Ravi sankar
-
చెన్నైలో దేవీశ్రీప్రసాద్ కామెంట్స్.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్‌లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఈ ఈవెంట్లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. నితిన్ రాబిన్‌హుడ్ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్‌దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
నువ్వు చేసే పనిలో నైపుణ్యమే యోగ
యోగాను మనకు అందించిన పతంజలి మహర్షి, భగవద్గీతలో శ్రీకృష్ణుడుకూడా ‘యోగః కర్మసు కౌశలమ్’ (నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగ) అంటారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు. యోగా వలన కలిగే లాభాలు అనేక విధాలుగా ఉంటాయి. మొట్టమొదటి లాభం యోగా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన లేని జీవితాన్ని గడపటానికి మార్గాలను, విధానాలను యోగా మనకు చూపుతుంది. యోగా మానవాళికి లభించిన అత్యుత్తమమైన సంపద. సంపద అంటే ఏమిటి? మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేదే సంపద. ఈ దృష్టితో చూసినప్పుడు యోగా మనకు పూర్ణ సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి యోగా మానవాళికి సంపద. హింస లేని సమాజం, అనారోగ్యం లేని శరీరం, విచలితం కాని మనస్సు, సందేహాలు లేని బుద్ధి, గాయాలు లేని చిత్తం, బాధలు లేని ఆత్మ – ఇవన్నీ ప్రతి వ్యక్తికీ జన్మహక్కులు. మానవుని జీవితపు పరమార్థమైన ఈ లక్ష్యాన్ని, ఆనందాన్ని అందుకోవటానికే మన ప్రయత్నాలన్నీ. వాటిల్లో యోగా ఒక మార్గం. పుట్టుకతోనే మనం యోగులం యోగా అంటే శారీరకమైన వ్యాయామాలు వేయటం అని మనం అనుకుంటాం. 1980, 90లలో నేను ఐరోపా దేశాలలో పర్యటించినప్పుడు అక్కడి ప్రధాన సామాజిక వర్గాలలో యోగాను అంగీకరించేవారు కాదు. నేడు ఆ పరిస్థితి మారి, ప్రజలు యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించటం చూస్తే నాకు ఆనందంగా ఉంది. ప్రపంచమంతటా విశ్రాంతికి, ఆనందానికి, సృజనాత్మకమైన బుద్ధికి యోగా పర్యాయపదంగా మారింది. పేరొందిన వ్యాపార సంస్థలు తమ వాణిజ్య ప్రకటనలలో యోగాసనాలు వేస్తున్న లేదా ధ్యానం చేస్తున్న చిత్రాలను చూపిస్తున్నారు. తద్వారా మానసిక ప్రశాంతతను సూచిస్తున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, మనం అందరమూ యోగులుగానే పుట్టాం. శిశువు కూడా యోగా టీచరే! చిన్నారి శిశువును గమనిస్తే మీకు వేరే యోగా టీచర్ అక్కర్లేదు. ప్రపంచంలో 3 నెలల నుండి 3 సంవత్సరాల వయసు ఉన్న ఏ శిశువైనా సరే అన్ని యోగాసనాలూ వేస్తుంది. వారు శ్వాసించే విధానం, నిద్రించే విధానం, నవ్వే తీరు ప్రతిదీ యోగానే. చిన్నారి ఒక యోగా గురువు, యోగి. అలా ఉండటం వల్లనే చిన్నారి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుంది. చిన్నారి శిశువు రోజుకు 400 సార్లు చిరునవ్వులు చిందిస్తుంది. యోగా వలన మరొక ముఖ్య ప్రయోజనం ఏమంటే అది మనిషి ప్రవర్తనలో మార్పును తెస్తుంది. ఎందుకంటే మనిషికి గల ఒత్తిడిపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని తొలగించి వేయటం ద్వారా యోగా ప్రజలలో సుహృద్భావనను, చక్కని వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనః ప్రకంపనలను పెంపొందించటంలో యోగా సహాయపడుతుంది. బాగా గ్రహిస్తే బాగా చెప్పగలం మాట్లాడటం కంటే మన స్థితి ద్వారా, ప్రకంపనల ద్వారా ఎక్కువ తెలియజేయగలుగుతాం. ఆధునిక భౌతిక శాస్త్రమైన క్వాంటమ్ ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే మనం అందరమూ ప్రకంపనలను వివిధ పౌనఃపున్యాలలో వెలువరిస్తూ ఉంటాం. ఎవరితోనైనా మనకు మాటలు సరిపడకపోతే ‘మా వేవ్ లెంగ్త్ సరిపోవటం లేదు’ అనటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఎంత బాగా విషయాన్ని అవతలివారికి చెబుతున్నామనేది మనం అవతలివారి నుండి విషయాన్ని ఎంత బాగా గ్రహిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే యోగా, మన బుద్ధిని స్వచ్ఛంగా ఉంచి, విషయాల్ని సరిగ్గా గ్రహించటంలో తోడ్పడుతుంది. అంతేకాక యోగా మన వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించటంలో సహాయపడుతుంది. యోగాను మనకు అందించిన పతంజలి మహర్షి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ‘యోగః కర్మసు కౌశలమ్’ (నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగ) అంటారు. భిన్న దృక్పథాల సమన్వయం యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు. నీవు ఉన్న పరిస్థితులలో ఎంత బాగా నీ భావాలను వ్యక్తీకరిస్తావు, ఎంత నైపుణ్యంగా వ్యవహరిస్తావు అనేదే యోగా. నవీన కల్పనలు, సద్యఃస్ఫూర్తి, సృజనాత్మకమైన భావవ్యక్తీకరణ.. ఈ మూడూ యోగా వలన కలిగే అదనపు ఫలితాలు. యోగాతో ఇవి మనకు సహజంగా లభిస్తాయి. యోగా ఎల్లప్పుడూ భిన్న దృక్పథాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుంది. యోగా అంటే కలయిక అని అర్థం. అనేక విధాలుగా ప్రవర్తిల్లే జీవితపు స్థితిగతులను సమైక్యపరచటమే యోగా. మనం ఏ మతాచారాలను పాటిస్తున్నా, ఏ ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నా సరే, వాటికి అతీతంగా ప్రతి ఒక్కరం కోరుకునేది నవ్వుతూ ఆనందంగా ఉండాలనే కదా. విషాదానికి మూలకారణం ఏమిటో తెలుసుకున్నప్పుడే ఆనందం మనకు లభించగలదు. విశాల దృక్పథం లేకపోవటం, ఒత్తిడి, ఆందోళన.. ఇవి విషాదానికి కారణాలు. జాతీయ స్థూల ఆనందం ఐరోపా సమాఖ్యలో కొంతకాలంగా జి.డి.హెచ్ (స్థూల జాతీయ ఆనందం) గురించి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి నుండి స్థూల జాతీయ ఆనందం వైపు పయనిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు అద్భుతంగా ఉపయోగపడే పనిముట్టు మన చేతిలో ఇప్పుడు ఉంది. నేడు జనాభాలో అత్యధికులు మానసికమైన కుంగుబాటుతో బాధపడుతున్నారు. మందులు వేసుకోవటం ఒక్కటే దానికి జవాబు కాదు. మనలో ఉత్సాహాన్ని పెంచి ఆనందాన్ని ఇవ్వటానికి ఒక సహజమైన విధానం.. మనం గాలి పీల్చేటంత సహజమైనది కావాలి. అటువంటి ఆనందం కోసమే ప్రతి ఒక్కరూ వెతికేది. ఒత్తిడులు, ఆందోళనలు, రోజువారీ జీవితంలో మనకెదురయ్యే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ ముఖంలో చిరునవ్వులు పూయించటమే యోగా ముఖ్య ఉద్దేశం. ∙శ్రీశ్రీ రవిశంకర్ -
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!
