ఎంజాయ్‌మెంట్‌కి ఏ వన్ ప్లాట్‌ఫాం.. | goa is care off for the enjoyment | Sakshi
Sakshi News home page

ఎంజాయ్‌మెంట్‌కి ఏ వన్ ప్లాట్‌ఫాం..

Published Mon, Nov 24 2014 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

ఎంజాయ్‌మెంట్‌కి ఏ వన్ ప్లాట్‌ఫాం..

ఎంజాయ్‌మెంట్‌కి ఏ వన్ ప్లాట్‌ఫాం..

మండే సూర్యుడు.. మనూరికి వచ్చాడు. మస్తు సందడిని పంచాడు. మళ్లీ వచ్చే ఏడాది ఇలాగే వస్తానని చెప్పి ఎంచక్కా వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం సిటీలో కిర్రాక్ పుట్టించిన సన్‌బర్న్ ఈవెంట్‌ని పార్టీ పీపుల్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ‘ఈవెంట్ ఇక్కడే ఇలా ఉంటే ఇక గోవాలో ఎలా ఉంటుందో..’ అనేది ఇప్పుడు సిటీలో నడుస్తోన్న టాక్. డిసెంబర్‌లో అక్కడ జరిగే ఫెస్ట్‌కి ‘గో.. గోవా’ అంటూ ఇప్పటి నుంచే ‘ఆన్‌లైన్’లో ఉన్నారు. ఇంతకీ ఆ మండేసూర్యుడు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఏం మండించాడు?.. తెలుసుకోవాలంటే.. రీడ్ దిస్ హాట్ అండ్ ఎనర్జిటిక్ స్టోరీ...

హైదరాబాద్ ఫుల్ హీట్
నగరంలో తొలిసారి గచ్చిబౌలిలోని బౌండరీ హిల్స్‌లో నిర్వహించిన సన్‌బర్న్ ఈవెంట్ సూపర్‌‘హీట్’ అయింది. దీనికి కనీసం 8000 మందికి పైనే పార్టీ లవర్స్ అటెండయ్యారు. ఎంట్రీ టికెట్ రూ.2 వేలు నుంచి మొదలుపెట్టి కేటగిరీని బట్టి విక్రయించారు. చాలామంది బ్లాక్‌లో రూ.లక్ష పెట్టి మరీ కొన్నారని సమాచారం. కొన్ని స్పెషల్ కేబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులకు రూ.కోట్లలోనే ఖర్చయిందని వినికిడి. ఈవెంట్‌కి స్పెషల్ ఎట్రాక్షన్‌గా హాజరైన డీజే ఆఫ్రోజాక్ కేవలం 30 నిమిషాలు మాత్రమే మ్యూజిక్ ప్లే చేశాడు.

మరోవైపు మద్యం మోతాదు మించిన యువత హడావుడి మ్యూజిక్ లవర్స్‌ను కొంత భయపెట్టినా.. మొత్తం మీద ఈవెంట్ ఎటువంటి గొడవలకూ తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. అయితే ‘గోవాలో జరిగే సన్‌బర్న్‌కీ దీనికీ పోలికే లేదు. అక్కడ ఇంతకు పది రెట్లు ఎక్కువ క్రౌడ్ వస్తారు. మ్యూజిక్, సెట్స్ అంతా చాలా డిఫరెంట్’ అంటూ గోవాలో జరిగే సన్‌బర్న్‌ను కూడా చూసొచ్చిన ఒక పార్టీ లవర్ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా.. హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటివరకూ ఇలాంటి ఈవెంట్ నిర్వహించలేదని పార్టీ సర్కిల్ అంతా దాదాపు అంగీకరిస్తోంది.
 
బుకింగ్స్ షురూ..
సిటీలో ఈ ఈవెంట్ ఇచ్చిన కిక్‌తో... డిసెంబర్ 27 నుంచి గోవాలో ప్రారంభమయ్యే ఈ సెన్సేషన్ సన్‌బర్న్ ఈవెంట్‌కు టికెట్స్ కోసం అప్పుడే సిటిజనులు ఆన్‌లైన్‌లో అన్వేషణ మొదలెట్టేశారు. ఈసారి 8వ ఏడాది సన్‌బర్న్.. గోవాలో మరిన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్‌తో నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఆసియాలోనే ఏ ఈవెంట్‌కూ ఏర్పాటు చేయనంత పెద్ద స్టేజ్‌ను దీని కోసం నెలకొల్పనున్నారు. ఈవెంట్‌లో భాగంగా 3 రోజుల పాటు నార్త్ గోవాలో జరిగే ఆఫ్టర్ డార్క్ పార్టీస్ మరో స్పెషల్.

‘‘ఈ రోజుల్లో అందరూ బిజీ. చాలామందికి సూర్యుడిని చూసే సమయం కూడా లేదు. రోజూ పొద్దున్నే 5 గంటలకు లేచి సూర్యోదయం చూస్తే వచ్చే ఆనందం, సూర్యాస్తమయం చూస్తే కలిగే ప్రశాంతత వర్ణించలేం. రోజూ ఉచితంగా మన కళ్ల ముందు జరిగే మహాద్భుతమైన ఈవెంట్స్ అవి. మల్టీప్లెక్స్‌లో కన్నా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్, రిఫ్రెషింగ్ ఫీలింగ్‌ని ఇవి అందిస్తాయి. అంత గొప్పగా ఉండాలని కాదు దాని గొప్పతనం తెలియాలనే దీనికి సన్‌బర్న్ అని పేరు పెట్టాను’’ అంటారు దీని ఫౌండర్ డెరైక్టర్ శైలేంద్రసింగ్.

గ్లోబల్ బ్రాండ్ క్రియేట్ చేయగలిగాం...
అంటారు శైలేంద్ర. ‘‘మనం తినే ఇడ్లీ, సాంబార్, లస్సీల రుచి, వాటి విలువ మనకు అర్థం కావడం లేదు. అందుకే వాటి బ్రాండింగ్ గురించి మన వాళ్లు ఆలోచించరు. దేశీ లోకల్ బ్రాండ్‌గా పుట్టి గ్లోబల్ ప్రాచుర్యం పొందినవి చాలా తక్కువ. ఆ తక్కువగా ఉన్నవాటిలో ఇప్పుడు ఒకటిగా నిలిచింది సన్‌బర్న్. సన్‌బర్న్ అంటే కేవలం డాన్స్ మస్తీ  కాదు.  మ్యూజిక్‌ని, సోషల్ గేదరింగ్‌ని, సింపుల్‌గా లైఫ్‌ని అందరితో కలిసి పంచుకోవటం’’ అంటూ వివరించారాయన.

ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ - ఇడిఎమ్
ఇడిఎమ్ అంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్‌గా సాగే ఒక స్టైల్. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ స్టైల్‌ని ఇండియాలో పాప్యులర్ చేసింది సన్‌బర్న్. ఈ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్ట్ గోవాలో 2007లో తొలిసారి మొదలైంది. అక్కడ నుంచి ఏటేటా ఒకటి తర్వాత ఒకటిగా విస్తరిస్తూ ఈ ఏడేళ్ల కాలంలో 78 సిటీలలో 2,600కు పైగా ఈవెంట్లు జరిగాయి. తద్వారా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుని ఏషియాలో నంబర్‌వన్ ఫెస్టివల్‌గా ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్స్‌లో 9వ స్థానం పొందింది.

ఎంజాయ్‌మెంట్‌కి ఏ వన్ ప్లాట్‌ఫాం..
లోకల్ టాలెంట్, లోకల్ డీజేస్‌తో పాటు, ఇతర ప్రాంతాల డీజేస్ మ్యూజిక్, డాన్స్ అంతా సందడి సందడిగా వుంటుంది. నిజానికి ఏ చిన్న ఈవెంట్ అయినా పాపులర్ కావాలంటే సెలబ్రిటీలు అవసరం. అయితే సన్‌బర్న్ పేరే ఒక సెలబ్రిటీ. అందుకే ఈ ఈవెంట్‌లో మీడియా, సెలబ్రిటీ హడావుడి ఏమీ కనిపించదు. సంగీతం, సంతోషం, ఉత్సాహం మాత్రం నిండి వుండే ఈ ఈవెంట్స్‌లో ప్రతిఒక్కరూ సెలబ్రిటీలే అంటారు ఈ ఫెస్ట్ నిర్వాహకులు. ఈ  ఫెస్ట్‌లో అందరినీ ఓలలాడించే సంగీతం తప్ప లిరిక్స్ ఉండవు. ‘‘ఇండియా ఒక యునానిమస్ కంట్రీ. ఇక్కడ ప్రాంతానికో భాష. అలాంటి చోట భాష తెలియని పాట కాసేపటికి అనాసక్తిని మిగులుస్తుంది. అందుకే యూనివర్సల్ భాష అయిన సంగీతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాం’’అని చెప్పారు శైలేంద్ర. అందుకేనేమో... ఈ ఈవెంట్‌కి హాజరయ్యే  వారందరూ ఒకే ప్లాట్‌ఫాం మీదకు వచ్చిన వాళ్లుగా కలసిపోతారు. భాష, ప్రాంతంలాంటి విభజనలు ఎవరిలో కనిపించవు.

సిటీలో సన్‌బర్న్...
గోవాలో జరిగే సన్‌బర్న్‌కు సిటీ నుంచి హాజరయ్యేవాళ్ల సంఖ్య పెద్దదే. టాలీవుడ్ హీరోలు మొదలుకుని సంపన్నులు, ఐటీ ఉద్యోగులు... వేల సంఖ్యలోనే నగరం నుంచి వెళుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునేనేమో... సిటీలో సన్‌బర్న్‌కు ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ నెల 22న తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో 10వేల మందికి పైగా పాల్గొన్నారని అంచనా. ‘ఇన్‌విక్టస్ అనే మూవీలో ఒక క్రీడ యావత్ జాతిని స్ఫూర్తి దిశగా నడిపించగలదని చెబుతుంది. అలాగే ప్రతి వారినీ సంతోషపెట్టగల, స్పూర్తినివ్వగల శక్తి మ్యూజిక్‌కి వుందని చెప్పాలనేది నా ఉద్దేశం. ఐపీఎల్ తో పాటు ఇండియాకున్న మరో గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సన్‌బర్న్’ అని శైలేంద్రసింగ్ సగర్వంగా చెప్తారు
 
గ్రేట్ ఈవెంట్...
ఈవెంట్‌కి దాదాపు 8 వేల మంది వచ్చారు. ఇట్స్ ఓవరాల్ వెరీగుడ్ ఎక్స్‌పీరియన్స్. వెరీ గుడ్ సౌండ్‌సిస్టమ్. వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సిటీ డీజేగా అంత పెద్ద ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది. ఆఫ్రోజాక్‌తో పాటు డీజేలు ఎబస్టార్, గ్రెగర్ సాల్టోలు మ్యూజిక్‌లో పీక్స్ చూపించారు. గోవాలో జరిగే సన్‌బర్న్‌లో ప్లే చేసే చాన్స్ వస్తే ఇట్స్ రియల్లీ ఎ డ్రీం కమ్ ట్రూ.
- అజయ్, డీజే
 
ఇంటర్నేషనల్ రేంజ్‌లో...
సిటీలో నాకు తెలిసి ఇప్పటి దాకా ఇలాంటి ఈవెంట్ జరగలేదు. అదీ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం)లో. హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ రేంజ్ సిటీ చేయడానికి ఇలాంటి ఈవెంట్లు అవసరం. ముగ్గురు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్‌తో ఓకే వేదికపై నుంచి కలసి వర్క్ చేయడం నాకు గొప్ప ఎక్స్‌పీరియన్స్. ముంబై కన్నా మన సిటీలోనే ఈవెంట్ చాలా బాగా జరిగిందని అఫ్రోజాక్, సాల్టోలు నాతో అన్నారు.
- శశాంక్, డీజే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement