కూలెస్ట్ సిటీ | coolest city | Sakshi
Sakshi News home page

కూలెస్ట్ సిటీ

Published Fri, Apr 3 2015 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

కూలెస్ట్ సిటీ

కూలెస్ట్ సిటీ

 అదా శర్మ.. హార్ట్‌ఎటాక్‌లో ‘హయాతి’గా అబ్బాయిల గుండెలను కొల్లగొట్టిన అమ్మాయి.
 ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన ‘సన్నాఫ్ సత్యమూర్తి సినిమా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు
 రాబోతోంది. ఈ స్టన్నింగ్ బ్యూటీ శుక్రవారంనాడు సిటీలో సందడి చేసింది. ప్రగతి నగర్‌లోని
 ‘నేచురల్స్’ స్పా అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించేందుకు వచ్చిన ఆమెతో సిటీప్లస్ చిట్‌చాట్...
 ..:: శిరీష చల్లపల్లి
 నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. నాన్న మర్చెంట్ నేవీలో కెప్టెన్. స్కూలింగ్ కేరళలోనే. సైకాలజీలో డిగ్రీ మాత్రం ముంబైలో చేశాను. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో... నాకు కథక్ డ్యాన్స్‌పట్ల ఆసక్తి అనిపించింది. దీంతో కథక్‌లోనూ డిగ్రీ చేశాను. నేను జిమ్నాస్టిస్ట్‌ను కావడంతో కథక్ సునాయాసంగా నేర్చుకోగలిగాను, చేయగలుగుతున్నాను. ప్రస్తుతం మేం ఉంటున్నది ముంబైలో. నాకు మొదటినుంచి కల్చరల్ యాక్టివిటీస్ అన్నా... పురాతన నాటకాలన్నా, డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. కళాకారులంటే గౌరవం కూడా. నిజజీవితంలోనూ నేను అల్లరి పిల్లని. బ్యూటీ సీక్రెట్స్ పెద్దగా ఏమీ లేవు. నా రూమ్‌లో కాస్మొటిక్స్ కూడా అంతగా ఉండవు.
 మోడలింగ్ చేస్తుండగా...
 నేను ఓ షోలో మోడలింగ్ చేస్తుండగా ‘1920’ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందమైన హీరోయిన్ పాత్ర అనుకున్నా. కానీ భయంకరమైన ఘోస్ట్ క్యారెక్టర్ అని తెలిశాక కొంచెం కంగారు పడ్డాను. అయితే పూర్తి కథ విన్నాక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సినిమా పూర్తయి రిలీజయ్యాక నన్ను నేను స్క్రీన్‌పై చూసుకొని... నన్ను నేను అద్దంలో చూస్కోవడానికి భయపడ్డాను. అయితే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో అందరూ గుర్తు పెట్టుకున్నారు. అలా మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డ్ రావడం ఆనందాన్నిచ్చింది.
 హార్ట్ ఎటాక్...
 కొన్ని బాలీవుడ్ సినిమాలు చేశాక పూరీ జగన్నాథ్‌గారు నాకు కాల్ చేసి... ‘ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తున్నా. అందులో హీరోయిన్‌గా నువ్వు చేయాలి’ అన్నారు. ‘నాకు తెలుగు అస్సలు రాదు!’ అని చెప్పినా... ‘నువ్వే హీరోయిన్‌వి’ అనడంతో నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. బై కో ఇన్సిడెన్స్ మూవీ పేరు కూడా హార్ట్ ఎటాక్. అలా ఆ సినిమాకోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టాను.
 కూలెస్ట్ సిటీ...
 హైదరాబాద్‌లో నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సాధారణంగా షూటింగ్‌కి అమ్మనో, గార్డియన్‌నో తోడుగా తీసుకెళ్తాను. కానీ హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్‌కి ఒక్కదాన్ని వెళ్లడానికి అస్సలు సంకోచించను. నాకు ది కూలెస్ట్ మెట్రో సిటీ హైదరాబాదే!
 ఒకే రోజు రెండు సినిమాలు...
 నేను నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈనెల 9న రిలీజ్ కాబోతోంది. అదే రోజు నేను చేసిన కన్నడ సినిమా రిలీజింగ్ కూడా ఉండటంతో కాస్త ఎగ్జైటింగ్‌గా ఉంది. బన్నీ చాలా కేరింగ్ పర్సన్! ఫ్రెండ్లీ నేచర్ తనది. ఈ మూవీలో నేను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. బాగా బబ్లీ అండ్ నాటీ క్యారెక్టర్. నాకు సమంతా అండ్ నిత్యామీనన్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ ఉన్న సినిమాలో యాక్ట్ చేయడం సంతోషంగా అనిపించింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement