♦ ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమంగా ‘తలుపులమ్మ’గా మారింది.
♦ పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
♦ సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ‘ అనే అర్థంలో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమంగా అది ‘మావుళ్ళమ్మ‘ అయింది.
♦ స్వచ్ఛమెన అమ్మ అనే అర్థంలో అచ్చ(స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
♦ ప్రతి వ్యక్తికీ ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది.
♦ అలాగే ఫుల్ల(వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ. చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
గ్రామదేవతా నామ విశేషాలు
Published Sun, Dec 10 2017 1:23 AM | Last Updated on Sun, Dec 10 2017 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment