
లండన్ : మెరైన్ ఫుడ్‌తో శారీరక ఆరోగ్యమే కాదు డిప్రెషన్ వంటి మానసిక అస్వస్థతలకూ చెక్ పెట్టవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. చేపలు, రొయ్యలు తీసుకోవడం ద్వారా మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అథ్యయనంలో భాగంగా 18 నుంచి 65 సంవత్సరాలున్న 3000 మంది రక్త నమూనాలను పరిశీలించగా డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేవారిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, శరీరానికి అనుసంధానం మెరుగుపరిచి శరీర నిర్వహణను, సానుకూల మూడ్‌ను మెయింటైన్ చేసేందుకు ఉపకరిస్తాయి. కుంగుబాటు, యాంగ్జైటీ డిజార్డర్లతో సతమతమయ్యేవారిలో ఒమెగా 3 లెవెల్స్ అతితక్కువగా ఉన్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. దీంతో ఒమెగా 3 యాసిడ్స్ అధికంగా ఉండే ఆయిలీ ఫిష్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే మానసిక అలజడులకు దూరం కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.డిప్రెషన్ డిజార్డర్స్‌కు పోషకాహారమే విరుగడని పరిశోధనలో తేలిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన కియో యూనివర్సిటీ న్యూరోసైక్రియాట్రిస్ట్ యుటవ మత్సుక చెప్పారు.