జాయ్ ఆఫ్ గార్డెనింగ్
ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేప్స్, విభిన్నమైన కూరగాయల మొక్కలు, పూదోటలు... నగరంలో పచ్చదనం పరచుకుంది. మాదాపూర్ హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ‘హోం గార్డెన్‌స ఫెయిర్’ మనసు దోస్తోంది. హోటల్ యజమానులు, కొత్త ఇంటిని కొనుగోలు చేసేవారు, హార్టికల్చర్ స్టూడెంట్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు... విభిన్న రంగాలకు చెందిన వారంతా ఫెయిర్‌కు క్యూ కట్టారు.
ప్రముఖ మ్యూజిక్ డెరైక్టర్ ఆర్‌పీ పట్నాయక్ ప్రారంభించిన ఈ షోలో నర్సరీ, గార్డెనింగ్ ఉత్పత్తులు, పరికరాలు, వివిధ రకాల మొక్కలు కొలువుదీరాయి. అంతే కాదు... మొక్కలు పెంచే విధానంపై కూడా ఇక్కడ నిపుణులు అవగాహన కల్పించారు. పట్టణ ప్రాంత ఆవాసాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన ఇల్లు- మన కూరగాయలు’ పథకం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.
దాంతో పాటు గ్రీన్ వాల్స్, కిచెన్ గార్డెన్స్, బాల్కనీ కాన్సెప్ట్‌ల పైనా అవగాహన పెంచుకున్నారు. గ్రాస్ వరల్డ్‌లో వివిధ దేశాల ‘కార్పెట్ గ్రాస్’, బోన్సాయ్ మొక్కలు, హ్యాంగింగ్ క్రీపర్స్ వంటివెన్నో
ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈనెల 28 వరకు ఫెయిర్ కొనసాగుతుంది.