
యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్
యువ, చిన్నారి ప్రేక్షకులకు నగరంలో మహా పండుగ. ప్రఖ్యాత ‘స్టట్‌గార్ట్ ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ సిటీకి వస్తోంది. బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ఈ కలర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జర్మనీ, డెన్మార్క్, ఇరాన్, ఫ్రాన్స్‌లకు చెందిన షార్ట్ కార్టూన్స్ కూడా ఇందులో ప్రదర్శిస్తారు. జెబ్రా, హోమ్ స్వీట్ హోమ్, పాస్తా యా, మై లిటిల్ క్రోకో, లబాజ్ ఎ సాహబ్ వంటి చిత్రాలు వీటిల్లో ఉన్నాయి.
వేదిక : గోథెజంత్రమ్, బంజారాహిల్స్
సమయం : ఈ నెల 30 సాయంత్రం 6.30 గంటలకు
ప్రవేశం : ఉచితం