అందంగా పోటీ
మణప్పురం మిస్ సౌత్ ఇండియా-2015 ఆడిషన్స్‌లో మగువలు అందంగా పోటీపడ్డారు. వయ్యారి నడకలతో ర్యాంప్‌ను మెరిపించారు. ట్యాంక్‌బండ్ మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం జరిగిన ఈ ఆడిషన్‌లో తెలంగాణ నుంచి 15 మంది అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అందంతో పాటు... భావ వ్యక్తీకరణ, మేధస్సును వెలికి తీసేందుకు నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన నేహాచౌదరి, హనీషా, టీనా, నిఫ్ట్ విద్యార్థిని సెజల్ ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 27న మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫైనల్స్. హైదరాబాద్‌తో పాటు... చెన్నై, కొచ్చిన్, బెంగళూరుల్లో జరిగే ఆడిషన్‌సలో సెలెక్ట్ అయిన వారంతా కలసి ఈ ఫైనల్స్‌లో పోటీపడతారు.
సాక్షి, సిటీప్లస్