న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది. పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు. స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో ఈ కామర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు. -
గురుదాస్ పూర్ లో కొనసాగుతున్న గాలింపు
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్, పఠాన్ కోట్ జిల్లాలో మళ్లీ అప్రమత్తత ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు సంచారిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన భద్రత దళాలు బుధవారం నుంచి గాలింపు చేపట్టాయి. టిర్బీ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో సైనికులు, పంజాబ్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో చెరుకు తోటలు అధికంగా ఉండడంతో సోదాలు చేయడానికి భద్రత బలగాలు శ్రమించాల్సి వస్తోంది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సైనిక బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. -
రవిశంకర్ మెచ్చిన సితార్ స్వరఝరి
పండిట్ రవిశంకర్.. సంగీత రంగంలో జగమెరిగిన సితార్ విద్వాంసుడు. వందలాది శిష్యులను తయూరు చేసిన వుహా వుహోపాధ్యాయుుడు. అలాంటిది సితార్ వాద్యంలో సాక్షాత్తు పండిట్ రవిశంకర్‌నే మెప్పించడవుంటే వూటలా..? అరుుతే, పండిట్ జనార్దన్ మిత్తా ఆ ఘనతను సాధించారు. అత్యంత అభివూన శిష్యుడిగా రవిశంకర్ మెప్పు పొందిన జనార్దన్ మిత్తా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయున తండ్రి మిత్తా లక్ష్మీనరసయ్యు నిజాం రాజ్యంలో ప్రఖ్యాత వకీలు. వృత్తిరీత్యా న్యాయువాదే అరుునా, ప్రవృత్తిరీత్యా సంగీతప్రియుుడు. గురువారం సాయుంత్రమైందంటే చాలు, వకీలుగారి ఇల్లు గానా, బజానాలతో కళకళలాడేది. నిజాం పాలనలో శుక్రవారం సెలవు ఉండేది. అందుకే అప్పట్లో వారాంతపు సందడి గురువారం నుంచే మెుదలయ్యేది. వకీలుగారు పాటలు పాడటమే కాకుండా స్వయుంగా తబలా, హార్మోనియుం వారుుంచేవారు. ఇక జనార్దన్ సోదరుడూ గాయుకుడే. సోదరి సితార్ వారుుంచేది. అలాంటి సంగీత వాతావరణంలో పెరిగిన జనార్దన్‌కు బాల్యం నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. సోదరికి పెళ్లరుు అత్తారింటికి వెళ్లిపోవడంతో జనార్దన్ ఆమె సితార్‌పై సరిగవులు పలికించడం ప్రారంభించారు. స్వయుంకృషితోనే సితార్ వాద్యంపై పట్టు సాధించారు. దక్కన్ రేడియో ఆడిషన్‌కు వెళ్లి, తబలా విద్వాంసుడు షేక్ దావూద్ ఖాన్‌ను మెప్పించారు. దక్కన్ రేడియోలో 1955 వరకు కొనసాగారు. గురువుతో జీవితం వులుపు దక్కన్ రేడియోలో పనిచేస్తున్న కాలంలోనే సహోద్యోగుల ద్వారా పండిట్ రవిశంకర్‌తో పరిచయు భాగ్యం కలిగింది. సంగీత సమ్మేళనంలో కచేరీ కోసం రవిశంకర్ 1955లో హైదరాబాద్ వచ్చారు. అప్పటికి జనార్దన్ ఇంజనీరింగ్ సెకండియుర్ విద్యార్థి. సంగీతానికే అంకితం కావాలన్న జనార్దన్ తపన గవునించిన తండ్రి లక్ష్మీనరసయ్యు ఆయునను రవిశంకర్ వద్దకు తీసుకు వెళ్లారు. తన కొడుకును శిష్యుడిగా స్వీకరిస్తే, ఇంజనీరింగ్ చదువు వూన్పించేస్తానని చెప్పారు. లక్షణంగా చదువుకుంటున్న కుర్రాడిని చదువు వూన్పించేస్తానని స్వయుంగా తండ్రే చెప్పడంతో ‘ఆర్ యుూ క్రేజీ..’ అంటూ రవిశంకర్ ఆశ్చర్యపోయూరు. అరుుతే, జనార్దన్ వాద్యాన్ని వినేందుకు అంగీకరించారు. స్వయుంకృషితో జనార్దన్ సాధించిన ప్రతిభకు రవిశంకర్ వుుగ్ధుడయ్యూరు. జనార్దన్ వాద్యంలో చిన్న చిన్న పొరపాట్లను సరిచేసిన రవిశంకర్ ‘ప్రాథమిక అంశాలు తెలుసుకోకుండానే, అరుదైన సంగతులపై పట్టు సాధించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘అందుకే నాకు గురువు కావాలి’ అంటూ జనార్దన్ బదులిచ్చారు. అంతే! జనార్దన్‌ను అక్కున చేర్చుకుని, శిష్యుడిగా స్వీకరించారు. రవిశంకర్ శిష్యరికంలో ఆరితేరిన జనార్దన్ సితార్ వాద్యంలో గాయుకి, తంత్రకారి పద్ధతుల్లో ఉద్ధండుడిగా ఎదిగారు. సినీ ప్రస్థానం తెలుగు సినివూ ఆడిషన్లో జనార్దన్ వినిపించిన సితార్ గవుకాలు నాటి మేటి గాయుకుడు ఘంటసాలను మైవురపించారుు. ఫలితంగా, వురునాడే హైదరాబాద్‌లో సారథి స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రవుంలో కచేరీ చేయూలంటూ జనార్దన్‌కు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లో సారథి స్టూడియో 1958లో ప్రారంభమైనా, అప్పట్లో చెన్నైలోనే ఎక్కువగా తెలుగు సినివూల నిర్మాణం సాగేది. సినీ అవకాశాలు రావడంతో 1959లో జనార్దన్ చెన్నైకి తరలి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు సినీరంగం తర్వాతి కాలంలో హైదరాబాద్‌కు తరలినా, ఆయున వూత్రం చెన్నైలోనే స్థిరపడ్డారు. సినివూ పాటల్లో సితార్ గవుకాలు వినిపిస్తున్నా, ఏనాడూ శాస్త్రీయు సంగీతానికి దూరం కాలేదు. దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా కచేరీలు చేశారు. కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకువూరితో కలసి ‘ప్రశాంతం’ అనే ఫ్యూజన్ ఆల్బమ్ విడుదల చేశారు. హైదరాబాదీ పండిట్ జనార్దన్ మిత్తా -
మా నిర్ణయం సరైనదే!
* గోపాల సుబ్రమణ్యం వివాదంపై ప్రభుత్వం స్పష్టీకరణ * జడ్జీల నియామకంపై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనన్న రవిశంకర్ * న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని వ్యాఖ్య న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం నియామకానికి సంబంధించిన వివాదంపై కేంద్రప్రభుత్వం బుధవారం స్పందించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన గోపాల సుబ్రమణ్యం పేరును వెనక్కుపంపిన తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ‘ఆ నిర్ణయం వెనుక బలమైన, సముచితమైన కారణం ఉంద’ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అది ప్రభుత్వ హక్కని తేల్చి చెప్పారు. బుధవారం ఉదయం మరో సందర్భంలో రవిశంకర్ మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై, ప్రధాన న్యాయమూర్తిపై మోడీ ప్రభుత్వానికి అపార గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా ప్రభుత్వానికి విశ్వాసం ఉంది’ అన్నారు. సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యంను సుప్రీంజడ్జీగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసును ప్రభుత్వం పక్కనపెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా మంగళవారం తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. కొలీజియం పంపిన జాబితాపై పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగానే.. తనను ఆ జాబితా నుంచి తొలగించాల్సిందిగా గోపాల సుబ్రమణ్యం నుంచి అభ్యర్థన రావడంతో ఆయన పేరును పక్కనబెట్టామని అంతకుముందు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే, నలుగురి పేర్లతో కొలీజియం ఒక జాబితా పంపించిందని, వారిలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదర్శ్‌కుమార్ గోయల్, సీనియర్ న్యాయవాది రోహింటన్ నారిమన్‌ల పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. గోపాల సుబ్రమణ్యం పేరును మాత్రం పునః పరిశీలన కోసం తిరిగి పంపించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కక్షపూరితం: గోపాల సుబ్రమణ్యం వివాదంపై స్పందిస్తూ.. మోడీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘గతంలో అమికస్ క్యూరీగా సోహ్రా బుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడమే గోపాల సుబ్రమణ్యం పాపం’ అని పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. న్యాయవ్యవస్థతో ఘర్షణాత్మక వైఖరితో మోడీ ప్రభుత్వం డేంజర్‌జోన్‌లోకి వెళ్తోందని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ హయాంలోనే రాజ్యాంగ వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించింది. జడ్జీలేం సూపర్మ్యాన్లు కాదు.. న్యాయమూర్తులు సూపర్మ్యాన్లేం కాదని, వారికీ విశ్రాంతి అవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. సంవత్సరంలో మొత్తం 365 రోజులూ కోర్టులు పనిచేయాలన్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా సూచనపై జస్టిస్ కట్జూ బుధవారం తన బ్లాగ్‌లో స్పందించారు.