యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్
‘మొబైల్ యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్’... విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐనేచర్‌వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేశారు.
డిసెంబర్‌లో లాంచ్ చేసిన ఈ యాప్స్ ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఇందులో మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, భారతీయవిద్యాభవన్, చిరాక్ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొని.. యాప్ వినియోగాన్ని వివరిస్తారు.
సమయం: ఉదయం 9:30 గంటలకు
వేదిక : ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, బంజారాహిల్స్