మోడల్, నటి కారా డెలావీన్... చూస్తుంటే ప్రేమలో పడినట్టుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా సింగర్ విన్సెంట్‌తో కలిసి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన యూనివర్సల్ మ్యూజిక్ ఆఫ్టర్ పార్టీలో గాళ్‌ఫ్రెండ్‌కు ఓ రొమాంటిక్ ముద్దిచ్చి పిచ్చెక్కించింది. తమ మధ్యనున్న అనుబంధాన్ని కారా, విన్సెంట్‌లిద్దరూ ఇలా చెప్పకనే చెప్పారనేది ‘సన్’ డైలీ కథనం. గత ఏడాది డిసెంబర్‌లో విన్సెంట్‌ను కలిసింది కారా. ఏం మాయ చేసిందో ఏమో... ఇక అప్పటి నుంచీ విన్సెంట్‌ను వదలకుండా ఫాలో అవుతుంది 22 ఏళ్ల కారా. అంతటితో అయిపోలేదు... విన్సెంట్ అసలు పేరు అన్నే క్లార్క్‌ను ‘ఏసీ’గా టూటూ వేయించుకుందట డెలావీన్! ఇది చూసిన హాలీవుడ్ జనం... ఈ ‘కొత్త తరహా’ ప్రేమ జంటపై ఛలోక్తులు విసురుతున్నారట. అయితే ప్రేమకు హద్దులేవీ లేవని.. ఎవరి లైఫ్ వారిదని ఈ భామలిద్దరూ చెప్పుకొంటున్నారు.