
వేసవి గాలి పీల్చే గార్మెంట్స్
చలికాలంలో ఉన్ని దుస్తుల్లాగానే వేసవికీ ప్రత్యేకమైన దుస్తులుంటాయి. ఎండాకాలం అయినంత మాత్రాన ఇలా ప్రత్యేకమైన దుస్తులెందుకో తెలుసుకుందాం రండి.
చలికాలంలో ఉన్ని దుస్తుల్లాగానే వేసవికీ ప్రత్యేకమైన దుస్తులుంటాయి. ఎండాకాలం అయినంత మాత్రాన ఇలా ప్రత్యేకమైన దుస్తులెందుకో తెలుసుకుందాం రండి.
వేసవి ఎండలోనైనా, చలిలోనైనా మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంటుంది. ఎండవేళల్లో బయట తిరిగినప్పుడు మన శరీర కాస్త పెరిగినా, మళ్లీ నీడకు లేదా చల్లటి ప్రదేశానికి రాగానే నార్మల్‌కు వచ్చేస్తుంది. అయితే వడదెబ్బ తగిలినప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాదు. పైగా బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో శరీర ఉష్ణోగ్రత కూడా అంతకు చేరిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత నార్మల్‌కు తీసుకురాలేని పరిస్థితిని వడదెబ్బ అంటారు.
శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాలేని పరిస్థితి ఎందుకు...?
మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా నియంత్రించే బాధ్యత మెదడులోని హైపోథెలామస్‌ది. బయట ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ... మన శరీరానికి చెమట పట్టేలా చేస్తుందది. దాంతో చెమట పట్టినప్పుడు... శరీరం నుంచి ఉష్ణోగ్రతను గ్రహిస్తూ ఆవిరైపోతుంది. శరీరం నుంచి ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల దేహం చల్లబడుతుంది. అంటే శరీరాన్ని చల్లగా చేయడం కోసమే చెమట పడుతుందన్నమాట. ఎండ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో దాన్ని ఒక నిర్ణీత స్థాయి కంటే దాటకుండా చూసేందుకు హైపోథలామస్ కృషి చేస్తుంటుంది. ఆ స్థాయిని ‘హైపోథలామస్ సెట్ పాయింట్’ అని చెబుతారు. కానీ ఎండ వల్ల శరీర ఉష్ణోగ్రత అదేపనిగా పెరుగుతూ పోతే ఇక ఒకదశలో హైపోథలామస్ కూడా దాన్ని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతకు తగినట్లుగా శరీర ఉష్ణోగ్రత అదుపులోకి రాకుండా పెరిగిపోతూ ఉంటుంది. వడదెబ్బ తగిలిన సందర్భంలో అసలు చెమటపట్టకుండా పోయినప్పుడు ఒక దశలో ఇది జరుగుతుంది. ఈ దశలోని స్థితినే ‘వడదెబ్బ’ అంటారు. ఈ కండిషన్‌లో జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగించే ‘డోలో-650’ లాంటి మందులు పనిచేయవు. శరీర ఉష్ణోగ్రతను డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా తగ్గించి నార్మల్‌కు వచ్చేలా చేయాల్సిందే.
వడదెబ్బకు దోహదం చేసే ఇతర ఫ్యాబ్రిక్...
మన దుస్తులు తయారయ్యే ముడిసరుకును ఫ్యాబ్రిక్ అంటారు. అది కాటన్ కాకుండా ఇతర ఫ్యాబ్రిక్‌తో తయారైనప్పుడు సాధారణంగా చెమటను పీల్చుకోదు. ఈ పీల్చుకోవడం, చెమట ఆవిరయ్యే ప్రక్రియ జరగకపోవడంతో శరీర ఉష్ణోగ్రత తగ్గదు సరికదా... పెరుగుతూ పోతుంది. అలా పరోక్షంగా మనం తొడిగే దుస్తుల్లో కాటన్ కాకుండా టెరిలిన్ వంటి ఇతరత్రా ఫాబ్రిక్ ఉంటే వడదెబ్బను మనం చేతులారా ఆహ్వానించినట్లవుతుందన్నమాట.
వడదెబ్బ ప్రాణాంతకం...
వడదెబ్బ తగిలిన కండిషన్‌లో బయటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో, శరీర ఉష్ణోగ్రతా అంతే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో శరీర జీవక్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. దాంతో శరీరంలోని ప్రతి వ్యవస్థా దెబ్బతింటుంది. అందుకే ఈ పరిస్థితిని నివారించే దుస్తులు వాడాలి. అయితే వేసవి దుస్తులు వేసుకున్నంత మాత్రాన వడదెబ్బ తగలదని కాదు. అందుకే వడదెబ్బ లక్షణాలైన మూత్రం తక్కువగా రావడం, విపరీతంగా చెమటలు పట్టడం, తల తిరుగుతున్నట్లు ఉండటం, విపరీతమైన దాహం, తీవ్రమైన అలసట లాంటివి ఉంటే తక్షణం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.
వేసవి దుస్తులివి...
వడదెబ్బ వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకోవటానికి కాటన్ దుస్తులు, వదులైన దుస్తులు, లేత రంగు దుస్తులు ఉపయోగపడతాయి. అదెలాగో చెప్పుకుందాం. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకోవడంతో పాటు తేలిగ్గా ఆవిరయ్యేందుకు ఆస్కారం కలిగిస్తాయి లినెన్ అనే దుస్తులు వేసవికి అనువైనవనీ, శ్వాసించే దుస్తులని వాటికి పేరు వదులుగా ఉండే దుస్తుల్లో చెమట అవిరయ్యేలా సంచరించేందుకు ఆస్కారం ఉంటుంది లేత రంగు దుస్తులు వేడిమిని, సూర్య కిరణాలను తిరగ్గొడ తాయి ఇంట్లో (ఇన్‌డోర్స్‌లో) ఉన్నప్పుడు హాఫ్ షర్ట్స్, త్రీఫోర్త్ ప్యాంట్స్ లాంటివి గాలి ఆడేటందుకు వేసుకున్నా, ఎండలోకి వెళ్లిన ప్పుడు మాత్రం బలమైన సూర్యకిరణాలు, వాటి హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాలనుంచి రక్షిం చుకోవడం కోసం ఫుల్ షర్ట్స్, ఫుల్‌లెంత్ కాటన్ ట్రౌజర్స్ వేసుకోవడం మంచిది శరీరానికి అంటు కుని ఉండే లెగ్గిన్స్ వంటివి ఈ సీజన్‌లో తగవు. దీనికి రెండు కారణాలు. చెమటను పీల్చుకునేలా అవి గాలిని ఆడనివ్వవు. పైగా విదేశీయులు ధరించే స్టాకింగ్స్ తరహాలో అవి శరీరానికి విపరీతమైన బిగుతుతో అంటిపెట్టుకుని ఉండటంతో కిందివైపు నుంచి పై వైపునకు రక్తప్రసరణ జరిగే ప్రక్రియను అడ్డుకోవచ్చు ఒంటికి అంటుకుని ఉండేలాంటి టీ షర్టులు, టైట్ జీన్స్, సింథటిక్ దుస్తులు, మహిళలు ధరించే సిల్క్ చీరలు గాలి ఆడనివ్వవు. కాబట్టి ఈ సీజన్‌లో అవి అనువైనవి కావు నల్లరంగు దుస్తులు సూర్యకిరణా లను పూర్తిగా గ్రహించి, ఒంటినీ వేడెక్కిస్తాయి. కాబట్టి వేసవిలో నల్లరంగు దుస్తులు ధరించకూడదు.
డాక్టర్ శివరాజు,
సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్,
హెచ్‌ఓడీ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్