
పరుగు మొదలెట్టింది ఇక్కడే..
10కే రన్‌కు సిటీ సిద్ధమైంది. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం జరగనున్న ఈ రన్‌ను ప్రారంభించేందుకు ఫ్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ సిటీకి వచ్చారు. మాసబ్‌ట్యాంక్ గోల్కోండ హోటల్‌లో శనివారం హైదరాబాద్ 10కె రన్ ఇచ్చిన పాస్తా విందులో పాల్గొన్న మిల్కాతో సిటీప్లస్ ముచ్చటించింది. 1951లో ఈ సిటీలోనే నా పరుగు ప్రారంభమైంది. లోతుకుంటలోని ఈఎంఐ సెంటర్ స్టేడియంలో పరుగెత్తా. ఈ రోజు అదే స్టేడియానికి నా పేరు పెట్టడం సంతోషంగా ఉంది. గతంలో కొండలు, గుట్టలు ఎక్కిన రోజులు గుర్తొచ్చాయి.
అథ్లెటిక్‌లో పైకి రావాలంటే మిల్క్‌సింగ్ లాగా కష్టపడాలి. భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ బంగారు పతకం చూడాలన్నదే నా కల. ఎంతో మంది మిల్కాసింగ్‌లను తయారుచేద్దామని ఓ గ్యాస్ కంపెనీ అసోసియేట్ కావాలని కోరింది. మనం కూర్చునే ఉంటే మిల్కాసింగ్ రారని, ఊరు, గల్లీల నుంచే వస్తారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ముందుకెళ్లాలని సూచించా. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఎంతో సమర్థుడు. మంచి ఆటగాళ్లను భారత్‌కు అందిస్తున్నాడు. - వీఎస్