sperm cells
-
ప్రమాదంలో ‘పునరుత్పత్తి’.. జీవనశైలిలో మార్పులే కారణమా?
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో శుక్ర కణాలు భారీ సంఖ్యలో తగ్గుతున్నాయి. వీర్యకణాల చిక్క దనం తగ్గిపోతోంది. నలభై ఐదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చితే...పురుషుల్లో వీర్యకణాల చిక్కదనంలో 50 శాతానికి పైగా, స్పెర్మ్‌కౌంట్ (శుక్ర కణాలు)లో 62.3% క్షీణత నమోదైనట్టు పేర్కొంటున్నాయి. తగ్గుదల రేటు గత కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కారణమని పరిశోధనలు స్పష్టం చే స్తున్నాయి. రాత్రివేళ పని, అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 53 దేశాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఏడాదికి 1.16% చొప్పున..! 1972 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఏడాదికి 1.16 శాతం చొప్పున శుక్రకణాల చిక్కదనంలో తగ్గుదల నమోదైనట్టు గుర్తించారు. ఇక 2000 సంవత్సరం తర్వాత సేకరించిన డేటాను మాత్రమే పరిశీలించినపుడు ఆ తగ్గుదల ఏడాదికి 2.64 శాతంగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి తాజా పరిశోధన ‘హ్యుమన్ రీ ప్రొడక్షన్ అప్డేట్’ జర్నల్‌లో ప్రచురితమైంది. గతంలో వీర్యకణాల చిక్క దనం, కౌంట్ ఒక మిల్లీగ్రామ్ (ఎంఎల్)లో 40 మిలియన్ల కంటే తగ్గితే పునరుత్పత్తికి దోహదపడవని అంచనా వేశారు. అయి తే తాజా అంచనాలు, డేటా చూశాక దీని కంటే కూడా కౌంట్ పడిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగినట్టు స్పష్టమైంది. పునరుత్పత్తి సామర్ధ్యంలో తగ్గుదల స్పెర్మ్‌కౌంట్ తగ్గుదల జనాభా పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుదలను స్పష్టం చేస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెరూసలెం హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లీవైన్ పేర్కొన్నారు. స్పెర్మ్‌కౌంట్ అనేది ‘హ్యుమన్ ఫెర్టిలిటీ’కే కాకుండా మగవారి ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వీర్యకణాల తగ్గుదల దీర్ఘకాలిక వ్యాధులకు, టెస్టిక్యూలర్ (వృషణాల) కేన్సర్లకు దారితీయడంతో పాటు ఆయురార్దం తగ్గుదలకూ దోహదపడుతుందని తేలింది. వయసు, శృంగార సామర్థ్యం ఇతర అంశాల ప్రాతిపదికగా వివిధ కేటగిరీలుగా విభజించి ఈ పరిశోధన నిర్వహించారు. భారత్‌లో సుస్పష్టం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా మన దేశంలోనూ దీనిపై పరిశీలన నిర్వహించారు. భారత్‌లో వివిధ కేటగిరీల వారీగా డేటా సేకరించారు. ‘భారత్‌లోని మగవారిలో శుక్రకణాల తగ్గుదల అనేది స్పష్టంగా గమనించాం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఒకేవిధమైన పరిస్థితి ఉంది. అత్యాధునిక సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, జీవనశైలి మార్పులు, పర్యావరణంలో రసాయనాల వ్యాప్తి వంటివి దీనికి ›ప్రధానకారణం’ అని లీవైన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోనూ తక్కువగా.. హైదరాబాద్ మహానగరంలో ఐటీతో పాటు వివిధరంగాల్లో ముఖ్యంగా రాత్రి పూట పనిచేసే వారిని, 30 ఏళ్లు ఆ పై వయసు పైబడ్డాక పెళ్లి చేసుకున్న వారిని, జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్న రోగుల్ని డాక్టర్లు పరిశీలించారు. వారికి తగిన పరీక్షలు చేసి, పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ట్రీట్మెంట్ ఇచ్చారు. ►పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత 32 ఏళ్ల వయసున్న సురేష్ కుమార్, 30 ఏళ్ల వయసున్న లక్ష్మీ (పేర్లు మార్చాం) తమకు పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ వద్దకు వెళ్లారు. వారికి ఇన్ఫెర్టిలిటీ ఎవల్యూయేషన్ చెకప్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా వారికి విడివిడిగా క్లినికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్‌లు నిర్వహించి సెమన్ అనాలిసిస్‌కు (వీర్యకణాల విశ్లేషణ) పంపించారు. సురేష్‌లో శుక్రకణాలు ఉండాల్సిన దాని కంటే చాలా తక్కు వగా ఉన్నట్టు ‘వలిగొ స్పెర్మటోజువా’ ద్వారా గుర్తించారు. జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. సరైన సమయానికి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సరైన నిద్ర, ఒత్తిళ్లను దూరం చేసే విధానాలు, తగిన వ్యాయామం వంటి వాటితో గణనీయమైన మార్పులు సాధించవచ్చునని సూచించారు. ►29 ఏళ్ల వెంకటేశ్వరరావు (పేరు మార్చాం)కు రెండేళ్ల క్రితమే పెళ్లి అయినా పిల్లలు పుట్టలేదు. ఇతను ప్రతిరోజూ రాత్రి 10, 11 గంటల దాకా వ్యాపారరీత్యా పనిలోనే ఉంటారు. ఆ తర్వాత అలసటకు గురికావడం, ఆలస్యంగా తిండి తిన డం, నిద్రపోవడం వల్ల వీర్యకణాలు అవసరమైన వాటికంటే చాలా తక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ముఖ్యమని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నందువల్ల వీలైనంత మేర ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మిగతా వారితో పోల్చితే 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నవారిలో వీర్యకణాల కౌంట్ బాగా తక్కువగా ఉంటోంది. వీరు నైట్ డ్యూటీల్లో పనిచేస్తుండడం, ఆహార అలవాట్లు మారడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతూకం కోల్పోయి మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో స్పెర్మ్‌కౌంట్ తగ్గడాన్ని మా పరిశీలనల్లో గమనించాం. ఒకవేళ కౌంట్ కావాల్సినంత ఉన్నా చురుకైన కదలికలు లేని వీర్యకణాలే ఎక్కువగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదు. – డా.కేవీ భార్గవ్‌రెడ్డి, మంగళగిరి ఎయిమ్స్. ఒత్తిళ్లు..ఊబకాయం అన్ని రంగాలు, వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జీవితం గడుపుతున్నారు. జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. 30 ఏళ్లలోపు వారికే షుగర్, బీపీ వస్తున్నాయి. దీనివల్ల రానురాను ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో, బయటా, పనిప్రదేశాల్లో వివిధ రూపాల్లో రేడియేషన్, యూవీ రేస్, కాలుష్య ప్రభావాలు పెరిగిపోయి కావాల్సిన సంఖ్యలో వీర్యకణాల ఉత్పత్తి జరగడం లేదు. – డా.ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ -
జంక్‌ఫుడ్‌తో వీర్యకణాల తగ్గుదల!
జంక్‌ఫుడ్ కారణంగా ఎన్నో రకాల అనర్థాలు వస్తాయన్న సంగతి ఇప్పటికే చాలా పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. అయితే జంక్‌ఫుడ్ కారణంగా వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) తగ్గుతుందని ఇటీవలి తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్(యూఎస్)లోని హార్వర్డ్ టీ.హెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 3,000 మందికి పైగా యువకుల్లో ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 19 ఏళ్లు పైబడిన యువకులను నాలుగు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూపునకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు. వారి ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పండ్లు, నట్స్, గుడ్లు, తృణధాన్యాలు ఉండేలా చూశారు. అలాగే మరో గ్రూపునకు ఒకింత తక్కువ ఆరోగ్యకరమైన ఆహారం సమకూర్చారు. ఇలా మొదటి గ్రూపు మినహా ప్రతి గ్రూపునకూ కొంత పోషకాహారాన్ని తగ్గిస్తూ, జంక్‌ఫుడ్‌ను పెంచుతూ పోయారు. ఈ నాలుగు గ్రూపుల వీర్యనమూనాలను సేకరించి పరీక్షించగా... జంక్‌ఫుడ్‌ను తీసుకున్న గ్రూపుతో పోలిస్తే... పూర్తిగా అన్ని పోషకాలు ఉన్న మంచి సమతుహారాన్ని తీసుకున్న గ్రూపులోని యువకులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు చాలా బాగున్నట్లు తేలింది. జంక్‌ఫుడ్ తీసుకున్న గ్రూపుతో పోలిస్తే, మంచి ఆహారం తీసుకున్న గ్రూపులోని యువకుల వీర్యంలో వీర్యకణాల సంఖ్య దాదాపు 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంటే... జంక్‌ఫుడ్ తీసుకోవడం అన్న అంశం సంతానలేమికి ఎంతో కొంత దోహదం చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ వైజ్ఞానిక జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. -
డాడీ కావాలంటే... ఇగో వద్దు!
పిల్లలు పుట్టలేదంటే మగవాళ్లు అదేదో భార్యకు ఉండే సమస్య అనుకుంటారు.భార్యకు పరీక్షలు చేయించాలంటే అది చాలా ఖర్చుతో కూడిన పని. అదే మగాడి ప్రాథమిక పరీక్షలు ?రూ. 500/–లకు మించవు. అలాంటప్పుడు ‘ఇగో’ మాని ‘డాడీ’ అయితే..హ్యాపీ కదా!...చాలా చాలా హ్యాపీ కదా!! సంతానలేమికి కారణాలు మహిళల్లో ఎన్ని ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయి. నిజంగా చెప్పుకోవాలంటే సంతానలేమి అనే సమస్యలో తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. అది తక్కువ ఖర్చుతోనే జరిగిపోతుంది. మహిళల్లో సమస్యల కోసం మొదటే వెళ్తే, వాటికి సంబంధించిన పరీక్షల ఖర్చులు పురుషుల పరీక్షలతో పోలిస్తే చాలా ఎక్కువే. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో ఏమీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం వృథా అవుతాయి. అందుకే తొలుత పురుషులు పరీక్ష చేయించుకోవడం మేలు. కారణాలను కనుగొనడం యాండ్రాలజిస్ట్ల పని పురుషుల్లోని లైంగికతకు సంబంధించిన అంశాలనూ, సంతానలేమికి గల కారణాలను పరిష్కరించే వైద్య విభాగానికి యాండ్రాలజీ అని పేరు. మొదట ఈ పేరును దుర్వినియోగం చేస్తూ చాలామంది నకిలీ డాక్టర్లే సమాజంలో చెలామణీ అవుతున్నారు. అందుకే ముందుగా క్వాలిఫైడ్ యాండ్రాలజిస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక యాండ్రాలజిస్ట్ అని పిలిచే ఆ డాక్టర్ కూడా తన రోగిని భయపెట్టకుండా, ఆందోళనకు గురిచేయకుండా సాంత్వన పరుస్తూ చికిత్స చేస్తారు. ఏ పరీక్షలూ చేయకుండానే ‘మీలో ఏదో లోపం ఉందం’టూ ఒక డాక్టర్ చెబితే దాన్ని నమ్మడం అంత సబబు కాదు. ఆందోళన చెందకుండా రెండో ఒపీనియన్‌కు మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. మాటల తర్వాతి దశ... భౌతిక పరీక్ష పురుషులతో మాట్లాడటం ముగిశాక తర్వాతి దశ... ఫిజికల్ ఎగ్జామినేషన్ అని పిలిచే భౌతిక అంశాల పరీక్షలు. ఇందులో భాగంగా పేషెంట్‌లోని సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ సరిగానే ఉన్నాయా అని చూడటం. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే... అతడిలో మీసాలు గడ్డాలు బాగానే పెరిగి ఉన్నాయా, అతడికి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వెంట్రుకలు బాగానే వచ్చాయా, పురుషాంగం పరిమాణం ఉండాల్సినంతగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాకే ఆ తర్వాత పరీక్షల దశకు వెళ్లాలి. కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్స్తోనే కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వృషణాల సైజు చాలా చిన్నగా ఉన్నప్పుడూ, వ్యాస్ సరిగా లేకపోయినా, పెద్ద పెద్ద పరీక్షలు చేయించినా లాభమే ఉండదు. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే... అప్పుడు కేవలం 200 నుంచి 500 రూపాయలు మాత్రమే ఉండే మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. ఇప్పుడు చేయించాల్సింది వీర్యపరీక్ష... వీర్యపరీక్షలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు తెలుస్తాయి. ఈ వీర్యపరీక్ష చేయించడానికి ముందుగా కనీసం మూడు రోజుల పాటు సెక్స్ లేదా హస్తప్రయోగం చేయకూడదు. ఆ పరీక్ష చేసే ల్యాబ్ టెక్నీషియన్ కూడ మంచి తర్ఫీదు పొంది ఉండాలి. ఒక్కోసారి ఒక వీర్యపరీక్షకూ మరో వీర్యపరీక్షకూ కూడా పొంతన ఉండకపోవచ్చు. అందుకే మొదటి పరీక్షలోనే వీర్యకణాల గురించి ఏదైనా ప్రతికూల ఫలితం కనిపిస్తే కుంగిపోకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోతుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు బాగా వస్తాయి. ఇలా ఉండటం మన మామూలు ఆరోగ్యానికీ అవసరం. మనం ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చాలా బాగుంటాయి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్ర ఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. తొలి అవగాహన దంపతులదే... సంతానలేమితో బాధపడే దంపతుల్లో చాలామందికి సెక్స్ పట్ల సరైన అవగాహన ఉండదు. సంతానం కోసం పరితపించే దంపతుల్లో చాలామందికి సంతానం కోసం సెక్స్‌లో ఎప్పుడు పాల్గొనాలో కూడా తెలియదంటే అది అతిశయోక్తి కాదు. సాధారణంగా మహిళకు రుతుస్రావం వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు ఏదో ఒక రోజున అండం విడుదలయి ఉంటుంది. అందుకే ఆయా రోజుల్లో దంపతులు తప్పనిసరిగా కలవాలి. కలయిక ముగిసిన వెంటనే మహిళ పైకి లేవకూడదు, శుభ్రపరచుకోకూడదు. మూత్రవిసర్జన చేయకూడదు. శుక్రకణాలతో కూడిన వీర్యం యోనిలోకి పూర్తిగా వెళ్లేలా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మహిళల్లో అర్జెంటుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చేలాంటి మూత్రసమస్య ఏదైనా ఉంటే అలాంటి మహిళలు సెక్స్‌కు ముందే మూత్రవిసర్జనకు వెళ్లిరావడం మంచిది. సెక్స్ అయ్యాక వీర్యం వెంటనే బయటకు రాకుండా ఉండేందుకు గాను మహిళలు తమ ఎడమవైపునకు లేదా కుడివైపునకు ఒరిగిపోయి పూర్తిగా ముడుచుకుపోయినట్లుగా కాసేపు పడుకొని ఉండటం మంచిది. అది శుక్రకణాలన్నీ బయటకు రాకుండా లోపలివైపునకు వెళ్లేందుకు దోహదపడుతుంది. పురుషుడికి స్ఖలనం కాగానే... వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుందని అపోహ పడే దంపతులూ చాలామందే ఉంటారు. నిజానికి వీర్యానికి సంబంధించి ఎంతో కొంత ద్రవం బయటకు వస్తుంది. కానీ వీర్యంలో ఉండే ద్రవమంతా వీర్యకణాలు కాదు. ఇంత ద్రవరాశిలో మొత్తం వీర్యకణాల సంఖ్య దాదాపుగా 60 లక్షల నుంచి 1.20 కోట్ల వరకు ఉంటుంది. వీర్యం ద్రవం కాస్తంత బయటకు వచ్చినా దంపతులు ఆందోళన పడకూడదు. ఎందుకంటే... వీర్యం యోనిలోకి ప్రవేశించగానే... శుక్రకణాలన్నీ తమ ఇన్స్టింక్ట్ మేరకు అండంతో కలిసేందుకు ముందుకు వెళ్తూ ఉంటాయి. నిజానికి ఈ అంశాలన్నింటినీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్ దంపతులకు వివరిస్తూ వారిలో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన పెంచేలా కౌన్సెలింగ్ రూపంలో వారికి తెలియజేయాలి. అప్పుడు వారిలో ఉండే ఆందోళన చాలావరకు తగ్గుతుంది. తర్వాత చేయించాల్సినవి హార్మోన్ పరీక్షలు... వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య అంతా సక్రమంగా ఉండి, ఆ దంపతుల కలయికలు కూడా బాగానే ఉన్నప్పటికీ గర్భం రాకపోతే అప్పుడు తర్వాత చేయాల్సిన పరీక్షల గురించి ఆలోచించాలి. అప్పుడు వాటిలో మొదట చేయాల్సినవి హార్మోన్ పరీక్షలు. ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్ (ఇవి మహిళలకూ చేస్తారు) ఈ నాలుగు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ పరీక్షలు కూడా అంత ఖర్చుతో కూడినవేమీ కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ముందుగా చెప్పినట్లుగా పురుషుల్లో తక్కువ పరీక్షలతో, తక్కువ ఖర్చుతోనే కారణాలేమిటో నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు. అందుకని పురుషులతోనే మొదట పరీక్షలు మొదలుపెట్టాలి. ఒకవేళ హార్మోన్ పరీక్షలు కూడా నార్మల్‌గా ఉంటే వీర్యకణాల సంఖ్య కూడా నార్మల్‌గా ఉంటే కొన్ని రోజులు విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి మళ్లీ వీర్యకణాల టెస్ట్ చేయించడం మంచిది. అప్పుడు దంపతులు ఆందోళన చెందకూడదు. కొన్నిసార్లు కలయిక సరిగా లేకపోవడం వల్ల గర్భధారణకు రెండుమూడేళ్లు ఆలస్యం కావచ్చు. ఇందుకు ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. ఎందుకంటే ప్లానింగ్ తర్వాత రెండుమూడేళ్ల సమయం అంత పెద్దదేమీ కాదు. వీర్యరాశిలో అసలు వీర్యకణాలే లేకపోతే... ఇక్కడ మనం ఒక విషయాన్ని విపులంగా తెలుసుకోవాలి. వీర్యం అన్నది వీర్యకణాలు జీవించి ఉంటూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక మీడియం. ఈ వీర్యాన్ని ప్రొస్టేట్ గ్రంథి తయారు చేస్తుంది. వీర్యకణాలు వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ ఉత్పత్తి అయిన ఆ కణాలు, వాస్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యరాశి వరకు చేరి, అక్కడ ఈదుతూ ఉంటాయి. ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో వీర్యకణాలు అస్సలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. కచ్చితంగా ఇది క్లిష్టమైన సమస్య. ఎందుకంటే... కోటికణాలు ఉన్నచోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు కదా. కారణాలను కచ్చితంగా కనుగొంటే... ఈ సమస్యను కూడా అధిగమించడానికి ఆధునిక వైద్య శాస్త్రంలో మార్గాలున్నాయి. రోగికి వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు మొదటి నెల విటమిన్ మాత్రలు ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి పరీక్ష చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవనే రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందా లేదా అని ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇదొక ఆశారేఖ... వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా కొందరిలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్‌కు మేలు చేసేందుకు డాక్టర్లకు అవకాశం ఉంటుంది. నిజంగానే వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంటే... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్‌ను) రిపేర్ చేసి వీర్యకణాలు మామూలుగా బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. నూటిలో కేవలం 10 మందికి మాత్రమే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ చేయించుకోవడం వల్ల నష్టమైతే ఉండదు. ఇలాంటి సంక్లిష్టమైన పరీక్షలు యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్ల్లో బాగా నైపుణ్యం ఉన్నవారు చేస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి. పేషెంట్‌కు డాక్టర్ చేసే పరీక్ష ఏమిటో, దాని పరిణామాలు ఏమిటో తెలుసుకోవల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇదంతా వృషణాల్లో వీర్యకణాల తయారీ ఉంటేనే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి. ఇది మరో ప్రత్యామ్నాయం... ఒకవేళ వీర్యకణాల తయారీ బాగుంటే పేషెంట్‌కు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదేమిటంటే... కొన్ని వీర్యకణాలను సేకరించి, వాటిని ల్యాబ్‌లోని ఫిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగించవచ్చు. గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో యూరాలజిస్ట్ సహాయంతో వృషణాల నుంచి కనీసం 100 వీర్యకణాలను సేకరించి, కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్లడం అనేది కూడా మరో మంచి ప్రత్యామ్నాయం. అయితే ఇందులో కూడా 10% – 20% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకని పేషెంట్ గానీ, డాక్టర్‌గానీ వీర్యంలో వీర్యకణాలు లేనప్పుడు కౌన్సెలింగ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. నాళాన్ని (వాస్‌ను) రిపేర్ చేసే సర్జరీకి దాదాపు లక్షరూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇది గనక విజయవంతం అయితే ఒకే బిడ్డ కాకుండా, ఆ తర్వాత బిడ్డలు నార్మల్‌గానే పుట్టే అవకాశం ఉంది. కానీ సక్సెస్ 10% – 20% అని మాత్రమే పేషెంట్ గుర్తెరగాలి. అలాగే టెస్ట్‌ట్యూబ్ బేబీలో 30% వరకు సక్సెస్ ఉన్నప్పటికీ ప్రతిసారీ దాదాపు లక్ష వరకు ఖర్చవుతుంది. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పేషెంట్, డాక్టర్ల మధ్య పరస్పర చర్చలు, నమ్మకం, ప్రక్రియల పట్ల అవగాహన చాలా ముఖ్యం. ఇక టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వస్తే కేవలం కొన్ని సెంటర్స్ మాత్రమే చేస్తాయి. ఇదొక టీమ్‌వర్క్. ఇందులో యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ మాత్రమే కాకుండా అత్యాధునికమైన ఎక్విప్మెంట్కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని సంతానం లేని దంపతులు అందరూ ఇలాంటి క్లిష్టమైన పద్ధతులను ఎంచుకునే ముందు రెండుమూడేళ్లు మంచి ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొంటూ, పిల్లల కోసం కాకుండా, వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిరాశపడకండి... ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండండి. పిల్లలు వారంతట వారే మీ జీవితంలోకి వస్తారు. ఒకవేళ వీర్యకణాల సంఖ్య తగ్గితే... ఒకవేళ వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం నొప్పి లేని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ అనే సమస్య ఉందా లేదా తెలుస్తాయి. వేరికోసిల్ అంటే... వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను చాలా సాధారణ శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెరుగుతుంది. అయితే కొంతమందిలో మళ్లీ స్కాన్ చేసి చూపినప్పుడు కొంత వేరికోసిల్ సమస్య మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. మాట్లాడటమే మొదటి ఔషధం... పురుషుల్లో ఉండే సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి డాక్టర్ తొలుత చేయాల్సింది పేషెంట్‌తో మాట్లాడటమే. భౌతిక పరీక్షల కంటే ముందర ఇదెంతో ప్రధానం. ఎందుకంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక విజ్ఞానం కాస్త తక్కువే. పైగా సమస్యలూ, వాటి పరిష్కారాల కోసం ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే పేషెంట్ పూర్తిగా మనసు విప్పి మాట్లాడేలా సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత ఆ దంపతుల సెక్స్ జీవితంపై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అవి... పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభనలు సరిగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక నెలలో మహిళకు రుతుస్రావం అయిన 11వ రోజు నుంచి 18వ రోజుల్లో తప్పకుండా కలుస్తూ... ఆ మిగతా రోజుల్లో కూడా క్రమం తప్పకుండా సెక్స్ చేయగలుగుతున్నారా అని కూడా తెలుసుకోవాలి. కలయిక బాగానే జరుగుతున్నప్పుడు పురుషుడి వీర్యం, మహిళ యోనిలోకి సక్రమంగానే వెళ్తోందా, లేదా అని కూడా అడిగి తెలుసుకోవాలి. పురుషుడు సెక్స్ సరిగా చేయలేకపోయినా, వీర్యం సక్రమంగా యోనిలోకి ప్రవేశించకపోయినా... మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ మొదట తెలుసుకోవాలి. పేషెంట్ నమ్మకం చూరగొని ఐదు పది నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు తెలుస్తాయి. ఆ మాటల్లోనూ కొన్నిసార్లు కొన్ని కారణాలు తెలిసే అవకాశాలుంటాయి. -
అమ్మ కావాలని ఉందా?
అమ్మ కావడం చాలామందికి సులువు. కొందరిలో సమస్య ఉంటుంది.ఎదురుచూపు ఉంటుంది.అడ్డంకులు ఏమిటో బోధ పడవు.వైద్య సహాయానికి వెళితే సమస్య ఏమిటో తెలుస్తుంది.అది గర్భాశయంలో లోపం కావచ్చు, ట్యూబుల్లో అడ్డంకి కావచ్చు,ఫలదీకరణ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడీ కావచ్చు.డాక్టర్ని కలవండి. అవగాహన పెంచుకోండి. ఆనందంగా మాతృత్వపు మాధుర్యం అనుభవించండి. గత వారం సంతానలేమి తాలూకు కొన్ని అంశాల గురించి చర్చించాం. ‘అండాల విడుదలలో ఎదురయ్యే సమస్య’ గురించి, వాటికి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే మరికొన్ని అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం. గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకు ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. ఉదాహరణకు... గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే మ్యూకస్ స్రావాలు మరీ చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోనిలోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉండటం వల్ల అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. కొంతమందిలో సర్విక్స్ దగ్గర వీర్యకణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ–స్పెర్మ్ యాంటీబాడీస్ ఉంటాయి. అవి వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోకి వెళ్లనివ్వవు. మరికొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు (యుటెరైన్ సెప్టమ్) వంటి సమస్యలు ఉండటం వల్ల... అవి ఉన్న స్థితి (పొజిషన్), పరిమాణం (సైజు) వంటి అంశాలు గర్భధారణకు అడ్డుగా నిలవవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను బట్టి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. పరీక్షలు/చికిత్స: స్పెక్యులమ్, వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా యోని, సర్విక్స్ భాగంలో ఉండే ఇన్ఫెక్షన్, పూత, గీరుకుపోయినట్లుగా అయ్యే పుండు (ఎరోజన్), సర్వైకల్ పాలిప్ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే పాప్‌స్మియర్ పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. కేవలం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడటం వల్ల సమస్య సమసిపోతుంది. దీంతో పుండు తగ్గకపోతే అప్పుడు క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) చికిత్స అవసరమవుతుంది. పాలిప్ (కండపెరగడం) వంటి సమస్యలు ఉంటే, వాటిని శస్త్రచికిత్సతో తొలగించాలి. గర్భాశయ ముఖద్వారం కొందరిలో మరీ సన్నగా (సర్వైకల్ స్టెనోసిస్) ఉన్నప్పుడు దానిని డీ అండ్ సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా వెడల్పుచేయడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్, పూత, పుండు ఉన్నప్పుడు సర్విక్స్‌లో స్రవించే ద్రవాలు సరిగా లేకపోవడం వల్ల చికిత్స తీసుకున్నా గర్భం రాకపోతే ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) అనే పద్ధతి ద్వారా వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. పెల్విక్ స్కానింగ్ చేయడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి అనేక సమస్యలు తెలుస్తాయి. అవసరమైతే 3డీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి, సమస్య తీవ్రతను నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను నిర్ధారణ చేసి, అదే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. లేదా పాత పద్ధతుల్లోనే పొట్టను కట్ చేయడం ద్వారా సర్జికల్ పద్ధతిలో వాటిని తొలగించవచ్చు. ఇక హిస్టరోస్కోప్ ద్వారా గర్భాశయం లోపలి పొరలో ఉండే పాలిప్స్, సెప్టమ్ (అడ్డుపొర), అడ్హెషన్స్ (అతుకులు), సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలను నిర్ధారణ చేసుకొని, వాటిని తొలగించవచ్చు. ఇలా గర్భధారణకు అడ్డుపడే అంశాలను కనుగొని, వాటిని తొలగిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే...: అన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ పొరలో ఉన్నప్పుడు (సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) వాటిని తొలగించాల్సి వస్తుంది. గర్భాశయ కండరాల్లో ఉన్నవి (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) 5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, సర్విక్స్ భాగంలో ఉండి, వీర్యకణాలను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుపడటం, పిండం పెరగకుండా చేయడం వంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న ఫైబ్రాయిడ్లు, గర్భాశయం బయటకు ఉన్నవీ (సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్) గర్భం రావడానికి పెద్దగా అడ్డుపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి ఆపరేషన్ కచ్చితంగా చేయాలని ఏమీలేదు. ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్నప్పుడు, కొందరిలో గర్భాశయం లోపలిపొర (ఎండోమెట్రియమ్) కడుపులోకి వెళ్లడం, మరికొందరిలో గర్భాశయం బయటా, అండాశయం పైనా, ఇలా పలుచోట్ల అతుక్కొని నెలనెలా రుతుస్రావం సమయంలో లోపలివైపున రక్తస్రావం అయి, అక్కడ అండాశయంలో చాక్లెట్ సిస్ట్లూ, ట్యూబ్స్, గర్భసంచి, పేగులు... ఇలా అన్నీ అంటుకుపోయి అండం నాణ్యత, విడుదలలో, ఫలదీకరణలో ఇబ్బందులు ఏర్పడి, గర్భం రాకపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు అండాశయం నుంచి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ట్యూబ్‌లను ఫెలోపియన్ ట్యూబ్‌లు అంటారు. అండం అండాశయం నుంచి ఈ ట్యూబ్‌లలోకి చేరుతుంది. యోని నుంచి శుక్రకణాలు, గర్భాశయంలోనుంచి ట్యూబ్‌లలోకి చేరుతాయి. అండం, శుక్రకణంతో కలిసి, ట్యూబ్‌లో పిండంగా మారాక అది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరలోకి చేరిపోయి, శిశువుగా పెరుగుతుంది. గర్భం దాల్చడంలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కూడా కీలకమైన భూమిక పోషిస్తాయి. అందుకే ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు కూడా గర్భం రావడంలో అవరోధాలు కలిగిస్తాయి. గర్భాశయం నుంచి లేదా పొట్టలోని పేగుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫెలోపియన్ ట్యూబ్స్కి చేరి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల వాటి పనితీరు తగ్గుతుంది. అప్పుడు ట్యూబ్స్ వాయడం, తర్వాత అవి మూసుకుపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు కడుపులో ఏదైనా అపరేషన్ జరిగి ఉంటే ఆ కారణంగా, లేక ఎండోమెట్రియోసిస్‌తో కొందరిలో అతుకులు (అడ్హెషన్స్) ఏర్పడటం వల్ల ట్యూబ్స్ అండాశయాలకు దూరంగా జరుగుతాయి. దాంతో అండం ట్యూబ్లోపలికి ప్రవేశించదు. నిర్ధారణ ఇలా: ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయా లేదా తెరచుకుని ఉన్నాయా తెలుసుకోడానికి హిస్టరోసాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్‌రే లేదా సోనోసాల్పింగోగ్రామ్ (ఎస్ఎస్జీ) అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో పరీక్ష చేసినప్పుడు పొట్టకండరం బిగుసుకుపోవడం వల్ల ట్యూబ్స్ బిగుసుకుపోయినట్లయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయని (అడ్డంకులు ఏర్పడ్డాయని) తప్పుడు రిపోర్ట్ రావచ్చు. చికిత్స: ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే, దాన్ని నిర్ధారణ చేసుకోడానికి లాపరోస్కోపీ ప్రక్రియలో డై–టెస్ట్ చేస్తారు. ఇందులో అడ్డంకి (బ్లాక్) ఎక్కడుందో చూసి, హిస్టరోస్కోపీ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్ కాన్యులేషన్ అనే ప్రక్రియతో దాన్ని తెరవడానికి ప్రయత్నించవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడుతుంది. కొందరిలో సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరి (హైడ్రో సాల్పింగ్), అవి వాచి, మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చికిత్స చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కారణం... ట్యూబ్స్ పాడైపోయి, వాటి పనితీరు సరిగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో గర్భం వచ్చినా అది ట్యూబ్స్‌లో ఇరుక్కుపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్యూబ్స్‌లో కనీసం ఒక్కటైనా తెరచుకొని ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్స్ రెండూ మూసుకుపోయినప్పుడు, అలాంటివారిలో గర్భం కోసం ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కొందరిలో ఐవీఎఫ్‌కు వెళ్లేముందు ట్యూబ్స్‌లో హైడ్రోసాల్పింగ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే, ట్యూబ్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే దానిలోనుంచి వచ్చే ద్రవం పిండం గర్భాశయంలో అతుక్కోకుండా చేస్తుంది. మానసిక కారణాలు మహిళల్లో కనిపించే మానసిక ఒత్తిడి అంశం కూడా గర్భధారణపై చాలావరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, గర్భం రాలేదని బంధువుల, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, మానసిక వ్యథ వంటి కారణాల వల్ల గర్భధారణకు మొదటి నుంచీ అవసరమైన హార్మోన్ల విడుదలలో అసమతౌల్యత ఏర్పడి అండం విడుదల కాదు. అలాగే ఫలదీకరణ, ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇలాంటి వారికి బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా, లోపల విడుదల కావాల్సిన హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భం రావడంలో ఆలస్యమవుతుంది. అందుకే మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలను దరిచేరనివ్వకూడదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు (వారితో పాటు ఇలాంటి సమస్యను దరిచేరనివ్వకూడదని భావించే సాధారణ ఆరోగ్యవంతులు కూడా) యోగా, ధ్యానం, వాకింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవసరమైతే కౌన్సెలింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. దాంతో మనకు తెలియకుండానే అసమతౌల్యత తొలగిపోయి, హార్మోన్లు సరిగా పనిచేసి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంప్లాంటేషన్ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా వచ్చే అండం అక్కడ శుక్రకణాలతో కలిశాక పిండంగా మారి, గర్భసంచిలోకి వచ్చి అక్కడ కాస్తంత పరుపులాగా తయారుగా ఉన్న ఎండోమెట్రియమ్ పొరలోకి అంటుకుపోయి శిశువుగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అండంగా మారిన పిండం, ఎండోమెట్రియమ్లోకి అంటుకుపోవడాన్ని ‘ఇంప్లాంటేషన్’ అంటారు. కొందరిలో ఈ ఇంప్లాంటేషన్ సమస్య వల్ల కూడా పిండం పెరగక సంతానలేమి సమస్య రావచ్చు. కారణమేమిటి: కొందరిలో ఎలాంటి సమస్యలూ కనిపించకపోయినా, అన్ని పరీక్షలూ మామూలుగా (నార్మల్‌గా)నే ఉన్నా, ప్రాథమికంగా వాడే మందులు వాడినా, నేరుగా వీర్యకణాలను లోపలికి తీసుకెళ్లి వదిలే ప్రక్రియ అయిన ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) చేసినా, పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు తీసుకెళ్లే ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) జరిపినా, లేదా వీర్యకణాలను నేరుగా అండంలోకే ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టే ఇక్సీ (ఐసీఎస్ఐ – ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) పద్ధతి ద్వారా పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు పంపినా గర్భం రాకపోవచ్చు. కొందరిలో గర్భాశయం పిండాన్ని స్వీకరించదు. ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఇందుకోసం అనేక రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పిండం ట్యూబుల్లోకి వచ్చి, గర్భాశయంలో అంటుకుంటేనే అది శిశువుగా రూపొందడం మొదలువుతుంది. ఇంప్లాంటేషన్గా చెప్పే ఈ సమయంలో అనేక రకాల హార్మోన్లు, రసాయనాలు, కెమికల్ మీడియేటర్లు, గర్భాశయ పొరలో రక్తప్రసరణ, ఇంకా బయటకు తెలియని చాలా ప్రక్రియలు అన్నీ సరిగా ఉన్నప్పుడే గర్భధారణ జరుగుతుంది. వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినా, అందులోనూ 40% నుంచి 50% మేరకు మాత్రమే గర్భధారణ కలిగే అవకాశం ఉంటాయి. ఇంప్లాంటేషన్ సమస్యలకు చికిత్సలో భాగంగా ఐవీఎఫ్‌లో గర్భసంచిలోకి ఎండోమెట్రియమ్ పొరను ప్రేరేపించడం, పిండం పైనా, పొరకీ చిన్నగా చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి ప్రక్రియలతో పాటు గర్భాశయం పిండాలన్ని తిరస్కరించకుండా ఉండటం కోసం, స్వీకరించేలా చేయడం కోసం యాంటీఇమ్యూన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ వంటి అనేక రకాల మందులతో చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో ఎన్ని చేసినా ఇంప్లాంటేషన్ నూటికి నూరు పాళ్లు విజయవంతం కాకపోవచ్చు. ఫలదీకరణ (ఫర్టిలైజేషన్) సమస్యలు ప్రతినెలా అండాశయం నుంచి విడుదలైన అండం ట్యూబ్‌లలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి విడుదలైన తర్వాత అండం 24 గంటలు మాత్రమే జీవిస్తుంది. (అంటే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది). ఆ సమయంలో కలయిక ద్వారా విడుదలైన వీర్యకణాలు ట్యూబ్‌లలోకి చేరి అండాన్ని చుట్టుముడతాయి. అనేక వీర్యకణాల నుంచి విడుదలయ్యే హైలురానిక్ యాసిడ్ వంటి అనేక ఎంజైములు... అండం మీద చిల్లుపడేలా చేస్తాయి. అందులోనుంచి ఒక్క వీర్యకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే చిల్లు మూసుకుపోతుంది. అలా ఒక వీర్యకణం, అండం కలిసి ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాగానీ గర్భం రాకపోవచ్చు. ఈ ప్రక్రియలో శుక్రకణాలు గర్భాశయంలో వెళ్లిన తర్వాత అక్కడ వాటి సంఖ్య తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత (క్వాలిటీ), కదలిక (మొటిలిటీ) సరిగా లేనప్పుడు, వాటి నుంచి విడుదలయ్యే ఎంజైములు సరిగా ఉండనప్పుడు గర్భం రాదు. అలాగే అండం నాణ్యత సరిగా లేకపోయినా, అండంపైన పొర బాగా మందంగా ఉన్నా ఫలదీకరణ జరగకపోవచ్చు. వీర్యకణాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు జీవించి ఉంటాయి. ఫలదీకరణ లోపాలను తెలుసుకోవడం మామూలుగా కష్టం. పరీక్షలలో వేరే సమస్యలు ఏవీ కనిపించనప్పుడు దంపతులకు ఒక కోర్స్ యాంటీబయాటిక్, మల్టీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ మాత్రల వంటి రకరకాల మందులు ఇచ్చి చూడటం జరుగుతుంది. అన్ని రకాలుగా ప్రయత్నించినా ఐయూఐ చికిత్స చేసినా గర్భం రానప్పుడు ఫలదీకరణలో సమస్యలు ఉన్నట్లుగా భావించి, ఆ దంపతులకు ఐవీఎఫ్, ఇక్సీ (ఐసీఎస్ఐ / టెస్ట్‌ట్యూబ్ బేబీ) పద్ధతులను సూచించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అండాలను శుక్రకణాలను మైక్రోస్కోప్ కింద విశ్లేషించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కొన్ని లోపాలను సైతం గుర్తించే అవకాశం ఉంది. అందులో అనేక అండాలను, శుక్రకణాలను నేరుగా ల్యాబ్‌లో అనేక న్యూట్రిషన్ మీడియాలో కలిపి చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా ఫలదీకరణ సమస్యలను అధిగమించవచ్చు. అయినా ఫలదీకరణ కాకపోవడం జరగడం, వాటి నాణ్యత బాగా లేకపోయినా, అవసరమైతే దాతల నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను కూడా దంపతులు ఆమోదిస్తే వాడి చూడవచ్చు. తెలియని కారణాలు: (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ): కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా, ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయినా ఎంతకూ గర్భం రాదు. ఇందుకు కారణాలు తెలియదు. డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్ -
పెళ్లికి ముందే నిల్వ చేసుకోవడం ఉత్తమం
సాక్షి, సిటీబ్యూరో: వివాహాన్ని వాయిదా వేసుకునే యువతీ, యువకులు భవిష్యత్తు అవసరాల కోసం ముందే తమ అండం, వీర్యకణాలను భద్రపరుచుకోవడం ద్వారా 35 నుంచి 40 ఏళ్ల తర్వాత కూడా సంతానాన్ని పొందగలిగే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి చిరుమామిళ్ల అన్నారు. మంగళవారం నోవా ఇన్ఫెర్టి లిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల పేరుతో చాలా మంది యువతీ, యువకులు వివాహాన్ని వాయిదా వేసుకోవడం, ఒక వేళ పెళ్లి చేసుకున్నా..పిల్లలను కనడం వాయిదా వేసుకుంటున్నారన్నారు. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాశయాలు, పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గి తీరా పిల్లలు కావాలనుకునే సమయంలో పుట్టకుండా పోతున్నారన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందున వల్ల చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదని, ఆ సమయంలో చికిత్స కోసం వచ్చినా వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నా రు. ఇటీవల ఈ తరహా కేసులు నగరంలో ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. దంపతులకు ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన లేనందున వారు నష్ట పోతున్నట్లు తెలిపారు. పెళ్లి సహా పిల్లలను వాయిదా వేసుకునే దంపతులు ముందే(25 ఏళ్లలోపు)తమ అండాలు, వీర్య కణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలను పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. -
‘శుక్ర’ గ్రహణం
ఐటీ కంపెనీలో పని చేస్తున్న రవీంద్రకు పెళ్లై ఐదేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దంపతులిద్దరూ డాక్టర్‌ను సంప్రదించారు. వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోవడమే దీనికి కారణమని వారు తేల్చి చెప్పారు. ఉప్పల్‌కు చెందిన సతీష్, కూకట్‌పల్లికి చెందిన అశోక్‌కు వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదు. ఈ సమస్య వీరిద్దరిదే కాదు నగరంలోని ఐటీ దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఎక్కువ మంది యువకులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వృషణాలకు ఇంతకన్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదైన కారణంతో వృషణాల వద్ద వేడి పెరిగితే అందులో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గడం ఖాయమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. యువకుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల నుంచి వెలువడే రేడియేషనే ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్: నగరంలో పలువురు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న చాలామంది వీర్యకణాల తగ్గుదల సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీళ్లు పైకి చూడ్డానికి శారీరక దృఢత్వం, ఆరోగ్యంగా కన్పించినా.. వీరిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతోంది. టైట్ జీన్స్ వేసుకోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు రోజంతా కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో పనిచేయడంతో వాటి నుంచి వెలువడే రేడియేషన్ స్త్రీ, పురుషుల హార్మన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం 2010లో 15శాతం మంది యువకుల్లో వీర్యకణాల తగ్గుదల కనిపించగా.. 2014లో అది 25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. 2020 నాటికి 50 శాతం మంది యువకుల్లో వీర్యకణాలు తగ్గే ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రకటించింది. నిజానికి ఆరోగ్యవంతమైన 70 కిలోల యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్‌కు 39 మిలియన్ల శుక్ర కణాలుంటాయి. కంప్యూటర్, సెల్‌ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్‌తో చాలా మంది యువకుల్లో 15 మిలియన్ల కంటే (లో స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఒకవేళ ఆశించినస్థాయిలో కణాలు ఉన్నప్పటికీ.. వాటిలో చలనం ఉండటం లేదు. ప్రధానంగా సంతాన లేమికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఐటీ, అనుబంధ రంగాల్లోనే అధికం.. ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరగకముందే పిల్లల్ని కనేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. దీనికి తోడు గంటల తరబడి ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేస్తుండటంతో ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తోంది. ఆకలేసినప్పుడల్లా క్యాంటిన్లో రెడీమేడ్‌గా దొరికే పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో ఇది స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో మద్యం అతిగా తీసుకోవడంతోనూ శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇలా పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్న బాధితుల్లో అత్యధికులు ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారే కావడం విశేషం. -
ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందా?
‘బేబి వెయిట్’ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను సన్నగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డ మంచిలావుతో బొద్దుగా ఉండాలనుకుంటున్నాను. ఇది సాధ్యమేనా? బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నందిత, ఆళ్లగడ్డ బిడ్డ బరువు అనేది తల్లి తీసుకునే ఆహారం, తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా సరిగా ఉండటం, బిడ్డకు రక్తం వెళ్లే రక్తనాళాలు సరిగా వ్యాకోచించి ఉండటం, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తల్లిలో బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనత, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉండటం వంటి అనేక అంశాల మీదా ఆధారపడి ఉంటుంది. ఆహారంలో రోజూ ఎక్కువగా పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆహారాన్ని రోజూ కొద్దికొద్దిగా రెండు గంటలకోసారి తీసుకుంటూ ఉండాలి. కొంతమందిలో వారి శరీరతత్వాన్నిబట్టి ఆహారం ఎంత తీసుకున్నప్పటికీ తల్లి బరువే పెరుగుతుంది కానీ ఆహారం బిడ్డకు చేరదు. దాంతో బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. మా కజిన్ abnormal uterine bleeding(aub) సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య గురించి వినడం ఇదే మొదటిసారి. ఇది ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలు ఏమిటి? – పి.చందన, పిడుగురాళ్ల పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నెలకోసారి మూడు నుంచి అయిదు రోజుల వరకు అవ్వడం సాధారణం. కానీ కొంతమందిలో క్రమం తప్పి, బ్లీడింగ్ త్వరత్వరగా అంటే నెలకు రెండుసార్లు లేదా ఇరవై రోజులకోసారి బ్లీడింగ్ ఎక్కువగా ఎక్కువ రోజులు అవ్వడం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే అబ్నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అంటారు. తెలియకుండా అబార్షన్ అయ్యి ముక్కలు ఉండిపోవడం, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్, పాలిప్ వంటి కంతులు, ఎండోమెట్రియోసిస్, నీటి బుడగలు, అండాశయం, గర్భాశయ ఇన్ఫెక్షన్లు, గర్భాశయ క్యాన్సర్ (45 ఏళ్లు దాటిన తర్వాత), రక్తం గూడుకట్టే ప్రక్రియలో సమస్యలు, మానసిక ఒత్తిడి, అధిక బరువు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అబ్నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అవ్వొచ్చు. వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి జనరల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, రక్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి ఇతర అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్నిబట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా ఉండేందుకు మన చేతిలో ఏమీ ఉండదు. కాకపోతే సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల, సమస్య జటిలం కాకుండా ఉంటుంది. అలాగే నివారణలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఒకవేళ అధిక బరువు ఉంటే తగ్గడం, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మా ఆయన బాగా తాగుతాడు. తాగుడు ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని, అవయవలోపాలతో పుట్టే అవకాశాలు ఉండొచ్చునని ఒక్కరిద్దరు అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియజేయగలరు. ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? – కేఆర్, హైదరాబాద్ మగవారు బాగా మందు తాగడం వల్ల వీర్యకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉండొచ్చు. అలాగే వీర్యకణాల నాణ్యత తగ్గిపోవచ్చు. నాణ్యత తగ్గిపోవడం వల్ల కొందరిలో, అవి అండంలో కలిసి పిండం ఏర్పడినప్పుడు పిండం సరిగా తయారు కాకపోవడం, పిండం సరిగా పెరగకుండా ఉండటం, జన్యుపరమైన లోపాలు ఏర్పడి మొదటి మూడు నాలుగు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో పిండం పెరిగేకొద్దీ జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే గర్భం కోసం ప్రయత్నం చేయక ముందు నుంచే, మందు తాగడం మానెయ్యడం మంచిది. మరీ పూర్తిగా మానెయ్యలేకపోతే వీలైనంత వరకు ఎంత తక్కువ తాగితే అంత మంచిది. గర్భం వచ్చిన తర్వాత సమస్యలు రాకుండా చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు ఉండవు. వీర్యకణాల్లో నాణ్యత లేకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటే ఎలాగైనా అవి వచ్చే తీరుతాయి. బిడ్డలో కొన్ని రకాల సమస్యలు ముందే తెలుసుకోవడానికి స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. కానీ వీటిలో నూటికి నూరుశాతం సమస్యలు తెలియవు. కొన్ని సమస్యలు బిడ్డపుట్టిన తర్వాత పెరిగేకొద్దీ బయటపడతాయి. కాబట్టి గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మందు తాగటం మానెయ్యడం ఒక్కటే మార్గం. -
ఆ కౌంట్ తగ్గితే... ఆలిగోస్పెర్మియా?
నా వయుస్సు 21 ఏళ్లు. వృషణాల్లో వాపు వస్తే డాక్టర్‌కు చూపించుకున్నాను. నాకు వేరికోసిల్ ఉందని అన్నారు. అల్ట్రా సౌండ్ హైఫ్రీక్వెన్సీ (స్క్రోటమ్) చేరుుస్తే ఎడవువైపున గ్రేడ్-3, కుడివైపున గ్రేడ్-1 వేరికోసిల్ అని రిజల్ట్ వచ్చింది. ఆపరేషన్ అవసరవుని రెండువైపులా చేశారు. నెలరోజులు విశ్రాంతి కావాలన్నారు. వృషణాల్లో అప్పడప్పుడూ నొప్పి వస్తూనే ఉంది. నా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఆర్.వి.వి., అనంతపురం జ: వృషణాల్లోని రక్తనాళాల్లో (వెరుున్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, క్వాలిటీ తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను ఆపరేషన్ ద్వారా సరిచేస్తారు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం అవారుుడ్ చేయుండి. వుూడు నెలల తర్వాత అన్ని పనులూ వూమూలుగానే చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లో దుస్తులు వేసుకొవ్ముని చెబుతాం. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు. నా వయసు 28 ఏళ్లు. ఇటీవలే నా భార్య నెలతప్పింది. నేను ఎప్పటివరకు సెక్స్ చేయవచ్చు? నెల తప్పాక కూడా సెక్స్ చేస్తుంటే ఏమైనా ప్రమాదమా? - సి.వి.ఆర్., కర్నూలు నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలల పాటు సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. మధ్య మూడు నెలలు సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ టైమ్‌లో అసాధారణ భంగిమ (అబ్నార్మల్ పొజీషన్స్)ల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. అలాగే బలంగా స్ట్రోక్స్ ఇస్తూ చేయకుండా ఉండటం మంచిది. చివరి మూడు నెలల్లోనూ కొంతమేరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. అయితే నెల తప్పాక ఏదో టైమ్‌లో సెక్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం కలగదు. కాకపోతే బలమైన సెక్స్ వల్ల ఏదైనా అనుకోనిది జరగవచ్చేమో అని వైద్యపరంగా ఈ సలహాలు చెబుతాం. ఒకవేళ మీరు ఈ టైమ్‌లో సెక్స్ చేసినా దాని గురించి అనవసరంగా ఆందోళన పడకండి. పైపైనే సెక్స్ చేయడం, ఒకరినొకరు సెక్స్‌పరమైన ప్రేరేపణలు చేసుకుని ఆనందించడం వల్ల ప్రమాదం ఉండదు. మీ ఇద్దరూ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. నాకు 22 ఏళ్లు. ఇటీవలే ఒక అమ్మాయితో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నాను. పది రోజుల తర్వాత మూత్రంలో మంట మొదలైంది. ఈ సంఘటన జరిగి మూడు నెలలు అవుతోంది. ఆ అమ్మాయికి వేరే అబ్బాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది. ఆ విషయం తెలిశాక హెచ్ఐవీ వస్తుందేమో అని భయం వేసి, ఒకసారి ల్యాబ్‌లో పరీక్ష చేయించాను. నెగెటివ్ అని చెప్పారు. అయితే విండో పీరియడ్‌లో రిజల్ట్ చక్కగా రాదని విని మళ్లీ ఆందోళన మొదలైంది. విండో పీరియడ్ అంటే ఏమిటి? నాకు హెచ్ఐవీ లేదని కన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా పరీక్షలు చేయించాలా? - జీ.ఆర్.కె., హైదరాబాద్ హెచ్ఐవీ నిర్ధారణ విషయంలో హెచ్ఐవీ ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ పరీక్షలు అన్నవి కొంచెం కచ్చితంగా, త్వరగా నిర్ధారణ చేయగలిగే పరీక్షలు. విండో పీరియడ్ అంటే వ్యాధి సోకాక అది పరీక్షల ద్వారా బయటపడటానికి మధ్యన ఉండే సమయం అని అర్థం. అంటే... విండో పీరియడ్‌లో పరీక్ష చేయిస్తే ఒకవేళ శరీరంలో హెచ్ఐవీ కారక ఇన్ఫెక్షన్ ఉన్నా అది పరీక్షల్లో మాత్రం తెలియదన్నమాట. ఎలీసా టెస్ట్‌లో ఈ విండో పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్నెల్ల వరకు కూడా పట్టవచ్చు. అదే వెస్ట్రన్ బ్లాట్ అయితే కొన్ని వారాల లోపే తెలుస్తుంది. అందుకే సెక్స్ తర్వాత వెస్ట్రన్ బ్లాట్గాని, ఎలీసాగాని మొదట చేయించి, ఆ తర్వాత మూడు నెలలకోసారి, ఆర్నెల్ల తర్వాత మరోసారి చేయించి... ఆ మూడు పర్యాయాలూ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వస్తే ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు. అంతేగాకుండా ఆ అమ్మాయి మీ గర్ల్‌ఫ్రెండే అంటున్నారు కాబట్టి వీలైతే మీతోపాటు సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయికి కూడా అవే పరీక్షలు చేయించేలా ఒప్పించగలిగితే మంచిది. ఆమెకు కూడా ఫలితం నెగెటివ్ అని వస్తే మీరు (ఆమె కూడా) మరింత సురక్షితంగా ఫీల్ కావచ్చు. పెళ్లి వరకూ సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం అన్నది అటు శారీరక ఆరోగ్యానికీ, ఇటు నైతిక, సామాజిక ఆరోగ్యానికి కూడా మంచిదని గుర్తుంచుకోండి. నా వయుస్సు 27 ఏళ్లు. నాకు మొలల (పైల్స్) సవుస్య ఉంది. కొన్నాళ్లు వుందులు వాడాను. రక్తం పడటం తగ్గింది. కానీ గత కొన్నాళ్లుగా సెక్స్ కోరికలు తగ్గారుు. శరీరంలో రక్తం పాళ్లు తగ్గడం వల్ల ఇలా అవుతుందా? అవ్మూరుులను చూస్తే ఏమీ అనిపించడం లేదు. ఓ వస్తువును చూస్తే ఎలా ఉంటుందో వాళ్లను చూసినా అంతే. నా సవుస్యకు పరిష్కారం చెబితేనే పెళ్లిచేసుకుంటాను. - జె.ఎన్. హైదరాబాద్ జ: పైల్స్ దీర్ఘకాలికంగా ఉన్నవాళ్లలో ఎక్కువ రక్తం పోవడం వల్ల బలహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది సెక్స్‌లోనూ బలహీనవుయ్యేందుకు ఆస్కారం ఇస్తుంది. కాకపోతే శరీరంలో రక్తహీనత బాగా ఎక్కువై హిమోగ్లోబిన్ పాళ్లు 10 ఎంజీ/డెసిలీటర్ ఉన్నప్పుడే ఈ సవుస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్లు హైపర్థైరారుుడిజం ఉన్నా సెక్స్ కోరికలు, పెర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు ఉన్నారుు. వుుందు పైల్స్‌కు ఆపరేషన్ చేరుుంచుకొని, థైరారుుడ్ సవుస్యకు చికిత్స తీసుకుంటే తర్వాత మీలో సెక్స్ సావుర్థ్యం నార్మల్‌గా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా వయుస్సు 26 ఏళ్లు. వూకు ఇంకా పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేరుుంచుకున్నాం. ఆమెకు ఎలాంటి సవుస్య లేదని చెప్పి... నాకు వూత్రం వీర్యకణాల సంఖ్య తక్కువ అన్నారు. మొదటిసారి టెస్ట్‌లో స్పెర్మ్ కౌంట్ 60,000 వచ్చింది. డాక్టర్ ఇచ్చిన వుందులు వాడాను. రెండు నెలల తర్వాత వుళ్లీ పరీక్షలు చేరుుస్తే పది మిలియున్లకు పెరిగింది. తర్వాత కూడా వుందులు వాడాను. అరుుతే వుళ్లీ రెండు నెలల తర్వాత పరీక్ష చేరుుస్తే ఆరు మిలియున్లు వూత్రమే ఉన్నట్లు తేలింది. ఇలా తగ్గడానికి కారణం ఏమిటని అడిగితే డాక్టర్ గ్యారంటీ ఏదీ చెప్పలేవుని అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్.కె.ఆర్., చిత్తూరు జ: మీరు ఆలిగోస్పెర్మియూ అనే సవుస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 60 మిలియున్ నుంచి 120 మిలియున్ల వరకు వీర్యకణాలు ఉండాలి. అరుుతే వీటి సంఖ్య 20 మిలియున్ల కంటే తగ్గితే పిల్లలు కలిగే అవకాశాలు తక్కువ. వీర్యకణాలు తగ్గడానికి సాధారణంగా- వేరికోసిల్, ఇన్ఫెక్షన్లు, హార్మోన్లలోపం వంటివి కారణవువుతారుు. మీకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు, వురికొన్ని రక్తపరీక్షలు చేసి... ఏ సవుస్య వల్ల మీకు వీర్యకణాల సంఖ్య తగ్గిందో నిర్ధారణ చేయూలి. సవుస్య వేరికోసిల్ అరుుతే సర్జరీ ద్వారా, హార్మోన్ల లోపం అరుుతే ఇంజెక్షన్ల ద్వారా చికిత్స చేసి వీర్యకణాల సంఖ్యను పెంచగలిగితే... అందరిలాగే మీకూ పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వీర్యకణం నాణ్యత లోపించినా ప్రమాదమే!
సెమెన్ డీమన్ ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉన్నవారితో పోలిస్తే... లోపాల తో కూడిన వీర్యక ణాలున్న పురుషులకు మృత్యువు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. అధ్యయనవేత్తలు 11,935 మంది పురుషులపై రెండేళ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీర్యం నాణ్యత, శుక్రకణాల కదలికలు (మొటిలిటీ), వాటి ఆకృతి, వాటి సంఖ్య (స్పెర్మ్ కౌంట్)... ఈ నాలుగు అంశాలను పరిశీలించారు. పై నాలుగు అంశాలలో ఏ లోపం లేనివారు చాలాకాలం పాటు జీవిస్తారనీ... ఇందులో ఏ అంశంలో లోపం ఉన్నా వారికి మృత్యువు త్వరగా వస్తుందని తేల్చారు. ఉదాహరణకు పైన పేర్కొన్న నాల్గింటిలో ఏ రెండింటిలో లోపాలున్నా మిగతావారితో పోలిస్తే వారికి మృత్యుప్రమాదం (రిస్క్) రెండింతలు ఎక్కువని తేలింది. ఈ పరిశోధన ఫలితాలన్నీ ‘హ్యూమన్ రిప్రొడక్షన్’ అనే మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
ఎదురీతలో మొనగాళ్లు.. శుక్రకణాలే!
నదీ ప్రవాహానికి ఎదురీదడం చాలా కష్టం కదూ. కానీ, అలా ఎదురీదడంలో శుక్రకణాలు చాలా ముందంజలో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమ గర్భోత్పత్తిలో ఉపయోగించే వాటికన్నా కూడా సాధారణ శుక్రకణాలే వేగంగా ఈదుతాయని తేల్చి చెప్పారు. సరైన ప్రవాహ వేగాన్ని సృష్టించగలిగితే, శుక్రకణాలు చాలా నిమిషాల పాటు ఎదురీత చేయగలవని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కల అసిస్టెంట్ ప్రొఫెసర్ జార్న్ డంకెల్ తెలిపారు. లక్షలాది శుక్రకణాల్లో చాలా తక్కువ మాత్రమే సరిగా ఈదలేవని, అవి తమ గమ్యాన్ని కూడా సరిగా చేరుకోలేవని వివరించారు. ఇవి సరైన దిశలో ఈదడమే కాక, తమ పొడవు కంటే వెయ్యిరెట్లు ఎక్కువ దూరం వరకు కూడా వెళ్లగలవు. అవి వెళ్లే మార్గంలో రకరకాల రసాయనాలు, కెరటాలు ఎదురవుతాయి. శుక్రకణాల సామర్థ్యాన్ని అర్థం చేసుకోడానికి శాస్త్రవేత్తలు వివిధ పరిమాణాలు, ఆకారాల్లో ఉండే మైక్రో ఛానళ్లను ఏర్పాటుచేసి, వాటిలోకి వీటిని వదిలారు. వాటిలోకి ట్యూబుల ద్వారా ద్రవాలను వదిలి, శుక్రకణాలు వేర్వేరు కెరటాల వేగానికి ఎలా స్పందిస్తాయో చూశారు. -
వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం
30 ఏళ్ల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంతానం కలిగి ఉండడం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈకాలం చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం - మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వలన మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో ‘త్రి ఉపస్తంభాలు’ అనే ఒక ఆరోగ్య రహస్యం మహర్షులు చెప్పారు. అవి - ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. మానవులు ఆరోగ్యకరమైన (సమతుల్య ఆహారం) అహారం, సరియైన సమయంలో తగు ప్రమాణంలో ( 6 గం. - 8గం.) నిద్రపోవడం, అలాగే బ్రహ్మచర్యం పాటించడం (అనగా ప్రాకృతిక నియమాలు) ఉదా: దినచర్య / ఋతుచర్యలను పాటించడం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా భారతీయులను కూడా ఈ సమస్య పీడిస్తోంది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. అది తిరిగి మానవులకే హాని కలిగిస్తుంది. తద్వారా పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గటాన్ని ‘ఓలిగో స్పెర్మియా’ అని, అసలు కణాలు లేనట్లయితే ‘ఆజోస్పెర్మియా’ అని, కదలిక సరిగా లేనిచో ‘అస్తినోస్పెర్మియా’ అని, కణాల స్వరూపం మార్పులు ఉన్నట్లయితే ‘టెరిటో స్పెర్మియా’ అని అంటారు. ఆయుర్వేద శాస్త్రంలో శుద్ధ శుక్రకణాల యొక్క వివరణలు, అలా శుక్ర కణాల దోషాల గురించి అతి విస్తారంగా చరక, సుశ్రుత, వాగ్భట మహర్షులు చర్చించారు. చరక మహర్షి పురుషులలో సంతానలేమికి నాలుగు ప్రధాన కారణాలు చెప్పారు. 1. బీజోపఘాతం (వీర్యకణాలలో సంఖ్య, కదలికల్లో నాణ్యత లోపాలు) 2. శుక్ర సంక్షయ (వీర్య ప్రమాణంలో తగ్గుదల) 3. ధ్వజోపఘాత (అంగ స్తంభన సమస్యలు) 4. జరా (ముసలితనం) పై కారణాలలో బీజదోషం గురించి, ఇంకా సమగ్రత గురించి చర్చించారు. వాటిని శుక్ర దోషాలుగా వర్ణించారు. అవి సంఖ్యాపరంగా చూసినట్లయితే 8 విధాలుగా చెప్పవచ్చు. వాతదోషం వల్ల 3 సమస్యలు - నురుగుతో కూడిన వీర్యం, పలుచగా ఉండే వీర్యం, రూక్షత (dryner) కలిగిన వీర్యం అనేవి. ఈ వాత దోషంచే నొప్పితో కూడిన వీర్యం స్వల్పంగా వెలువడుతుంది. పిత్తదోషం వల్ల 2 సమస్యలు - దుర్గంధయుక్త వీర్యం (pus cell), వివర్ణత (సహజవర్ణం మారుట) అనేవి. ఇక్కడ పిత్తదోషంచే మంటతో కూడిన వీర్యం వెలువడుతుంది. కఫదోషం వల్ల అతి జిగురు కలిగిన వీర్యం (viscosity పెరుగుట) అనే సమస్య. ఇక్కడ వీర్యం చల్లగా వెలువడుతుంది. రక్తదోషంచే వీర్యంలో ఎర్ర రక్తకణాలు వెలువడతాయి. అలాగే - వాత కఫ దోషాలచే వీర్యం త్వరగా ద్రవ స్వభావాన్ని పొందదు. అందుకే ఆయుర్వేదంలో శుద్ధ శుక్ర లక్షణాల గురించి ఈవిధంగా చెప్పారు. ‘స్ఫటికాభం, ద్రవం స్నిగ్ధం మధురం మర్మ గన్ధిచ’ అనగా స్వచ్ఛమైన శుక్రం, పారదర్శకంగా (స్ఫటికంలా), ద్రవత్వాన్ని, స్నిగ్ధత (viscosity)ని, మర్మరం (ph. value 7.2-7.7), గా ఉండాలని ఆచార్యులు చెప్పారు. ఈ లక్షణాలతో కూడిన వీర్యాన్ని కలిగిన పురుషులకు ఎలాంటి సందేహం లేకుండా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇందుకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక అద్భుత చికిత్సా విధానాలు, రసాయన, వాజీకరణ చికిత్సా విభాగంలో మహర్షులు వివరించారు. ముఖ్యంగా శుక్ర రేచకములు (vericocel) లాంటి సమస్యలు శుక్ర శోధకాలు (ఇన్ఫెక్షన్ను తగ్గించేవి), శుక్ర జనకాలు (కణాల వృద్ధికి, నాణ్యతకు)అనే ఔషధాలను ఆచార్యులు వివరించారు. ఇది చూర్ణ రూపంలోనూ, అస్ఫ/అరిష్ట రూపంలోనూ, వటి రూపంలోను, లోహ రూపంలో, భస్మ రూపంలో అనేక అద్భుత ఔషధాలు, అతి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే హార్మోన్ల సమస్యలలో తక్రధార, శరీర .... విరేచనం, వస్థి, ఉత్తరవస్థి లాంటి అనేక ప్రత్యేక చికిత్సా విధానాలలో ఈ శుక్రకణాల సమస్యలను అధిగమించి సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సరైన దినచర్య, ఋతుచర్య ఇత్యాది విషయాలలో కూడా ఆయుర్వేద వైద్యుల సూచనలు పాటిస్తే పురుషులలో ‘సంతానలేమి’ని జయించవచ్చు. - డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ఫోన్ : 7416 107 107, 7416 109 109 www.starayurveda.com