వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం | Viryakanala homeopathic remedy defects | Sakshi
Sakshi News home page

వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం

Published Sat, Sep 28 2013 11:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం

వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం

30 ఏళ్ల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
 సంతానం కలిగి ఉండడం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈకాలం చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం - మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వలన మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి.
 
 ఆయుర్వేద శాస్త్రంలో ‘త్రి ఉపస్తంభాలు’ అనే ఒక ఆరోగ్య రహస్యం మహర్షులు చెప్పారు. అవి - ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. మానవులు ఆరోగ్యకరమైన (సమతుల్య ఆహారం) అహారం, సరియైన సమయంలో తగు ప్రమాణంలో ( 6 గం. - 8గం.) నిద్రపోవడం, అలాగే బ్రహ్మచర్యం పాటించడం (అనగా ప్రాకృతిక నియమాలు) ఉదా: దినచర్య / ఋతుచర్యలను పాటించడం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది.
 
 ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా భారతీయులను కూడా ఈ సమస్య పీడిస్తోంది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. అది తిరిగి మానవులకే హాని కలిగిస్తుంది. తద్వారా పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్‌లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
 
 ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గటాన్ని ‘ఓలిగో స్పెర్మియా’ అని, అసలు కణాలు లేనట్లయితే ‘ఆజోస్పెర్మియా’ అని, కదలిక సరిగా లేనిచో ‘అస్తినోస్పెర్మియా’ అని, కణాల స్వరూపం మార్పులు ఉన్నట్లయితే ‘టెరిటో స్పెర్మియా’ అని అంటారు.
 ఆయుర్వేద శాస్త్రంలో శుద్ధ శుక్రకణాల యొక్క వివరణలు, అలా శుక్ర కణాల దోషాల గురించి అతి విస్తారంగా చరక, సుశ్రుత, వాగ్భట మహర్షులు చర్చించారు.


 చరక మహర్షి పురుషులలో సంతానలేమికి నాలుగు ప్రధాన కారణాలు చెప్పారు.
 1. బీజోపఘాతం (వీర్యకణాలలో సంఖ్య, కదలికల్లో నాణ్యత లోపాలు)
 2. శుక్ర సంక్షయ (వీర్య ప్రమాణంలో తగ్గుదల)
 3. ధ్వజోపఘాత (అంగ స్తంభన సమస్యలు)
 4. జరా (ముసలితనం)
 పై కారణాలలో బీజదోషం గురించి, ఇంకా సమగ్రత గురించి చర్చించారు. వాటిని శుక్ర దోషాలుగా వర్ణించారు. అవి సంఖ్యాపరంగా చూసినట్లయితే 8 విధాలుగా చెప్పవచ్చు.
     
 వాతదోషం వల్ల 3 సమస్యలు - నురుగుతో కూడిన వీర్యం, పలుచగా ఉండే వీర్యం, రూక్షత (dryner) కలిగిన వీర్యం అనేవి. ఈ వాత దోషంచే నొప్పితో కూడిన వీర్యం స్వల్పంగా వెలువడుతుంది.
     
 పిత్తదోషం వల్ల 2 సమస్యలు - దుర్గంధయుక్త వీర్యం (pus cell), వివర్ణత (సహజవర్ణం మారుట) అనేవి. ఇక్కడ పిత్తదోషంచే మంటతో కూడిన వీర్యం వెలువడుతుంది.
     
 కఫదోషం వల్ల అతి జిగురు కలిగిన వీర్యం (viscosity పెరుగుట) అనే సమస్య. ఇక్కడ వీర్యం చల్లగా వెలువడుతుంది.
     
 రక్తదోషంచే వీర్యంలో ఎర్ర రక్తకణాలు వెలువడతాయి. అలాగే - వాత కఫ దోషాలచే వీర్యం త్వరగా ద్రవ స్వభావాన్ని పొందదు.
 
 అందుకే ఆయుర్వేదంలో శుద్ధ శుక్ర లక్షణాల గురించి ఈవిధంగా చెప్పారు.
 ‘స్ఫటికాభం, ద్రవం స్నిగ్ధం మధురం మర్మ గన్ధిచ’ అనగా స్వచ్ఛమైన శుక్రం, పారదర్శకంగా (స్ఫటికంలా), ద్రవత్వాన్ని, స్నిగ్ధత (viscosity)ని, మర్మరం (ph. value 7.2-7.7), గా ఉండాలని ఆచార్యులు చెప్పారు. ఈ లక్షణాలతో కూడిన వీర్యాన్ని కలిగిన పురుషులకు ఎలాంటి సందేహం లేకుండా ఉత్తమ సంతానం కలుగుతుంది.
 
 ఇందుకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక అద్భుత చికిత్సా విధానాలు, రసాయన, వాజీకరణ చికిత్సా విభాగంలో మహర్షులు వివరించారు.
 
 ముఖ్యంగా శుక్ర రేచకములు (vericocel) లాంటి సమస్యలు శుక్ర శోధకాలు (ఇన్ఫెక్షన్‌ను తగ్గించేవి), శుక్ర జనకాలు (కణాల వృద్ధికి, నాణ్యతకు)అనే ఔషధాలను ఆచార్యులు వివరించారు. ఇది చూర్ణ రూపంలోనూ, అస్ఫ/అరిష్ట రూపంలోనూ, వటి రూపంలోను, లోహ రూపంలో, భస్మ రూపంలో అనేక అద్భుత ఔషధాలు, అతి సమర్థవంతంగా పనిచేస్తాయి.
 
 అలాగే హార్మోన్‌ల సమస్యలలో తక్రధార, శరీర .... విరేచనం, వస్థి, ఉత్తరవస్థి లాంటి అనేక ప్రత్యేక చికిత్సా విధానాలలో ఈ శుక్రకణాల సమస్యలను అధిగమించి సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.
 
 అలాగే సరైన దినచర్య, ఋతుచర్య ఇత్యాది విషయాలలో కూడా ఆయుర్వేద వైద్యుల సూచనలు పాటిస్తే పురుషులలో ‘సంతానలేమి’ని జయించవచ్చు.
 
 - డాక్టర్ మనోహర్
 ఎం.డి (ఆయుర్వేద), సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, విజయవాడ,
 విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక  
 ఫోన్ : 7416 107 107, 7416 109 109
 www.starayurveda.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement