నయనానంద వైవిధ్యం | Bamboo plants will appear in more paintings | Sakshi
Sakshi News home page

నయనానంద వైవిధ్యం

Published Tue, Sep 16 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

నయనానంద వైవిధ్యం

నయనానంద వైవిధ్యం

అక్కడ కనిపించే కొన్ని చిత్రాల్లో వెలుగునీడల జాడలు తారాడుతుంటాయి. మరికొన్ని చిత్రాల్లో వెదురు మొక్కల అందాలు నలుపు తెలుపుల్లో పలకరిస్తాయి. ఇంకొన్ని చిత్రాల్లో దృశ్యాదృశ్య సన్నివేశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. దేనికదే వైవిధ్యభరితంగా కనువిందు చేసే ఈ చిత్రాలను తీర్చిదిద్దిన చిత్రకారుడు ఒక్కరే! బెంగళూరుకు చెందిన ఆనంద్ రామలింగం చిత్రాలు నగరంలోని ఐలమ్మ గ్యాలరీలో కొలువుదీరాయి.
 సృజనాత్మక రంగంలో కొనసాగుతున్న ఆనంద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచెతో కృషి చేస్తున్న ఈ చిత్రకారుడు పన్నెండేళ్లుగా ఫొటోగ్రఫీతో పాటు సంగీత సాధన కూడా కొనసాగిస్తున్నారు. ఆనంద్ తన పెయింటింగ్స్‌తో పాటు విలక్షణమైన ఫొటోల సియానోటైప్ ప్రింట్లను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆయన ఆక్రిలిక్ రంగులతో చిత్రించిన నైరూప్య చిత్రాలతో పాటు సియానోటైప్ ప్రింట్లు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఐలమ్మ గ్యాలరీలో ఆనంద్ చిత్రాల ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement