♦ ముందు వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల స్వేద గ్రంధుల జిడ్డు, తద్వారా మురికి తొలిగి చర్మకాంతి తగ్గకుండా ఉంటుంది.
♦ దూది ఉండతో క్లెన్సింగ్ మిల్క్‌ను ముఖమంతా రాసి తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చే స్తే స్వేదగ్రంధులు చక్కగా శుభ్రపడతాయి. ముఖ చర్మం జిడ్డుగా మారదు
♦ జిడ్డు తొలగిపోవాలని స్క్రబ్‌తో ముఖాన్ని ఎక్కువగా రుద్దకూడదు. వారానికి 2 సార్లు స్క్రబ్ చేస్తే మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. నూనెలు, ఇతర మాయిశ్చరైజర్ క్రీమ్‌లను ఈ కాలం ఉపయోగించకపోవడమే మేలు
♦ ముల్తానా మిట్టి లేదా గంధం పొడి వారానికి ఒకసారి ప్యాక్‌లా వేసుకొని ఆరాక శుభ్రపరుచుకోవాలి. దీంతో అదనపు జిడ్డు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది
♦ ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి ముందు టిష్యూ ప్యాడ్‌తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు సులువుగా వదిలిపోతుంది. నేరుగా చెయ్యి ముఖానికి తగలడం వల్ల మొటిమలు, యాక్నె సమస్య పెరుగుతుంది
♦ ఈ కాలం వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జిడ్డు సమస్య పెరుగుతుంది. విటమిన్ –ఎ అధికంగా ఉండే క్యారట్, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి
♦ రోజూ 2–4 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు సమస్య బాధించదు.
సమ్మర్ టిప్స్
Published Sat, Apr 28 2018 12:59 AM | Last Updated on Sat, Apr 28 2018 12:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment