పద్యరచన చాల సులువు
గద్యంతో పోల్చిచూడ గబగబ సాగున్
హృద్యంగా అది యుండును
మద్యంలా వైనుతేయ! వురివురి చూడన్!
సాహిత్యంలో పద్య, గద్యాలు వేటికవే ప్రత్యేకమైనవి. పద్యం పాత మద్యంలాంటిది. అందుకే, అంత హృద్యంగా ఉంటుంది. గద్యం కాస్త గంభీరంగా ఉంటుంది. ‘మధు’ర కావ్యానికి అది ‘ఉప’ద్రవంలాంటిది. గద్యం మోతాదు మించితే, కావ్య ‘రస’ సాంద్రతలో గాఢత నీరుగారిపోతుంది. పద్య, గద్యాల సమసమ్మేళనం జరిగితేనే, కావ్యం చరిత్రలో నిలిచిపోతుంది. ద్రవోపద్రవాల సవు సమ్మేళనం జరిగితేనే కిక్కు తలకెక్కుతుంది. ‘ఉప’ద్రవం మోతాదు పెరిగితే, మిగిలేది ‘వుధు’రసభంగమే. ‘వుద్య’తరగతి ‘వుందు’భాగ్యులందరికీ ఈ ‘మధు’ రకావ్య రహస్యం కరతలావులకం. గాఢమైన ‘మధు’ రసాస్వాదన చేసిన మహానుభామల్లో చాలావుంది చరిత్రలో నిలిచిపోయిన కావ్యాలను, కళాఖండాలను సృష్టించారు. ఆస్కార్ వైల్డ్, ఎర్నెస్ట్ హెమింగ్వే వంటి రచరుుతలు, విన్సెంట్ వాన్‌గో, పికాసో వంటి చిత్రకారులు మధువుల్లో అత్యంత గాఢమైన అబ్సింత్‌ను ఆస్వాదించేవారు. వారందరికీ నివాళిగా ఈ వారం..
‘మధు’రోక్తి
అబ్సింత్‌కు అద్భుతమైన వర్ణం ఉంది.. హరితం.. ఓ గ్లాసు
అబ్సింత్ కంటే ప్రపంచంలో
కవితాత్మకమైనదేవుుంది?
- ఆస్కార్ వైల్డ్,
ఐరిష్ రచరుుత, కవి
హాలోవీన్ హ్యాంగౌట్
అబ్సింత్ : 30 మి.లీ.
వోడ్కా : 15 మి.లీ.
టానిక్ వాటర్ : 60 మి.లీ.
లెవునేడ్ : 100 మి.లీ.
గార్నిష్ : నివ్ముచెక్క, నిలువునా
తరిగిన పచ్చిమిర్చి
- వైన్‌తేయుడు