వీర్యకణం నాణ్యత లోపించినా ప్రమాదమే! | Risk of lack of sperm quality | Sakshi
Sakshi News home page

వీర్యకణం నాణ్యత లోపించినా ప్రమాదమే!

Published Mon, May 4 2015 12:04 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

వీర్యకణం నాణ్యత  లోపించినా ప్రమాదమే! - Sakshi

వీర్యకణం నాణ్యత లోపించినా ప్రమాదమే!

సెమెన్ డీమన్

ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉన్నవారితో పోలిస్తే... లోపాల తో కూడిన వీర్యక ణాలున్న పురుషులకు మృత్యువు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. అధ్యయనవేత్తలు 11,935 మంది పురుషులపై రెండేళ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీర్యం నాణ్యత, శుక్రకణాల కదలికలు (మొటిలిటీ), వాటి ఆకృతి, వాటి సంఖ్య (స్పెర్మ్ కౌంట్)... ఈ నాలుగు అంశాలను పరిశీలించారు.

పై నాలుగు అంశాలలో ఏ లోపం లేనివారు చాలాకాలం పాటు జీవిస్తారనీ... ఇందులో ఏ అంశంలో లోపం ఉన్నా వారికి మృత్యువు త్వరగా వస్తుందని తేల్చారు. ఉదాహరణకు పైన పేర్కొన్న నాల్గింటిలో ఏ రెండింటిలో లోపాలున్నా మిగతావారితో పోలిస్తే వారికి మృత్యుప్రమాదం (రిస్క్) రెండింతలు ఎక్కువని తేలింది. ఈ పరిశోధన ఫలితాలన్నీ ‘హ్యూమన్ రిప్రొడక్షన్’ అనే మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement