స్కై లాంతర్ ఫెస్ట్
స్కై లాంతర్‌ఫెస్ట్... అర్బన్ కల్చర్‌లో ఓ భాగం. అయితే ఈసారి ఈఫెస్ట్‌ను ‘రైజ్‌అప్’ రూరల్ కాజ్‌కోసం నిర్వహిస్తోంది. రోజంతా కష్టపడ్డా పూట గడవని బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పూనుకొంది. ఈరోజు, రేపు జరిగే ఈ ఫెస్టివల్‌కి గచిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని గోల్ఫ్‌క్లబ్ వేదికైంది.
ఈ స్కైలాంతర్ ఫెస్ట్‌లో పాల్గొనాలనుకునేవారికి రిజిస్ట్రేషన్ ఫీ 250 రూపాయలు పెట్టామని.. లాంతర్ కూడా కావాలంటే 450 రూపాయలు చెల్లించాలని రైజ్‌అప్ టీమ్ సభ్యుడు సాయినాథ్ తెలిపారు. వచ్చిన మొత్తాన్ని బీడీ కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. మంచి కాజ్‌కోసం జరుగుతున్న ఈఫెస్ట్‌లో సిటీవాసులు ఎక్కువగా పాల్గొనాలని ఆశిద్దాం!