఆరోగ్యకరమైన ఆహారం అవసరమంటూ కొద్దిరోజుల పాటు పథ్యంగా ఇచ్చే కూరల్లో పొట్లకాయ  ఒకటి. దాని విశిష్టత ఏమిటన్నది ఈ ఉదాహరణతోనే తెలుస్తోంది.

►పొట్లకాయ డయాబెటిస్‌ను నివారిస్తుంది. అంతేకాదు... చైనీస్‌ మెడిసిన్లో పొట్లకాయను డయాబెటిస్‌ చికిత్స కోసం వినియోగిస్తుంటారు. ఇక ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి డయాబెటిస్‌ రోగులు దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.

►గుండెదడ (పాల్పిటేషన్‌) వంటి గుండెజబ్బులను పొట్లకాయ సమర్థంగా నిరోధిస్తుంది. గుండెపై ఒత్తిడిని తొలగించి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే గుణం పొట్లకాయలో ఉంది.

►కామెర్ల వంటి వ్యాధులు వచ్చి కోలుకుంటున్నవారు పొట్లకాయను తినడం వల్ల కాలేయం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇలా  కాలేయం త్వరగా కోలుకునేలా పొట్లకాయ తోడ్పడుతుంది.

►పొట్లకాయలో పీచుపదార్థాలు ఎక్కువ. అందుకే జీర్ణకోశ వ్యాధుల నివారణకు, ఆహారం బాగా జీర్ణం కావడానికి, మలబద్దకాన్ని నివారించడానికి పొట్లకాయ ఉపకరిస్తుంది.

►   పొట్లకాయ చుండ్రును కూడా అరికడుతుంది. మళ్లీ రాకుండా నివారిస్తుంది.

► పొట్లకాయలో అన్ని రకాల ఖనిజలవణాలు ఉన్నాయి. ఎన్నో సూక్ష్మపోషకాలను (మైక్రోన్యూట్రియెంట్స్‌ను) సమకూర్చే అద్భుత ఆహారం ఇది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement