ఫెస్ట్ ఫర్ బెస్ట్ | Fest for Best for August fest 2014 | Sakshi
Sakshi News home page

ఫెస్ట్ ఫర్ బెస్ట్

Published Wed, Aug 27 2014 12:42 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

ఫెస్ట్ ఫర్ బెస్ట్ - Sakshi

ఫెస్ట్ ఫర్ బెస్ట్

అందలమెక్కించే ఆలోచనలు ఎన్ని ఉన్నా.. అదృష్టాన్ని వెక్కిరించే శక్తులు అడుగడుగునా ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితులను ఎదిరించలేక దురదృష్టవంతుల లిస్ట్‌లోకి చేరిపోతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారికి   సరైన అవకాశం కల్పిస్తే.. వారి సృజనాత్మకత సంచలనాలకు నాంది పలుకుతుంది. అలాంటి ఆలోచనలున్న వారికి చేయూతనిస్తోంది ఆగస్ట్ ఫెస్ట్. నలుగురు ఇంజనీర్ల ఊహాశక్తి నుంచి ఉద్భవించిన ఈ సంస్థ ఈ నెల 30, 31 తేదీల్లో ఔత్సాహిక నిపుణుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఫెస్ట్ కన్వీనర్ పెరుగు సురేష్ తమ లక్ష్యాలను ‘సిటీప్లస్’కు వివరించారు.
 
 మట్టి గణపతి ప్రతిమలనే వాడాలని కోరుతున్నారు హ్యాంప్‌షైర్ ష్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మంగళవారం పంజాగుట్టలోని ఇనిస్టిట్యూట్‌లో ర్యాంప్‌వాక్ నిర్వహించారు.
 
 సివిల్ ఇంజనీరింగ్ చేసిన నేను అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచే శాను. నా మిత్రుడు సుబ్బరాజు పేరిచర్ల ప్రముఖ కంపెనీల్లో హెచ్‌ఆర్‌గా పనిచేశాడు. ఇంకో మిత్రుడు కిరణ్‌చౌదరి గూగుల్ కంపెనీలో జాబ్‌తో సంతృప్తి పడలేదు. మరో ఇంజనీర్ స్నేహితుడు వేమూరి ఆదినారాయణ. ఓ రోజు మాట ల్లో ఉండగా మా నలుగురికి కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. అలా 2011లో సొంతంగా ఈట్ అండ్ స్లీప్ అనే స్టార్టప్ బ్రాండ్‌తో షార్ట్ ఫిలిమ్ తీశాం. అక్కడితో ఆగాలనుకోలేదు. మాలాంటి వారిని  పెద్ద కంపెనీలు ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించాం. అందుకు వేదికగా ఆగస్ట్ ఫెస్ట్ ప్రారంభించాం. గతేడాది 500 మంది ఔత్సాహికులను ఈ వేదికపైకి తెచ్చాం.
 
 సత్సంకల్పం..
 ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్, ఆర్ట్, టెక్నాలజీ రంగాల్లో మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్లు ఎందరో మన చుట్టూ ఉన్నారు. వీరిలో చాలామంది పనితనం నాలుగు గోడలకే పరిమితం అవుతోంది. అదే సమయంలో ఇలాంటి కొత్త ఐడియాల కోసం అనేక కంపెనీలు వెదుకుతున్నాయి. ఈ ఇద్దరిని ఒకే చోట చేర్చే అవకాశం ఆగస్ట్ ఫెస్ట్ కల్పిస్తుంది.
 
 చక్కటి వేదిక..
 ప్రపంచంలోనే మంచి పేరున్న నాస్కామ్.. ఈ ఔత్సాహికులను ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకూ 1,300 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 160 మందిని నాస్కామ్ గుర్తిస్తుంది. ఔత్సాహికునికి ఉన్న లక్షణాలు, చేసే ప్రాజెక్టు ఉన్న మార్కెట్ విలువ, ఏ వర్గాన్ని అది టార్గెట్ చేస్తుంది..? ఇలా అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఎంపిక జరుగుతుంది. అదే విధంగా బెంగళూరు, ముంబైకి చెందిన పలు కంపెనీలు కూడా  ఎంపికైన ప్రాజెక్టులను పరిశీలిస్తాయి. ఎంపికైన వాటికి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి షార్ట్ ఫిలిమ్స్ తీయడం సరదా. సినిమాల్లో లేని క్రియేటివిటీ అందులో కన్పిస్తుంది. దీన్ని ఆగస్ట్ ఫెస్ట్ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్ గుర్తించింది. నేరుగా సినిమాకు దర్శకత ్వం వహించే అవకాశం ఇచ్చింది. ఈసారి కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయని ఆశిస్తున్నాం. నగరంలో యానిమేషన్ రంగం జోరు పెరుగుతోంది. హాలీవుడ్ చిత్రాలకు మనవాళ్లు పనిచేస్తున్నారు. అయితే ఇంతకన్నా క్రియేటివిటీ ఉన్నవాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మేళా మా అంచనాలను అందుకుంటుదని భావిస్తున్నాం.
 
 ఎందరో ప్రముఖులు..
 ఈ ఆగస్ట్ ఫెస్ట్‌కు హైదరాబాద్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాల ప్రముఖులను వక్తలుగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు సహా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. చోటా భీం రూపశిల్పులు, నాట్యశాస్త్ర నిపుణులు, కళా రంగంలో నిష్ణాతులైన వారు.. ఇలా చాలామంది ఉన్నారు. వీళ్లంతా పారిశ్రామికీకరణ వైపు పడుతున్న అడుగులను వివరిస్తారు.
- వనం దుర్గాప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement