గ్రో.. విత్ | August Fest Red Carpet: Theme Business grow with Facebook | Sakshi
Sakshi News home page

గ్రో.. విత్

Published Mon, Sep 1 2014 3:15 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

గ్రో.. విత్ - Sakshi

గ్రో.. విత్

యువతరం ఆలోచనలకు ఆగస్ట్‌ఫెస్ట్ రెడ్‌కార్పెట్ పరిచింది. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో రెండు రోజులు సాగిన ఈ వేడుక.. ఎన్నో థీమ్స్ పంచుకునే వేదికగా నిలిచింది. ఆగస్ట్ ఫెస్ట్‌లో అందరి మన్ననలు అందుకున్న థీమ్ బిజినెస్ గ్రో విత్ ఫేస్‌బుక్.
 
 నయా బిజినెస్ సూత్రాలతో మార్కెట్‌లో దూసుకుపోతున్న మాల్స్‌కు ఫేస్‌బుక్‌ను మించిన మార్కెటింగ్ ప్లాట్‌ఫాం మరొకటి దొరకదని చెబుతున్నారు రేణుక సేనావత్, పీయూష్ గురువాణి. కేవలం సంతోషాలను, సమాచారాలను పంచుకునేందుకే కాదు.. కొనుగోలుదారులను పెంచుకోవడానికీ ఎఫ్‌బీ ఉపయోగపడుతుందని అంటున్నారు. వీరిద్దరూ పరిచయం చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ బ్రాండ్‌కు ఫెస్ట్‌లో బోలెడన్ని మార్కులు పడ్డాయి.  ఓ ముగ్గురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి వీరి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌కి ఇన్వెస్ట్ చేస్తామన్నారు. పండుగలతో, వేడుకలతో పనిలేదు.. నగరంలోని షాపింగ్ సెంటర్లు ప్రతిరోజూ ఏవో డిస్కౌంట్ల ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి.
 
  ఆ ఆఫర్లపై కామన్‌మెన్ దృష్టి పడటానికి బిజినెస్‌మెన్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఫేస్‌బుక్ ద్వారా ఈ పని సులువవుతుందంటున్నారు రేణుక. ‘కొత్తగా వచ్చిన బ్రాండ్లు, వస్తువుల గురించి ఫేస్‌బుక్‌లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అందరికీ తెలుసు. అందుకే మా ప్రాజెక్టుకు దీన్ని వేదికగా మలచుకున్నాం. ఎవరైనా షాప్‌కి వెళ్లినపుడు ఇచ్చిన డిస్కౌంట్ కూపన్లపై ఉన్న యూఆర్‌ఎల్ నంబర్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే వెంటనే మనం కొన్న వస్తువు ఫొటో డిస్‌ప్లే అవుతుంది. ఆ ఫొటో మన ఫేస్‌బుక్ మిత్రులందరికీ పోస్ట్ అవుతుంది. ఆ వస్తువు ఎవరికైనా నచ్చితే దానిని సెల్‌ఫోన్‌లో ఓ ఫొటో తీసి సదరు షాప్‌లో చూపిస్తే మీకు అదనంగా మరో పది శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నమాట’ అని చెప్పారు రేణుకా నేనావత్.
 
 మార్కెటింగ్ మంత్ర..
 సిటీజనాలకు డిఫరెంట్ డిస్కౌంట్ ఆఫర్ల ఇస్తున్న మాల్స్.. వాటిని ప్రచారం చేయడంలో పూర్తిగా సక్సెస్ కావడం లేదంటున్నారు పీయూష్ గురువాణి. ‘ప్రస్తుతం ప్రపంచంలో మార్కెటింగ్‌ను మించిన పెద్ద టాస్క్ మరొకటి లేదు. అందుకే యువకులను టార్గెట్ చేస్తూ మేం ఈ సాఫ్ట్‌వేర్  తయారుచేశాం. ఈ ప్రాజెక్ట్‌కు మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింద’ని  చెప్పారు పీయూష్. చెన్నైలో ట్రిపుల్ ఐటీ పూర్తిచేసిన ఈ యువ టెకీలు తమ ప్రాజెక్ట్‌కు చక్కని ప్రోత్సాహం లభించినందుకు వియ్ ఆర్ వెరీ లక్కీ
 అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement