రవిశంకర్ మెచ్చిన సితార్ స్వరఝరి | Sitar Swarazuri to like Ravi sankar | Sakshi
Sakshi News home page

రవిశంకర్ మెచ్చిన సితార్ స్వరఝరి

Published Thu, Oct 9 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

రవిశంకర్ మెచ్చిన సితార్ స్వరఝరి

రవిశంకర్ మెచ్చిన సితార్ స్వరఝరి

పండిట్ రవిశంకర్.. సంగీత రంగంలో జగమెరిగిన సితార్ విద్వాంసుడు. వందలాది శిష్యులను తయూరు చేసిన వుహా వుహోపాధ్యాయుుడు. అలాంటిది సితార్ వాద్యంలో సాక్షాత్తు పండిట్ రవిశంకర్‌నే మెప్పించడవుంటే వూటలా..? అరుుతే, పండిట్ జనార్దన్ మిత్తా ఆ ఘనతను సాధించారు. అత్యంత అభివూన శిష్యుడిగా రవిశంకర్ మెప్పు పొందిన జనార్దన్ మిత్తా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయున తండ్రి మిత్తా లక్ష్మీనరసయ్యు నిజాం రాజ్యంలో ప్రఖ్యాత వకీలు. వృత్తిరీత్యా న్యాయువాదే అరుునా, ప్రవృత్తిరీత్యా సంగీతప్రియుుడు. గురువారం సాయుంత్రమైందంటే చాలు, వకీలుగారి ఇల్లు గానా, బజానాలతో కళకళలాడేది. నిజాం పాలనలో శుక్రవారం సెలవు ఉండేది. అందుకే అప్పట్లో వారాంతపు సందడి గురువారం నుంచే మెుదలయ్యేది. వకీలుగారు పాటలు పాడటమే కాకుండా స్వయుంగా తబలా, హార్మోనియుం వారుుంచేవారు. ఇక జనార్దన్ సోదరుడూ గాయుకుడే. సోదరి సితార్ వారుుంచేది. అలాంటి సంగీత వాతావరణంలో పెరిగిన జనార్దన్‌కు బాల్యం నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. సోదరికి పెళ్లరుు అత్తారింటికి వెళ్లిపోవడంతో జనార్దన్ ఆమె సితార్‌పై సరిగవులు పలికించడం ప్రారంభించారు. స్వయుంకృషితోనే సితార్ వాద్యంపై పట్టు సాధించారు. దక్కన్ రేడియో ఆడిషన్‌కు వెళ్లి, తబలా విద్వాంసుడు షేక్ దావూద్ ఖాన్‌ను మెప్పించారు. దక్కన్ రేడియోలో 1955 వరకు కొనసాగారు.
 
 గురువుతో జీవితం వులుపు
 దక్కన్ రేడియోలో పనిచేస్తున్న కాలంలోనే సహోద్యోగుల ద్వారా పండిట్ రవిశంకర్‌తో పరిచయు భాగ్యం కలిగింది. సంగీత సమ్మేళనంలో కచేరీ కోసం రవిశంకర్ 1955లో హైదరాబాద్ వచ్చారు. అప్పటికి జనార్దన్ ఇంజనీరింగ్ సెకండియుర్ విద్యార్థి. సంగీతానికే అంకితం కావాలన్న జనార్దన్ తపన గవునించిన తండ్రి లక్ష్మీనరసయ్యు ఆయునను రవిశంకర్ వద్దకు తీసుకు వెళ్లారు. తన కొడుకును శిష్యుడిగా స్వీకరిస్తే, ఇంజనీరింగ్ చదువు వూన్పించేస్తానని చెప్పారు. లక్షణంగా చదువుకుంటున్న కుర్రాడిని చదువు వూన్పించేస్తానని స్వయుంగా తండ్రే చెప్పడంతో ‘ఆర్ యుూ క్రేజీ..’ అంటూ రవిశంకర్ ఆశ్చర్యపోయూరు. అరుుతే, జనార్దన్ వాద్యాన్ని వినేందుకు అంగీకరించారు. స్వయుంకృషితో జనార్దన్ సాధించిన ప్రతిభకు రవిశంకర్ వుుగ్ధుడయ్యూరు. జనార్దన్ వాద్యంలో చిన్న చిన్న పొరపాట్లను సరిచేసిన రవిశంకర్ ‘ప్రాథమిక అంశాలు తెలుసుకోకుండానే, అరుదైన సంగతులపై పట్టు సాధించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘అందుకే నాకు గురువు కావాలి’ అంటూ జనార్దన్ బదులిచ్చారు. అంతే! జనార్దన్‌ను అక్కున చేర్చుకుని, శిష్యుడిగా స్వీకరించారు. రవిశంకర్ శిష్యరికంలో ఆరితేరిన జనార్దన్ సితార్ వాద్యంలో గాయుకి, తంత్రకారి పద్ధతుల్లో ఉద్ధండుడిగా ఎదిగారు.
 
 సినీ ప్రస్థానం
 తెలుగు సినివూ ఆడిషన్‌లో జనార్దన్ వినిపించిన సితార్ గవుకాలు నాటి మేటి గాయుకుడు ఘంటసాలను మైవురపించారుు. ఫలితంగా, వురునాడే హైదరాబాద్‌లో సారథి స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రవుంలో కచేరీ చేయూలంటూ జనార్దన్‌కు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లో సారథి స్టూడియో 1958లో ప్రారంభమైనా, అప్పట్లో చెన్నైలోనే ఎక్కువగా తెలుగు సినివూల నిర్మాణం సాగేది. సినీ అవకాశాలు రావడంతో 1959లో జనార్దన్ చెన్నైకి తరలి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు సినీరంగం తర్వాతి కాలంలో హైదరాబాద్‌కు తరలినా, ఆయున వూత్రం చెన్నైలోనే స్థిరపడ్డారు. సినివూ పాటల్లో సితార్ గవుకాలు వినిపిస్తున్నా, ఏనాడూ శాస్త్రీయు సంగీతానికి దూరం కాలేదు. దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా కచేరీలు చేశారు. కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకువూరితో కలసి ‘ప్రశాంతం’ అనే ఫ్యూజన్ ఆల్బమ్ విడుదల చేశారు.
 హైదరాబాదీ
 పండిట్ జనార్దన్ మిత్తా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement