ఆరామ్ షహర్ | Mithali raj talks about hyderabad | Sakshi
Sakshi News home page

ఆరామ్ షహర్

Published Tue, Sep 16 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

ఆరామ్ షహర్

ఆరామ్ షహర్

ఆమె బ్యాట్ పట్టింది హైదరాబాద్‌లో.. బౌండరీ బాదిందీ సిటీలోనే.. తన ఆటతీరుతో ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయ్యింది. క్రీడాకారిణిగా ప్రపంచమంతా చుట్టొచ్చినా.. హైదరాబాద్‌ను మించిన ఆరామ్ షహర్ మరొకటి లేదంటోంది మిథాలీరాజ్. చిన్నప్పటి నుంచి తోడుగా ఉంటూ తన ఆటకు మెరుగులద్దిన సిటీతో ముడివేసుకున్న అనుభూతులను ఐ లవ్ హైదరాబాద్ అంటూ ‘సిటీప్లస్’తో షేర్ చేసుకుంది.
 - మిథాలీరాజ్
 
 నేను పుట్టింది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అయినా పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎక్స్ సర్వీస్ మ్యాన్. స్కూలింగ్ అంతా సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్‌లో సాగింది. కస్తూర్బా కాలేజ్‌లో ఇంటర్, ఉస్మానియా డిగ్రీ కాలేజ్‌లో బీఏ చేశాను.
 
 గత జన్మ గుర్తులా..
 క్రికెట్ కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల స్కూల్, కాలేజ్‌కు వెళ్లింది చాలా తక్కువ. చిన్నప్పుడు సికింద్రాబాద్‌లో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో స్కూల్ ఉండేది. హాయిగా నడచుకుంటూ వెళ్లిపోయేదాన్ని. దారంతా మట్టి రోడ్డే. టీస్టాల్స్, పూల దుకాణాలు, టిఫిన్ బండ్లు, సైకిల్ రిక్షాలతో కళకళలాడుతూ ఉండేది. ఎర్లీ మార్నింగ్ స్కూల్‌లో క్రికెట్ కోచింగ్.. అది అయిపోయాక ఇంటికి వెళ్తూ టీ స్టాల్ టీ తాగి, అక్కడే పేపర్ చదివి ఇంటికి వెళ్లేదాన్ని. ఇప్పుడు ఆ ప్లేస్ షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో నిండిపోయింది. చిన్నప్పుడు నేను చూసిన ఆ ప్రాంతం ఇప్పుడు గత జన్మ గుర్తులా అనిపిస్తుంది.
 
 గ్రౌండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్
 నాకు క్రికెట్ గ్రౌండే బెస్ట్ ఫ్రెండ్. ఇంట్లో కన్నా గ్రౌండ్‌లోనే ఎక్కువుంటా. స్కూల్ నుంచి గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, మక్కామజీద్ ఎక్స్‌కర్షన్ వెళ్లాను. భలే సరదాగా అనిపించింది. నాకు స్నేహితులు తక్కువ. స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నది ఒకే ఒక ఫ్రెండ్.  
 
 గ్రౌండ్ లైఫ్ తీరింది..

 కొన్నాళ్లు బేగంపేటలో క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్‌లో పెద్ద గ్రౌండ్ ఉండేది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు ఉండేవి. నేనీ స్థాయికి రావడానికి హెల్ప్ చేసిన గ్రౌండ్.. కాంక్రీట్ గుట్టలా మారడం వెలితిగా అనిపిస్తుంటుంది. సెవెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్ వచ్చి నుదిటికి తగిలింది. ఐబ్రో పైన ఐదు కుట్లుపడ్డాయి. అప్పటి నుంచి హెల్మెట్  పెట్టుకుంటున్నా.
 
 కృష్ణాష్టమికి ఇంటికే..
 క్రికెట్‌లోకి రాకపోయి ఉంటే క్లాసికల్ డ్యాన్సర్ అయ్యేదాన్ని. ఎనిమిదేళ్లు భరత నాట్యం నేర్చుకున్నాను. జూబ్లీహిల్స్‌లోని లిటిల్ ఇటలీ రెస్టారెంట్ అంటే ఇష్టం. అది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మా అమ్మతో వెళ్తూ ఉంటా. వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త ఐటమ్‌ని టేస్ట్ చేస్తా. ఇక్కడ తినగానే రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఎనోనిమ్ బోటిక్‌లో షాపింగ్ చేస్తాం. మా ఇంట్లో కృష్ణాష్టమి ఘనంగా చేస్తాం. ఆ రోజు మా అమ్మ పదిహేనురకాల పిండివంటలు చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు ఇంట్లో ఉండడానికే ఇష్టపడ్తాను.  
 
 సంప్రదాయ ప్రతీక
 క్రికెట్ ఆడటానికి ఎన్నో దేశాలు వెళ్లాను. ఇండియాలో ఎన్నో నగరాలు తిరిగాను. వాటి కన్నా హైదరాబాదే ఎక్కువగా నచ్చుతుంది. చరిత్రకు, సంప్రదాయానికి ఐకాన్‌గా ఉంటుంది. కొతవాళ్లు ఇక్కడ స్థిరపడటానికి సిటీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఇక క్రికెట్ పరంగా నా జర్నీ ఇంత సక్సెస్ కావడానికి కారణం హైదరాబాదే.
 -  శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement