ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం | This event is beneficial ... standard | Sakshi
Sakshi News home page

ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం

Published Sat, Apr 2 2016 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం

ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం

సత్ గ్రంథం


కాలాన్ని అనుసరించి కర్మలను చేయాలంది శాస్త్రం. ఏకాలంలో ఏ పనులు చేయడం శ్రేయస్కరమో ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి సద్గ్రంథాలలో పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే ఈ రోజుల్లో అంతటి ఉద్గ్రంథాలను చదివే ఓపిక, తీరిక ఉన్నవారు అరుదు. ఒకవేళ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా, గ్రాంథిక భాషలో ఉండే ఆయా విషయాలను అర్థం చేసుకోవడం కష్టం. ఈ లోటును పూరించేందుకుగానూ పాత్రికేయుడు, అధ్యాపకుడు డా. కప్పగంతు రామకృష్ణ అనేకమైన ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి, ఏ మాసంలో ఏయే పనులు చేయాలో వివరిస్తూ, ‘నిత్యోత్సవము’ అనే పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకంలో చైత్రం మొదలుకొని, ఫాల్గుణం వరకు ప్రతి మాసం విశిష్టతతోబాటు ఏ మాసంలో... ఏ తిథిలో ఏ పనిని చేయాలో వివరంగా తెలియజేశారు. ఇక జనమందరూ శూన్యమాసాలుగా చిన్నచూపు చూసే ఆషాఢ, భాద్రపద, పుష్యమాసాలను అనంత ఫలాల మాసమనీ, పితృప్రీతికరమాసమనీ, పుణ్యఫలాల మాసమనీ సంభావిస్తూ, ఆ మాసాల వైశిష్ట్యాన్ని వివరించడం అభినందనీయం. ప్రతి మాసాన్నీ శుక్లపక్షం- కృష్ణపక్షంగా విభజిస్తూ, ఏ తిథిన ఏ పర్వదినమో, ఆనాడు ఏ విధిని నిర్వర్తించాలో వాడుక భాషలో చెప్పడం వల్ల పెద్దబాలశిక్షతోనో, ప్రాథమిక విద్యతోనో సరిపెట్టేసిన వారు సైతం సులువుగా అర్థం చేసుకోగ లరు.

నిత్యోత్సవము (మహిమాన్విత మాసాలు; రచన: డాక్టర్.కె.రామకృష్ణ)


పుటలు: 104; వెల: రూ.75 (తపాలా ఖర్చులు అదనం); ప్రతులకు: శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్; 11-25-119, మెయిన్ రోడ్, విజయవాడ-520 001; కె.లక్ష్మీనారాయణ, ఇం.నం. 9-22, కొత్తూరు తాడేపల్లి పోస్ట్, వయా మిల్క్ ప్రాజెక్ట్, విజయవాడ-12. సెల్:9032044115  - డి.వి.ఆర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement